Home /News /andhra-pradesh /

WIFE AND HUSBAND TURNED BROTHER AND SISTERS FOR BANK LOAN IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Wife And Husband: లోన్ కోసం అన్నాచెల్లెల్లుగా మారిన భార్యాభర్తలు.. ఈ కిలాడీ కపుల్ మామూలోళ్లు కాదు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Cheating couple: బ్యాంక్ లోన్ కోసం తనఖా పెట్టేందుకు ఎలాంటి ఆస్తి లేకపోవడంతో రూటు మార్చారు. ఏదో సినిమాలో చూసినట్లు భార్యాభర్తలు కాస్తా.. అన్నాచెల్లెళ్లుగా మారిపోయారు. తనపేరు పల్లా వెంకటేశ్వర్లుగా ఆధార్ కార్డు మార్చుకొని.. భార్యను చెల్లెలుగా మార్చేశాడు.

ఇంకా చదవండి ...
  సాధారణంగా బ్యాంక్ లో కావావలంటే ఏం చేస్తాం.. మన దగ్గరున్న ఏదైనా ఆస్తిని షూరిటీగా పెడతాం. నెలనెలా జీతం వచ్చే ఉద్యోగి అయితే ప్లే స్లిప్, బ్యాంక్ స్టేట్ మెంట్ ఇస్తే పర్సనల్ లోన్ వస్తుంది. వ్యాపారి అయితే సంబంధిత పత్రాలతో బిజినెస్ లోన్ పొందవచ్చు. ఆభరణాలు తాకట్టుపెట్టి గోల్డ్ లోన్ కూడా తీసుకొవచ్చు. కానీ ఓ కిలాడీ దంపతులు వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను ఆసరాగా చేసుకొని బ్యాంకుకు టోకరా వేశారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.9లక్షలకు టోకరా వేశారు. ఇందుకోసం భార్యభర్తలు కాస్తా అన్నాచెల్లెళ్ల అవతారమెత్తారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన పవన్, ప్రభావతి దంపతులు. అన్నింటిలో కలిసి ముందుకు సాగే భార్యభర్తలు.. ఓ కన్నింగ్ ప్లాన్ వేశారు.

  బ్యాంక్ లోన్ కోసం తనఖా పెట్టేందుకు ఎలాంటి ఆస్తి లేకపోవడంతో రూటు మార్చారు. ఏదో సినిమాలో చూసినట్లు భార్యాభర్తలు కాస్తా.. అన్నాచెల్లెళ్లుగా మారిపోయారు. తనపేరు పల్లా వెంకటేశ్వర్లుగా ఆధార్ కార్డు మార్చుకొని.. భార్యను చెల్లెలుగా మార్చేశాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వచ్చి అన్నాచెల్లెళ్లుగా చెప్పుకొని నివాసముంటున్నారు.

  ఇది చదవండి: అల్లుడి తమ్ముడితో అక్రమ సంబంధం..ఇద్దరి మధ్య గొడవ.. ఇంతలోనే అనూహ్య ఘటన..  ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం కొప్పరంలో భూముల విషయం తెలుసుకున్నారు. గ్రామంలోని రెండు సర్వే నెంబర్లలో 4.73 ఎకరాలు, 4.62 ఎకరాల భూములు తమ పూర్వీకుల నుంచి వచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. అంతేకాదు తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టాదార్ పాసుపుస్తకాలు కూడా పొందారు. ఈ భూములు చూపించి నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలోని చైతన్య గోదావరి బ్యాంకులో గత ఏడాదిలో ఒక్కొక్కరు రూ.4.50 లక్షల చొప్పున లోన్ తీసుకున్నారు.

  ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్నవాడ్ని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది.. మరీ అంత పచ్చి మోసమా..?


  రుణానికి సంబంధి నెలసరి వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అదికారులు విచారణ చేసి మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు అసలు వాళ్లు అన్నాచెల్లెల్లు కాదని.. భార్యాభర్తలని తేల్చారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరికి సహకరించిన మునయ్య, మల్లికార్జునరావు, జ్యోతిబాబుతో పాటు సంతమాగలూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే కిషోర్ బాబును అరెస్ట్ చేశారు.

  ఇది చదవండి: వాళ్లిద్దరిదీ ప్రేమ వెళ్లి.. ఓ రోజు భర్త మిస్సింగ్.. ఇంట్లో రక్తపు మరకలు.. అసలు మిస్టరీ ఏంటి..?


  గతంలో గుంటూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లో పరిచయమైన ఓ వ్యక్తిని దారణంగా మోసం చేశారు. వధువు కావలెను అనే యాడ్ చూసిన భార్య.. సదరు వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షల రూపాయలకు టోకరా వేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cheating, Guntur

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు