Sankranti Special: దక్షిణ భారతదేశం (South India)లో జరుపుకునే అతి పెద్ద పండుగగా సంక్రాంతి (Sankrati)కి ప్రసిద్ధి ఉంది. తెలుగు ప్రజలంతా ఎక్కడ ఉన్నా ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు.. లేదా ఎంత దూరంలో అయినా.. విదేశాల్లో ఉన్నా సరే.. ఈ పండుగకు సొంతూరుకు రావాలని ఆరాటపడతారు.. అందరికీ అంత ప్రత్యేకం ఈ పండుగ. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ.. మొదటి రోజు భోగి (bhogi), రెండో రోజు సంక్రాంతి (sankranti), మూడో రోజు కనుమ(kanuma).. ఇలా మూడు రోజు పాటు సందడి కనిపిస్తోంది.. ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది జనవరి 14 నుండి 17 వరకు మూడు రోజులు సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం.. రైతన్నలే.. ఆరుగాలం శ్రమించిన పంట తమ చేతికి వచ్చాయనే ఆనందంతో రైతులు ఉంటారు. వారి ఆనందాన్ని అందరితో పంచుకునేందుకు జరుపుకునే పండుగే సంక్రాంతి. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగకు సంబంధించి ఒక ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం.. ప్రజలు తమ ఇళ్లలో పాత వస్తువులను తీసివేసి కొత్త వాటిని తీసుకువస్తారు. అంతేకాదు పేద ధనిక అనే తేడాలేదు.. ప్రతి ఒక్కరూ తమ శక్తీకి తగినట్లు కొత్త బట్టలను ధరిస్టారు. ఉత్తర భారతదేశంలో లోహ్రీ (Lohri)కి ఎంత ప్రత్యేకత ఉందో.. అదే విధంగా దక్షిణ భారతదేశంలో ఈ సంక్రాంతికి అంతే ప్రాముఖ్యత ఉంది.
దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వివిధ ఆచారాలతో సంక్రాంతిని జరుపుకుంటారు. సంతోషాలు ఇచ్చే పండుగ కూడా అని గుర్తింపు ఉంది. రైతన్నల ఇళ్లలో సిరులు కురిపించే సమయం కాబట్టి.. ఈ పండుగను అలా అంటారు.. ఈ పండుగ ఈ మధ్యనే ప్రారంభమైంది కాదు. ఈ పండుగకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెబుతారు. సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులో కూడా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి లేదా పొంగల్, మూడవ రోజు కనుమ (మట్టు పొంగల్) నాల్గవ రోజు ముక్కనుమ ( కన్యా పొంగల్) గా ఘనంగా జరుపుకుంటారు. కొంతమంది సంక్రాంతి నుంచి తమకు కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని కూడా అనుకుంటారు.
ఇదీ చదవండి ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్యే కేతిరెడ్డి Vs కలెక్టర్ ఇష్యూలో ఆరని ఆగ్రహ జ్వాలలు
మూడు రోజులకు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. భోగీ రోజున తెల్లవారు జామునే భోగిమంటలను వేస్తారు. ఇంట్లో చిన్న పిలల్లు ఉంటె.. ఆ రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు. రెండో రోజు సంక్రాంతి లేదా పెద్దల పండగ.. ఈరోజు తమ పుర్వికులను స్మరించుకుంటారు. కొంతమంది బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు. మూడవ రోజున శివునికి ఇష్టమైన నందిని పూజించడం ఆచారం. అందుకనే ఈ రోజు ఎద్దులను పూజిస్తారు. నాల్గవ రోజు అంటే చివరి రోజు ముక్కనుమ రోజున అమ్మవారిని పూజించి నైవేద్యం పెడతారు. సంక్రాంతి అన్నదాతకు ఆనందం ఇచ్చే పండగ. వచ్చే పంటలు కూడా బాగుండాలని కోరుకుంటూ.. సూర్యభగవానుని పూజిస్తారు.
ఈ పండుగను దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా , ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు. ఈ సంక్రాంతి పండగ రోజున సూర్య భగవానుడు ప్రత్యెక పూజలను అందుకుంటాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.