హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విక్రమ్ ల్యాండర్ ఎందుకు సిగ్నల్స్ అందుకోవట్లేదు...? చంద్రయాన్-1 డైరెక్టర్ ఏమన్నారంటే...

విక్రమ్ ల్యాండర్ ఎందుకు సిగ్నల్స్ అందుకోవట్లేదు...? చంద్రయాన్-1 డైరెక్టర్ ఏమన్నారంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chandrayaan 2 : చంద్రయాన్-2లోని మూడు కీలక విభాగాల్లో రెండోదైన విక్రమ్ ల్యాండర్‌ నుంచీ ఇస్రోకి సిగ్నల్స్ రావట్లేదు. మరో రెండు నిమిషాల్లో చందమామ ఉపరితలాన్ని తాకే సమయంలో... విక్రమ్ ల్యాండర్ నుంచీ... ఇస్రోకి... సిగ్నల్స్ రాక నిలిచిపోయింది.

ఇంకా చదవండి ...

ISRO Chandrayaan 2 : దేశప్రజలు ఆనందపడే విషయమొకటి ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఆదివారం చెప్పారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ ద్వారా... విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టామనీ, అది చందమామ ఉపరితలంపై ఉందని తెలిపారు. కానీ... దాని నుంచీ సిగ్నల్స్ మాత్రం రావట్లేదని అన్నారు. విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించిన థెర్మల్ ఇమేజ్‌ను చంద్రయాన్-2 ఆర్బిటర్... ఇస్రోకి పంపిందని వివరించారు. ఐతే... చంద్రయాన్-1 డైరెక్టరైన మైల్‌స్వామి అన్నాదురై... చందమామ ఉపరితలంపై ఉన్న అవరోధాలే... విక్రమ్ ల్యాండర్‌కు సిగ్నల్స్ అందనివ్వకుండా చేస్తూ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని గుర్తించామన్న ఆయన... అది సాఫ్ట్ ల్యాండ్ కాదని అనిపిస్తోందన్నారు. విక్రమ్ ల్యాండర్‌తో కనెక్ట్ అవ్వడానికి చాలా అవరోధాలున్నాయని ఆయన వివరించారు.


చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు ప్రత్యేకంగా ఆన్‌బోర్డ్ కెమెరా ఒకటుంది. అదే థెర్మల్ ఇమేజ్ తీసింది. ఆ కెమెరాకి అత్యంత ఎక్కువ రిజల్యూషన్ ఉండటం వల్ల... అది తీసిన ఫొటో చాలా స్పష్టంగా ఉంటుంది. ఐతే... ప్రస్తుతం ఆర్బిటర్... చందమామకు 100 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. అందువల్ల అది 100 కిలోమీటర్ల ఎత్తు నుంచీ ఫొటో తీసినట్లు లెక్క. అందువల్ల ఆ ఫొటో మరీ ఎక్కువ క్లారిటీతో ఉండకపోవచ్చు. అయినప్పటికీ... దానితోనే... విక్రమ్ ల్యాండర్‌ ఎక్కడుందో గుర్తించగలిగారు ఇస్రో శాస్త్రవేత్తలు.


ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ ఆర్బిటర్‌కి అందగలవు. అలాగే... ఆర్బిటర్ నుంచి సిగ్నల్స్ ల్యాండర్‌కి అందగలవు. ప్రస్తుతానికి ఇస్రో శాస్త్రవేత్తలు... ఆర్బిటర్ నుంచీ ల్యాండర్‌కు సిగ్నల్స్ పంపిస్తున్నారు. కానీ ల్యాండర్ వాటిని అందుకోవట్లేదు. సిగ్నల్స్ అందుకుంటే తప్ప ల్యాండర్ నుంచీ సమాచారం... ఆర్బిటర్‌కీ... అక్కడి నుంచీ భూమికీ వచ్చే అవకాశాలు లేవు. సెప్టెంబర్ 20 వరకూ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ రాబట్టేందుకు ప్రయత్నిస్తామంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అప్పటిలోగా... సిగ్నల్స్ రాకపోతే... ఇక ఆ ల్యాండర్ పనిచేసే అవకాశాలు లేనట్లే.

First published:

Tags: Chandrayaan-2, ISRO

ఉత్తమ కథలు