ఈవీఎంలపై ఎందుకింత చర్చ... ప్రజలకు లేని టెన్షన్ పార్టీలకు అవసరమా...

AP Assembly Election 2019 : ఏపీలో ఎన్నికలు జరిగి రెండు వారాలు దాటినా ఇప్పటికీ పార్టీలు ఈవీఎంల మొరాయింపు, వీవీప్యాట్ స్లిప్పులపై వేడి రగిలిస్తూనే ఉన్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 26, 2019, 5:43 AM IST
ఈవీఎంలపై ఎందుకింత చర్చ... ప్రజలకు లేని టెన్షన్ పార్టీలకు అవసరమా...
సీఈసీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు (ANI)
  • Share this:
బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ... 2009, 2014లో కంటే 2019లో ఈవీఎంలపై ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేస్తారనీ, ట్యాంపరింగ్ అవుతాయనీ, ఒకరికి ఓటు వేస్తే మరికొరికి ఓటు పడుతోందనీ ఇలా రకరకాలుగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకే కేంద్ర ఎన్నికల సంఘం వీవీప్యాట్ మెషిన్లను తెచ్చింది. వాటి ద్వారా ప్రజలు ఓటు వేసినప్పుడు ఎవరికి ఓటు వేసిందీ క్లియర్‌గా చూసుకున్నారు. 7 సెకండ్ల పాటూ కనిపించే రిసీట్‌లో ఏ గుర్తుకు ఓటు పడిందో తెలుసుకున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. పార్టీలు మాత్రం ఈవీఎంల అంశాన్ని లేవనెత్తి... వాటి ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు యత్నిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 30 శాతం ఈవీఎంలు మొరాయించాయన్నది కొందరు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఇది నిజం కాదు. ఏపీ ఎన్నికల్లో మొత్తం 46 వేలకు పైగా ఈవీఎంలను ఉపయోగించారు. వాటిలో మొరాయించినవి దాదాపు 400. అధికారులు 300 ఈవీఎంలను తిరిగి సరిచేశారు. 100 ఈవీఎంలను మాత్రం తొలగించి, వాటి స్థానంలో రిజర్వ్‌గా ఉంచిన ఈవీఎంలను తిరిగి సెట్ చేశారు. టీడీపీ ఆరోపించినట్లు 30 శాతం ఈవీఎంలు పనిచేయకపోవడమంటే... 13,000కు పైగా ఈవీఎంలు మొరాయించినట్లు లెక్క. ఇది ఏమాత్రం నమ్మదగిన అంశం కాదు. అసలు ఇన్ని ఈవీఎంలు మొరాయిస్తే, ప్రజలు ఊరుకుంటారా. ఎన్నికలు వాయిదా పడేవే. చిన్న అంశాన్ని కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ రాద్ధాంతం చేస్తోందన్నది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ.

వీవీప్యాట్ స్లిప్పుల విషయంలోనూ టీడీపీ తనదైన వాదన తెస్తోంది. వీవీప్యాట్ స్లిప్పులు కొన్ని చోట్ల 7 సెకండ్లకు బదులు 3 సెకండ్లే వచ్చాయన్నది టీడీపీ ఆరోపణ. నిజానికి వీవీప్యాట్ సాఫ్ట్‌వేర్ ప్రకారం స్లిప్పు 7 సెకండ్లు కనిపిస్తుంది. లేదంటే, ఆ మిషన్ సరిగా పనిచెయ్యకపోతే అసలు స్లిప్పే కనిపించదు. అంతేగానీ... 3 సెకండ్లు మాత్రమే కనిపించే అవకాశాలు తక్కువ. అలా జరగాలంటే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చెయ్యాలి. కొన్ని వీవీప్యాట్లకు ఒకలా, మరికొన్ని వీవీప్యాట్లకు ఒకలా సాఫ్ట్‌వేర్ ఉండదు కాబట్టి... ఈ వాదనను చట్టపరంగా నిలిచే అవకాశాలు చాలా తక్కువ.

ఓవైపు తామే అధికారంలోకి వస్తామనీ, భారీ మెజార్టీతో గెలుస్తామనీ టీడీపీ నేతలంటున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబైతే ఏకంగా తాము 110-140 స్థానాలు గెలుస్తామని ప్రకటించారు కూడా. మరి అంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడు... ఈ ఈవీఎంలు, వీవీప్యాట్ల ఆందోళన ఎందుకన్నది వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న. ఓడిపోతారన్న ఉద్దేశంతోనే ఏదో ఒక వంకను వెతుక్కుంటూ... కావాలనే దేశవ్యాప్తంగా హడావుడి చేస్తున్నారన్నది వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. 2014లో ఇవే ఈవీఎంలతో వచ్చిన ఫలితాలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటున్న వైసీపీ నేతలు... ఒకవేళ ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ చెబుతున్నట్లు టీడీపీయే అధికారంలోకి వస్తే, ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును రద్దు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీడీపీ నుంచీ ఎలాంటి సమాధానమూ లేదు.

ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయనీ, వాటిని నివృత్తి చేసేందుకే 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని కోరుతున్నామని చంద్రబాబు వాదిస్తున్నారు. వీవీప్యాట్ల లెక్కింపు జరిగితే, ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశాలు దాదాపు తక్కువే. ఎందుకంటే... అన్ని పరీక్షలూ చేసిన తర్వాతే ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడకంలోకి తెచ్చారు. అందువల్ల ఆ యంత్రాలు తప్పుగా పనిచేసే అవకాశాలు దాదాపు లేవు. మొరాయిస్తాయే తప్ప... మిస్టేక్ చెయ్యవు అంటున్నారు టెక్నికల్ నిపుణులు. స్ట్రాంగ్ రూంలలో భారీ భద్రత కల్పించడం వల్ల ఆ యంత్రాల్ని ట్యాంపరింగ్, హ్యాకింగ్ చేసే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. టెక్నాలజీని ఎంతగానో నమ్మే చంద్రబాబు... ఈవీఎంల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలా నానా హంగామా చెయ్యడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఇలా ఈ అంశం ఎన్నికలు జరిగిన రెండు వారాల తర్వాత కూడా రచ్చ రేపుతూనే ఉంది.ఇవి కూడా చదవండి :

ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...

చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...

కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
Published by: Krishna Kumar N
First published: April 26, 2019, 5:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading