కోడెల శివప్రసాదరావు... ఎన్నికల తర్వాత ఎన్నో ఆరోపణలు

కోడెల శివప్రసాద్ (File)

Kodela Siva Prasad Death : కోడెల మరణం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆశ్చర్యంలో పడేస్తోంది. ఎలాంటి నేత చివరకు ఎలా చనిపోయాడో అని అందరూ అనుకుంటున్నారు.

  • Share this:
Kodela Siva Prasad Death :  నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణం తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని పరిణామం. టీడీపీ హయాంలో గొప్ప నేతగా ఎదిగిన ఆయన... వైసీపీ అధికారంలోకి రాగానే... అత్యంత వివాదాస్పద నేతగా మారిపోయారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో... కోడెల కుటుంబంపై తీవ్ర విమర్శలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కోడెల కొడుకు, కూతురూ... తీవ్ర అవినీతికి పాల్పడటం వల్ల... బడా కాంట్రాక్టర్ల నుంచీ... తోపుడు బండ్ల వ్యాపారుల వరకూ... అందరూ ఆ కుటుంబంపై భగ్గుమన్నారు. ఫలితంగా కోడెల కుటుంబంపై చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, నాయకులు కూడా కోడెల ఫ్యామిలీకి దూరమయ్యారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో కోడెల పేరు చెబితేనే సొంత పార్టీ నాయకులతోపాటు ప్రజలు కూడా భగ్గుమంటున్నారు. ప్రధానంగా కోడెల... కేటాక్స్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నో కేసులు నమోదయ్యాయి.

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోడెలపై సొంత పార్టీలోనే వ్యతిరేక గళాలు తెరపైకి వచ్చాయి. కోడెల కుటుంబానికి బుద్ధి చెప్పాలంటూ... చాలా మంది ఆందోళనలు చేశారు. అయినప్పటికీ కోడెల... పార్టీ పెద్దల్ని ఒప్పించి... సత్తెనపల్లి నుంచీ అసెంబ్లీ బరిలో నిలబడ్డారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో కోడెల ఘోర పరాజయం పొందారు. కోడెల ఓటమితో ఆయన వ్యతిరేక వర్గం అంతా రోడ్డుపైకి వచ్చింది. ఆయన ఫ్యామిలీకి వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలూ చేసింది. దాంతో టీడీపీ అధినాయకత్వం... కోడెలకు దూరంగా జరిగింది.

ఇటీవల నరసరావుపేట, సత్తెనపల్లిలో నియోజకవర్గాల్లో కోడెల వద్దకు టీడీపీ నేతలు, ముఖ్య నాయకులు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. కోడెల అనుచరులుగా ఉన్న చాలా మంది ప్రస్తుతం ఆయన వద్ద లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో కోడెల మరణం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
First published: