హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag steel plant: విశాఖ ఉక్కును టాటా దక్కించుకుంటుందా..? ఎందుకంత ప్రేమ..?

Vizag steel plant: విశాఖ ఉక్కును టాటా దక్కించుకుంటుందా..? ఎందుకంత ప్రేమ..?

విశాఖ స్టీల్ పై టాటాకు ఎందుకంత మక్కువ

విశాఖ స్టీల్ పై టాటాకు ఎందుకంత మక్కువ

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. స్టీల్ ప్లాంట్ దక్కించుకోడానికి స్వదేశీ సంస్థలు భారీగానే పోటీ పడుతున్నాయి. నష్టాల్లో ఉన్న కంపెనీ అయితే ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నాయి. టాటా సైతం ఎందుకు అంత మక్కువ చూపిస్తోంది.

ఇంకా చదవండి ...

Tata Vizag steel plant..?: విశాఖలో ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని దశాబ్ధాల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని సాధించుకుంటే.. ప్రైవేటు పరం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL)ప్రైవేటీకరణకు కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ (RINL)లో 100 శాతం వాటాలను ఉప‌సంహ‌రించాల‌ని ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న జ‌రిగిన కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ ఆమోదం తెలిపిన దగ్గర నుండి దీనిపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్నా కేంద్రం మాత్రం తాము అమలు చేయాలనుకున్న సంస్కరణలలో భాగం అడుగు ముందుకేసేందుకే సిద్దమవుతుంది. అయితే.. ప్రైవేటీకరణ కానున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని దక్కించుకునేందుకు పలు స్వదేశీ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. ఇందులో టాటా టాటా కంపెనీ కూడా సిద్ధంగా ఉందని ప్రకటించింది. దేశీయ ఉక్కు దిగ్గజంగా పేరున్న టాటా స్టీల్‌.. వైజాగ్ స్టీల్ ను దక్కించుకునేందుకు సిద్దమవుతుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.వి. నరేంద్రన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇటీవల విశాఖ స్టీల్స్ ను టాటా సంస్థ కొనుగోలు చేసే అంశంపై ఆ సంస్థ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణానది, తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఈ ఉక్కు కర్మాగారానికి అనేక అదనపు సౌకర్యాలున్నాయని తద్వారా పలు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని నరేంద్రన్ అన్నారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారానికి, దేశీయ అవసరాలను తీర్చేందుకు తగ్గట్లుగా రోడ్డు, రవాణా మార్గాలున్నాయన్నారు. ఇప్పటికే ఆగ్నేసియా మార్కెట్ల తో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న “టాటా స్టీల్” కు ఆయా మార్కెట్ల కు మరింతగా చేరువయ్యేందుకు సముద్ర తీరంలో ఉన్న విశాఖ ఉక్కు ప్రయోజనకరం గా ఉంటుందని టి.వి. నరేంద్రన్ వ్యాఖ్యానించారు. మొత్తం 6 ప్రభుత్వరంగ సంస్థల వాటాలున్న ఒడిస్సా లోని “నీలాంచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( NINL) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఇప్పటికే (“ఎక్సప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్”) ఆసక్తి ని తెలియజేసిందని నరేంద్రన్ తెలిపారు. NINL, విశాఖ ఉక్కు ను కొనుగోలు చేయాలని కోలకతా లో ఒక మిలియన్ టన్ను సామర్థ్యం గల “టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్” ఆసక్తి చూపుతుందన్నారు.

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యముంది. భారత్ లో సముద్రతీరాన ఉన్న అతి పెద్ద ఉక్కు కర్మాగారంగా విశాఖ స్టీల్ కు పేరుంది. మొత్తం 22 వేల ఎకరాలలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్లోని 100 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం నిర్ణయించింది. అయితే.. విశాఖ ఉక్కుపై టాటా ఇంత ప్రేమ చూపడానికి చాలా కారణాలు ఉన్నాయి.

తూర్పు తీర ప్రాంతంలో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ను టాటా దక్కించుకోగలిగితే ఆగ్నేయాసియా మార్కెట్లలో వ్యాపారం మరింత సులువు అవుతుంది. దేశీయ మార్కెట్లోనూ రైలు, రోడ్డు మార్గాల్లో ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. దాదాపు 22 వేల ఎకరాల భూములున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్వల్ప దూరంలోనే గంగవరం పోర్టు ఉండటం మరో అనుకూల అంశం కాగా తద్వారా బొగ్గు తదితర ముడిసరుకుల దిగుమతి, స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతి మరింత సులభమవుతుంది. కోల్ కతా కేంద్రంగా వ్యాపారాన్ని సాగిస్తున్న టాటా స్టీల్ కు దక్షణాదిలో విశాఖ లాంటి ప్లాంట్ దక్కితే అది సంస్థకు తిరుగులేని వ్యాపార అవకాశమే అవుతుంది..

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag Steel Plant

ఉత్తమ కథలు