ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు... తలెత్తిన ఉద్రిక్తలపై కంటే... ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల స్లిప్పులపై ఎక్కువ చర్చ జరుగుతోంది. అసలు ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు రూ.9 కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్ యంత్రాల్ని వాడకంలోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రజలు తాము ఎవరికి ఓటు వేశారో... వీవీప్యాట్‌లో 7 సెకండ్ల పాటూ కనిపించే స్లిప్‌ని చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆ స్లిప్.. యంత్రంలో పడిపోతుంది. ఎవరైనా తాము నొక్కిన గుర్తుకు ఓటు పడలేదని భావిస్తే, వెంటనే ఈసీ అధికారులను ప్రశ్నించవచ్చు. అది నిరూపించేందుకే వీవీప్యాట్లను తెచ్చింది ఈసీ. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలంతా... వీవీప్యాట్లలో ఎవరికి ఓటు పడిందో చూసుకున్నవారే. ఒకట్రెండు చోట్ల ఒక గుర్తుకు ఓటేస్తే, వేరే గుర్తుకు ఓటు పడినట్లు వీవీప్యాట్ స్లిప్పులలో కనిపించిన మాట వాస్తవమే. అలాంటి చోట ఎన్నికల ప్రక్రియను అధికారులు ఆపివేశారు కూడా.
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానికంటే... ప్రస్తుతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశమే ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు చెబుతుండటం వల్ల... ఈ అంశం ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపించట్లేదు.
ఇవి కూడా చదవండి :
50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే... మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు...
ప్రేమించుకున్నారు... బ్రేకప్ అయ్యింది... ఆ తర్వాత ఆమెకు పోర్న్ ఫొటోలు పంపి...
లవర్‌ని ఏటీఎం కార్డులా వాడుకుని పరారైన ప్రియుడు.. కోపంతో ప్రియురాలు..
టార్గెట్ కేసీఆర్... చంద్రబాబు ప్లాన్ అదేనా... 40 రోజుల్లో ఏం చెయ్యబోతున్నారంటే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.