నేడు సీఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం... EVMల ట్యాంపరింగ్ నిరూపిస్తారా...

TDP VS ECI : లెక్క పర్‌ఫెక్ట్ అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. తప్పు తేల్చేస్తామంటోంది టీడీపీ. మరి ఎవరి మాట నెగ్గుతుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా?

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 5:46 AM IST
నేడు సీఈసీ ముందుకు టీడీపీ టెక్నికల్ టీం... EVMల ట్యాంపరింగ్ నిరూపిస్తారా...
ఈవీఎంలపై ఢిల్లీలో చర్చించిన పార్టీల నేతలు (Fi
  • Share this:
AP Assembly Election 2019 : షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు ఇవాళ టీడీపీ ఈవీఎం టెక్నికల్ టీం వెళ్లాల్సి ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. బట్... ఇక్కడే సీఈసీ ఓ మెలిక పెట్టింది. టీడీపీ పంపుతున్న టెక్నికల్ టీంలో హరి ప్రసాద్ ఉండటానికి వీల్లేదని అంది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్‌తో చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. ఈవీఎంలో తప్పులు ఉండటం వల్లే ఈసీ భయపడుతోందని టీడీపీ అరోపించింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని టీడీపీ టెక్నికల్‌ నిపుణుడు హరిప్రసాద్‌ ఆరోపించారు. 2010లో తనపై కేసుకు సంబంధించి ఛార్జిషీటే దాఖలు కాలేదని... అలాంటప్పుడు తనపై కేసు ఉందని ఈసీ చెప్పడం... అర్థరహితం అన్నారాయన. ఈసీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఇలా మెలిక పెడుతోందని ఆరోపించారు.

వీవీ ప్యాట్‌ మొదటి టెస్ట్‌కు తనను పిలిచారన్న హరిప్రసాద్... వీవీ ప్యాట్‌లో ఓటర్‌ స్లిప్‌ 7 సెకన్లు చూపించాల్సి ఉండగా... 3 సెకన్లు మాత్రమే చూపించడంతో అనుమానం వచ్చిందన్నారు. అనుమానం నివృత్తి చేసుకోవడానికే ఈసీని కలవడానికి వచ్చానని ఢిల్లీలో తెలిపారు. ఈసీ సమాధానం చెప్పకుండా కేసు ఉందనడంతో మరింత అనుమానం పెరిగిందన్నారాయన. ఎన్నికలకు ముందు రోజైన ఏప్రిల్ 10నే వీవీ ప్యాట్‌లో తప్పును తాము కనిపెట్టి... ఏపీ ఎలక్షన్ కమిషన్‌కి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని హరిప్రసాద్‌ అన్నారు.


వీలైతే హరిప్రసాద్‌తో కూడిన టీడీపీ టెక్నికల్ టీం ఇవాళ సీఈసీని కలుస్తుంది. లేదంటే... ఈసీ అభ్యంతరాలకు సమాధానం ఇస్తూ లేఖ రాయాలని నిర్ణయించుకుంది.

ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా : ఈ ప్రశ్న హ్యాకర్లను అడిగితే సాధ్యమే అని అంటారు వాళ్లు. ఇంకా చెప్పాలంటే... ఈ ప్రపంచంలో హ్యాకింగ్‌కి సాధ్యం కాని సిస్టం లేదు. ప్రతీదీ కంప్యూటర్ల భాషతోనే పనిచేస్తాయి కాబట్టి... దేనినైనా డీకోడ్ చెయ్యగలరు హ్యాకర్లు. ఐతే, డీకోడ్ చెయ్యాలంటే... ఆయా సిస్టంలకు ఉండే ఐడీ, పాస్‌వర్డ్‌లను క్రాక్ చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం వాళ్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్లను రష్యా హ్యాకర్లు ఎక్కువగా తయారుచేస్తున్నారు. ఏ సిస్టంకి సంబంధించిన పాస్ వర్డైనా... ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా ఐదు నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అంతే కాదు... ఆ సాఫ్ట్‌వేర్‌ని ఆయా సిస్టంలలో జొప్పించడం ద్వారా... మొత్తం సిస్టం పనితీరునే మార్చేయగలరు.

ఈవీఎంల విషయంలోనూ ఈ రూల్ వర్తిస్తుంది. హ్యాకింగ్ సాధ్యపడదనీ, ట్యాంపరింగ్ చెయ్యలేరని ప్రభుత్వాలు చెబుతున్నా... హ్యాకర్లు ఇలాంటి ఎన్నో వ్యవస్థల్ని ట్యాంపరింగ్ చేసి మరీ చూపించిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అందువల్లే టీడీపీ ఈ విషయంలో ఇంత పట్టుదలగా ముందుకెళ్తోందన్నది టెక్నికల్ నిపుణుల మాట. మరి సీఈసీ ముందే... టీడీపీ టెక్నికల్ టీం ట్యాంపరింగ్ చేసి చూపిస్తే... సీఈసీ ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సిన అంశం.


మొన్నటి (11న జరిగినవి) ఎన్నికల్ని రద్దు చెయ్యమని టీడీపీ కోరట్లేదు. వీవీప్యాట్లలోని 50 శాతం స్లిప్పులను కౌంటింగ్ చెయ్యాలని మాత్రమే కోరుతోంది. ఓటర్లు ఎవరికి ఓటు వేశారో, అదే గుర్తుకి ఓటు పడిందో లేదో తేలాలంటోంది టీడీపీ. ఈ విషయంలో అనుమానాలేవీ అక్కర్లేదంటున్న సీఈసీ... అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని అభ్యంతరం చెబుతోంది. ఫలితంగా ఈ అంశం ఏపీ నుంచీ ఢిల్లీ వరకూ రాజకీయంగా రగులుతూ ఉంది.
Published by: Krishna Kumar N
First published: April 15, 2019, 5:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading