Home /News /andhra-pradesh /

WHY CHANDRABABU TARGETS KCR REPEATEDLY IN AP ELECTION CAMPAIGN NK

కేసీఆర్‌ను చంద్రబాబు భయపెడుతున్నారా... భయపడుతున్నారా... విజయసాయి రెడ్డి ఏమన్నారంటే...

కేసీఆర్, విజయసాయి రెడ్డి, చంద్రబాబు

కేసీఆర్, విజయసాయి రెడ్డి, చంద్రబాబు

AP Assembly Elections 2019 : ఏపీ ఎన్నికల సమయంలో... టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం అగ్గి రాజేస్తోంది. నేతల పంచ్ డైలాగ్స్‌తో రెండు వైపులా హీట్ పెరిగిపోతోంది.

సాధారణంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే టీడీపీ అధినేత చంద్రబాబు భయపడతారనీ... ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కేసీఆర్ జైలుకు పంపించగలరని తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు కొందరు భావిస్తుంటారు. ఈ కారణంగానే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో... చంద్రబాబు... కేసీఆర్‌కి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేకపోయారన్న కోణం కూడా ఉంది. ఐతే... ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారంలో మాత్రం చంద్రబాబు... పదే పదే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చెయ్యడమే కాదు... ఖబడ్దార్ కేసీఆర్ అంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఐతే... అదంతా పైపై డాంబికమే తప్ప చంద్రబాబుకు అంత సీన్ లేదంటున్నారు వైసీపీ సీనియర్ నేత విజయ సాయి రెడ్డి.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారంటున్న విజయ సాయి రెడ్డి... చంద్రబాబు కలలోకి వచ్చి కేసీఆర్ భయపెడుతున్నారని తాజాగా ట్వీట్ చేశారు. మా వాళ్లు బ్రీఫ్డ్ మీ అనే పదాన్ని దేశం అంతా విందన్న విజయ సాయి రెడ్డి... 18 కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని మండిపడ్డారు.



తాజా ఎన్నికల్లో కేసీఆర్‌కి చంద్రబాబు ఆ రేంజ్‌లో వార్నింగులు ఇస్తుండటంపై తెలంగాణలో పెద్ద చర్చే జరుగుతోంది. కేసీఆర్ అంటే ఏ మాత్రం భయం లేకుండా చంద్రబాబు అలా ఎలా వార్నింగ్స్ ఇవ్వగలుగుతున్నారని ప్రశ్నించుకుంటున్న తెలంగాణ ప్రజలు.... ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తలచుకుంటే, చంద్రబాబు జైలు కెళ్లక తప్పదని అనుకుంటున్నారని తెలిసింది. ఎన్నికల్లో గెలుపు కోసమే చంద్రబాబు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారనీ, తెరవెనక కేసీఆర్ అంటే చంద్రబాబుకు భయం ఉంటుందని చర్చించుకుంటున్నట్లు తెలిసింది.


ఎన్నికల సమయం కాబట్టే ఆంధ్రా ప్రజల ఓట్ల కోసం చంద్రబాబు అంతలా తనను విమర్శిస్తున్నారనీ, కేసీఆర్ కూడా ఆ విమర్శల్ని పెద్దగా పట్టించుకోవట్లేదని సమాచారం. ఐతే... నాల్రోజులుగా చంద్రబాబు చేస్తున్న విమర్శల స్థాయి మరింత పెరగడం వల్లే... కేసీఆర్ కూడా సోమవారం కౌంటర్ ఇచ్చారనీ, అంతే తప్ప... ప్రస్తుతం చంద్రబాబు గురించి పట్టించుకునే పరిస్థితుల్లో కేసీఆర్ లేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాజకీయ వేడిని బాగానే రగిలించాయని చెప్పుకోవచ్చు.

 

ఇవి కూడా చదవండి :

సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సవరించడమంటే... సైనికుల్ని ఉరికంబం ఎక్కించడమే : ప్రధాని నరేంద్ర మోదీ

ఎన్నికల తర్వాత జగన్, కేసీఆర్‌లతో పొత్తు పెట్టుకుంటారా..? మోదీ సమాధానమేంటో తెలుసా?
First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, CM KCR, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు