బీజేపీలో టీడీపీ కలిసిపోతుందా? జీవీఎల్ సంకేతాలు ఇస్తున్నారా?

Andhra Pradesh : ఇప్పటివరకూ హుజూర్ నగర్ ఎన్నికలపై చర్చించుకున్న మనం... ఒక్కసారిగా ఏపీపై ఫోకస్ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. కారణం జీవీఎల్ చేసిన తాజా వ్యాఖ్యలే. టీడీపీని బీజేపీలో విలీనం చేసే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.

news18-telugu
Updated: October 20, 2019, 6:14 AM IST
బీజేపీలో టీడీపీ కలిసిపోతుందా? జీవీఎల్ సంకేతాలు ఇస్తున్నారా?
జీవీఎల్ నరసింహారావు
news18-telugu
Updated: October 20, 2019, 6:14 AM IST
Andhra Pradesh : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా నీరుగారిపోయింది. రోజురోజుకూ ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోందని చాలా మంది అంటున్నారు. ఐతే... ఈ వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్న అధినేత చంద్రబాబు... జగన్ అరాచకపాలనకు ప్రజలు స్వస్తి పలుకుతారని కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీతో పొత్తుకు టీడీపీ సంకేతాలు పంపుతోంది కదా... దీనిపై ఏమంటారని అడిగితే... బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు అన్నదే ఉండదన్న ఆయన... అదే టీడీపీని బీజేపీలో కలిపేస్తామంటే (విలీనం) దానిపై హైకమాండ్‌తో మాట్లాడతానన్నారు. ఇది జరిగే పని కాదని మనందరికీ తెలుసు. ఎందుకంటే... విలీనమే జరిగితే టీడీపీ చరిత్రలో కలిసిపోయినట్లే. ఆ పార్టీ అస్థిత్వమే కోల్పోయినట్లు లెక్క. అలా జరగదని జీవీఎల్‌కి కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన ఆ మాట ఎందుకన్నారన్నదానిపై చర్చ జరుగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో... నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తామే అధికారంలోకి వస్తామని జీవీఎల్ అంటున్నారు. అలా అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాల్నీ బీజేపీ ఇప్పటి నుంచే వెతుక్కుంటోందని ఆయన మాటల్ని బట్టీ అర్థమవుతోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలంటే రెండు అంశాలు కీలకం. ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పని అయిపోవాలి. ఆ పార్టీపై ప్రజలు చిరాకుపడాలి. ఆ పార్టీని తిప్పికొట్టాలి. ఇదంతా వైసీపీకి సంబంధించిన బీజేపీ టార్గెట్ అవ్వాల్సి ఉంటుంది. రెండోది ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎంచుకోవాలంటే... ప్రస్తుతం ఆల్టర్నేట్‌గా ఉన్న టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి. అది జరిగే పని కాదు కాబట్టి... అసలు టీడీపీయే లేకుండా పోతే... ఇక తామే ఆల్టర్నేట్ అవుతామని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఐతే... పైన మనం అనుకున్న రెండు అంశాల్లోనూ బీజేపీ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే... ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా టీడీపీనే చూస్తున్నారు తప్ప... బీజేపీని చూసే అవకాశాలూ కనిపించట్లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాటకాలు ఆడటమే. మరి ఊహాకల్పితమైన ఆలోచనలను జీవీఎల్ ఎందుకు ప్రజల ముందుకు తెస్తున్నారన్నది తేలాల్సిన అంశం.

బీజేపీ వ్యూహం అదేనా : 2023 నాటికి జమిలి ఎన్నికలు వస్తాయని భావిస్తున్న బీజేపీ... ఆలోగా వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోతే... ఏపీ సీఎం జగన్‌పై ఉన్న కేసుల్ని తెరపైకి తెచ్చి... ఆయన్ని ఎలాగొలా జైలుకు పంపాలనే టార్గెట్ బీజేపీకి ఉండి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలా చేయడం ద్వారా... ఆ పార్టీని బలహీనం చేసి... తాము అధికారంలోకి రావలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఐతే... ఇక్కడ బీజేపీకి అడ్డుగా ఉన్న టీడీపీని ఎలాగోలా మెయిన్ ట్రాక్ నుంచీ తప్పిస్తే... ప్రజలు తమను ఎన్నుకుంటారని భావిస్తున్న బీజేపీ... ఈ విషయంలో అవసరమైతే... ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కూడా వెనకాడదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచీ వినిపిస్తోంది. ఆల్రెడీ మహారాష్ట్ర, హర్యానాలో తామే గెలుస్తామని ధీమాగా చెబుతున్న కమలదళం... నెక్ట్స్ టార్గెట్‌గా తెలంగాణ, ఏపీని ఎంచుకుందని మనకు తెలుసు. అందుకు తగ్గట్టే... తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని శాశించేందుకు కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు అగ్రనేతలు. అందువల్ల ఇకపై తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

 


Photos : చేతులతోనే భారీ చేపల్ని పడుతున్న హంటింగ్ బ్యూటీ...
ఇవి కూడా చదవండి :
Loading...
నెక్ట్స్ ఏంటి... ఇవాళ తేల్చనున్న ఆర్టీసీ జేఏసీ

Health Tips : కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...