• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • WHY CANT JAGAN TAKE ACTION ON CULPRITS PAWAN KALYAN COMMENTS ON RAMATHEERTHAM LORD SRIRAM IDOL DESTRUCTION BA

అందుకే శ్రీరాముడి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఫైర్

అందుకే శ్రీరాముడి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఫైర్

పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ధర్మ విచ్ఛిన్నానికే శ్రీరాముడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాక్షస వారసులెవరో వర్తమానంలో ధర్మ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ధర్మ విచ్ఛిన్నానికే శ్రీరాముడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాక్షస వారసులెవరో వర్తమానంలో ధర్మ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్‌లో ఆలయాలను ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారని, ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిందితులను కనీసం పట్టుకోలేకపోయిందని విమర్శించారు. ‘ధర్మానికి నిండైన రూపంగా దర్శనమిచ్చే శ్రీరామచంద్రుడి విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర సాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా మర్లబండలో ఆంజనేయస్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారామచంద్రుల విగ్రహాలను పగులగొట్టడం దుర్మార్గమైన చర్య. ఈ వరుస ఘటనలను ప్రతి ఒక్కరం ఖండించాలి. గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో హిందూ ఆలయాలకు, విగ్రహాలకు అప్రతిష్ట జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనకుండా ఉండడం వల్లే మతోన్మాదులు మరింతగా తెగబడుతున్నారు.’ అని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.

    పొరుగున ఉన్న శత్రుదేశంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అక్కడి ప్రభుత్వం 45 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత తీసుకుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. శత్రుదేశం తీసుకున్న లాంటి చర్యలు కూడా కనీసం జగన్ ప్రభుత్వం తీసుకోలేదా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం వరకూ ఇప్పుడు మర్లబండ వరకు విగ్రహాలను పగులగొడుతున్నా, రథాలను తగులబెడుతున్నా ప్రభుత్వ స్పందన ఉదాసీనంగానే ఉందని పవన్ విమర్శించారు.

    దేవుడిపై భారం వేసేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుందని పవన్ కళ్యాణ్ నిన్న ఓ ప్రకటనలో విమర్శించారు. అంతర్వేది ఘటనపై నిరసన తెలిపినవారిపైనా... అక్కడ ఓ ప్రార్థన మందిరానికి నష్టం జరిగితే ఆగమేఘాలపై కేసులుపెట్టిన ప్రభుత్వం - హిందూ ఆలయాలు, దేవత విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు దేవుడిపై భారం వేస్తుందని ప్రశ్నించారు. ‘విజయవాడ అమ్మవారి ఆలయ రథంలో వెండి విగ్రహాల అపహరణ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. పిఠాపురం, కొండబిట్రగుంట కేసులు ఎటుపోయాయో ప్రజలకు అర్థం కావడం లేదు. వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా అనిపిస్తుంది. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలి. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలి. అప్పుడే మత సామరస్యం, లౌకిక వాదం పరిఢవిల్లుతాయి.’ అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు