టాలీవుడ్‌ నటులను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా... చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?

AP Assembly Elections 2019 : ఎన్నికల సమరంలో టాలీవుడ్ నుంచి కూడా హీట్ పెరిగింది. టీడీపీని విమర్శిస్తున్న వారిపై చంద్రబాబు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

news18-telugu
Updated: April 3, 2019, 6:19 AM IST
టాలీవుడ్‌ నటులను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా... చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
సరిగ్గా ఎన్నికల ప్రచారం వారం రోజుల్లో ముగుస్తుందనగా... టీడీపీ అధినేత చంద్రబాబు... ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ నటీనటులను టార్గెట్ చేశారు. ఈమధ్య వైసీపీలో చేరుతున్న నటుల్లో చాలా మంది టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. మోహన్ బాబు, జీవిత, రాజశేఖర్, అలీ, హేమ, ఆది ఇలా చాలా మంది టీడీపీ పాలన అస్తవ్యస్థంగా ఉందనీ, అవినీతితో నిండిపోయిందనీ, సరిగ్గా ఎన్నికల టైంలో బ్లాక్ మనీ బయటకు తీసి... పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నారనీ ఇది చంద్రబాబు కొత్త ఎత్తుగడ అనీ ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ నటీనటుల నుంచీ సడెన్‌గా తుఫానులా విమర్శలు వస్తుండటంతో... టీడీపీ అంతర్మథనంలో పడింది. రివర్స్ ఎటాక్ చేస్తూనే... అసలు వాళ్లంతా ఎందుకిలా రివర్స్ అవుతున్నారో తనదైన కోణంలో ఓ కారణాన్ని చెప్పింది.

వైసీపీకి సపోర్ట్ చేస్తున్న టీఆర్ఎస్... అందులో భాగంగా... టాలీవుడ్ ప్రముఖులతో టీడీపీపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారన్నది చంద్రబాబు వాదన. హైదరాబాద్‌లో ఉన్న టాలీవుడ్ నటీనటుల ఆస్తుల్ని లాక్కుంటానని కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో... మరో గత్యంతరం లేక... టాలీవుడ్ నటీనటులు టీడీపీని టార్గెట్ చేస్తున్నారంటున్నా్రు చంద్రబాబు. ఆయన చేస్తున్న ఈ ఆరోపణలకు చంద్రబాబు కానీ టీడీపీ నేతలు గానీ ఎలాంటి ఆధారాలూ చూపించలేదు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే.


టాలీవుడ్ విషయంలో చంద్రబాబు కాస్త ఆవేశంగానే కామెంట్లు చేశారు. ఎన్నికల సమయంలో కామెంట్లు చేస్తున్న నటులంతా... ఎన్నికలు పూర్తవగానే తిరిగి హైదరాబాద్‌కి పారిపోతారంటూ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీని తిట్టడానికి వీళ్లంతా ఎవరు తమ్ముళ్లూ అంటూ ఆయన ప్రచారంలో విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు మాట వినని టాలీవుడ్ : ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలయ్యాక... హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు... అమరావతికి వెళ్లారు. అదే సమయంలో... టాలీవుడ్‌ని ఏపీకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. విశాఖను టాలీవుడ్ కేంద్రంగా మార్చుతానని మాట ఇచ్చారు. ఇదంతా నాలుగేళ్ల కిందట జరిగిన పరిణామం. ఐతే... చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. టాలీవుడ్ కదిలి రాలేదు. అక్కడికీ టీడీపీ నేతలు... కొన్ని సినిమాల ప్రీరిలీజ్ ఫంక్షన్లను విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమండ్రి లాంటి చోట్ల నిర్వహించారు కూడా. అయినప్పటికీ... టాలీవుడ్ మాత్రం హైదరాబాద్‌ని విడిచిపెట్టలేదు. ఇది ఒకరకంగా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించిన అంశమే. టాలీవుడ్ కూడా కదిలివచ్చివుంటే... అది ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడేదని భావించిన చంద్రబాబుకి ఒకింత నిరాశ ఎదురైనట్లే.ఈ పరిస్థితుల్లో తిరిగి ఎన్నికలు రావడం, టాలీవుడ్ నటుల్లో చాలా మంది టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో... ఇప్పటికే టాలీవుడ్‌పై ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు... తాజాగా మరింత ఆగ్రహం పెంచుకున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు రాజకీయ కోణంలో కేసీఆర్‌పై ఆరోపణలు చేశారా... లేక నిజంగానే కేసీఆర్ టాలీవుడ్ నటీ నటుల్ని బెదిరిస్తున్నారా అన్నది తేలాలంటే... కచ్చితమైన ఆధారాలు ప్రజల ముందుకు రావాలి. మరో వారంలో ఈ ఎన్నికల కోలాహలం అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఆరోపణలన్నీ గాల్లో కలిసిపోతాయి. ఈ కొద్ది కాలంలో ఆధారాలు బయటకు వస్తాయని ఆశించలేం.

 

ఇవి కూడా చదవండి :నారా లోకేష్ నకిలీ... జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఫ్యూచర్... రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్

రిటర్న్ గిఫ్టుకీ రూ.1000 కోట్లకీ సంబంధమేంటి... టీడీపీ నేతలు ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే
First published: April 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading