లక్ష కోట్ల కోసమే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారా... ఆ ఆరోపణల్లో నిజమెంత...

Lok Sabha Election 2019 : స్విస్ బ్యాంకుల్లో చాలా మంది నేతలు బ్లాక్ మనీ దాచినట్లు ఆరోపణలున్నాయి. జగన్ పైనా అవి వస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 23, 2019, 9:30 AM IST
లక్ష కోట్ల కోసమే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారా... ఆ ఆరోపణల్లో నిజమెంత...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
వైసీపీ అధినేత జగన్ కోర్టు అనుమతి తీసుకొని ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లారు. ఐదు రోజుల పాటూ ఆయన అక్కడ గడుపుతారు. ఇన్నాళ్లూ రాజకీయాలు, ఎన్నికల ప్రచారాలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించిన ఆయన... ఇవన్నీ మర్చిపోయి, రిలాక్స్ పొందడానికి ప్రపంచంలోనే అత్యంత అదమైన స్విట్జర్లాండ్‌లో సేద తీరాలని భావించారు. ఎలాగూ ఎన్నికల కౌంటింగ్ జరగడానికి మే 23 వరకూ అంటే నెలపాటూ సమయం ఉండటంతో జగన్ ఈ టూర్ ఎంచుకున్నారు. ఏప్రిల్ 27న హైదరాబాద్ వచ్చి తిరిగి పార్టీ నేతలతో సమావేశాల్లో తలమునకలవుతారు.

గతేడాది ఇలాగే న్యూజిలాండ్ వెళ్లిన జగన్ ఈసారి స్విస్ ఎందుకు ఎంచుకున్నారన్నదానిపై ప్రత్యర్థి పార్టీల నేతలు కొత్త ఆరోపణలు అందుకున్నారు. స్విస్ బ్యాంకులలో జగన్ లక్ష కోట్ల రూపాయల బ్లాక్ కరెన్సీని దాచుకున్నారనీ, దాన్ని చెక్ చేసుకోవడానికే స్విట్జర్లాండ్ వెళ్తున్నారనీ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఎన్నికల సందర్భంగా జగన్ తన బ్లాక్ మనీలో కొంత ఖర్చు పెట్టారనీ, మిగతా డబ్బు ఎంత మొత్తం ఉందో, దానికి ఎంత వడ్డీ వచ్చిందో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆయన డైరెక్టుగా స్విస్ బ్యాంకుల దగ్గరకే వెళ్తున్నారనీ ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.


ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా జగన్ స్విట్జర్లాండునే ఎంచుకోవడానికి ప్రధాన కారణం బ్లాక్ మనీయే అంటున్నారు వైరి పక్షాల నేతలు. స్విట్జర్లాండ్ ప్రభుత్వ అనుమతితో... అక్కడి బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు వివరాలు బయటకు తెస్తే, వాటిలో జగన్ పేరు కూడా ఉంటుందని అంటున్నారు. పైకి విహార యాత్ర అని చెబుతూ జగన్, తెరవెనక బ్లాక్ మనీ లెక్కల కోసమే స్విట్జర్లాండ్ వెళ్లారనీ, ప్రజలను మోసం చేస్తున్నారనీ ఆరోపిస్తున్నారు.

స్విట్జర్లాండ్‌లో చాలా బ్యాంకులు భారతీయుల బ్లాక్ మనీని దాచి పెడుతున్నాయన్న విషయం ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్నదే. ఆ వివరాల్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఐతే... జగన్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలైతే చూపించట్లేదు. ఎప్పట్లాగే రాజకీయ ఆరోపణలే చేస్తున్నారు. జగన్ మాత్రం ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారని వైసీపీ వర్గాలు తెలిపాయి. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత అన్నది ఆరోపణలు చేసేవారే నిరూపించాలి. 

ఇవి కూాడా చదవండి :

LIC AAO Recruitment 2019 : ఎల్ఐసీ ఏఏఓ రిక్రూట్‌మెంట్... 590 ఉద్యోగాలు... మే 5, 6న ఎగ్జామ్స్సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...

కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

ఆ తోకచుక్కను 7,000 ఫొటోలు ఎందుకు తీశారు... అసలు విషయం ఇదీ...

First published: April 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు