హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP BJP: ఏపీలో బీజేపీకి అదే మైనస్సా.. పార్టీ బలపడకపోవడానికి కారణం ఎవరు..?

AP BJP: ఏపీలో బీజేపీకి అదే మైనస్సా.. పార్టీ బలపడకపోవడానికి కారణం ఎవరు..?

సోము వీర్రాజు (ఫైల్)

సోము వీర్రాజు (ఫైల్)

AP BJP: అంతన్నారు.. ఇంతన్నారు.. ఆఖరికి ఏమీ లేదు అన్నట్టు తయారైంది ఏపీలో బీజేపీ పరిస్థితి..? వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నా.. ఆ స్థాయి హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.. కనీసం ఇతర పార్టీలు పోరాటాలు చేస్తున్నా.. బీజేపీ పేరు మాత్రం వినిపించడం లేదు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

Andhra Pradesh BJP: మిషన్ సౌత్ ఇండియా.. వచ్చే ఎన్నికల వ్యూహంలో భాాగంగా జాతీయ బీజేపీ నినాదం ఇదే.. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో సత్తాచాటిన బీజేపీ సౌత్ లో.. ఆ స్థాయి ప్రదర్శన కనిపించడం లేదు.  కేవలం కర్ణాటకలో అధికారం ఉన్నా.. మిగిలిన రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను బలంగా ఢీ కొట్టే పరిస్థితి కనిపించడ లేదు. తాజాగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షం అనే రేంజ్ లో బీజేపీ దూసుకెళ్తోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తోంది.. లేదా రెండో స్థానంలో ఉంటోంది. తెలంగాణ ఎన్నికలకు సబంధించి వస్తున్న నివేదికలు.. సర్వేల్లో సైతం కొన్నింటిలో బీజేపీ రెండో స్థానంలో ఉంటోంది. చాలా చోట్ల బీజేపీ బలం పెరిగింది. ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు కూడా.. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

తెలంగాణలో ఫైర్ అనిపించుకుంటున్న బీజేపీ.. ఏపీలో మాత్రం ఫ్లవర్ గానే మిగిలిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఏం ఇష్యూ జరిగినా, ప్రభుత్వ వైఫల్యం ఉన్నా బీజేపీ నేతలు టేకప్ చేస్తున్నారు..  ఏపీ విషయానికి వస్తే.. బీజేపీ పేరు కూడా వినిపించడం లేదు. కనీసం మిత్ర పక్షం జనసేన హడావుడి చేస్తుంటే.. వారితో కలిసి పోరాటం కూడా చేయలేకపోతోంది బీజేపీ. కానీ జనసేన  మాత్రం తమ మిత్ర పక్షం అని చెబుతోంది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై.. ఒకరిద్దరు నేతలు మాత్రమే విమర్శలు చేస్తున్నారు. అది కూడా మీడియా ముందుకు వచ్చి ఒకటి రెండు విమర్శలు చేసి వదిలేయడం తప్పా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది లేదు. అయితే అందుకు కారణం కూడా ఉంది అంటున్నాది బీజేపీలో ఓ వర్గం.. అధిష్టానం వైసీపీకి సన్నిహితంగా ఉంటే.. తాము ఎలా విమర్శలు చేయగలం అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ పూర్తిగా బలపడకపోవడానికి.. అదే మైనస్ గా మారింది అంటు కొందరు నేతలు తమ అనుచరులతో చెబుతున్నట్టు సమాచారం.

రాజకీయ పార్టీ అంటే.. ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాడాలని.. ఆ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. తీవ్ర విమర్శలు చేయాలని.. కానీ కొందరు నేతలు మాత్రం టీడీపీని తిడుతూ.. జగన్ ను అన్నామంటే అన్నామన్నట్టు వ్యవహరిస్తున్నారని.. ఈ కారణంతోనే బీజేపీ ఏపీలో బలపడలేకపోతోందన్నది కొందరి నేతల అభిప్రాయం. అంతెందుకు ఇటీవల కన్నా లక్ష్మీ నారయణ సైతం.. ఏపీ బీజేపీ అధ్యక్షుడి వ్యవహరాంపై నేరుగానే విమర్శలు చేశారు.

దానికి తోడు ఇటీవల ప్రధాని మోదీ విశాఖ వచ్చారు.. అయితే దాన్ని హైలైట్ చేసుకోవాల్సిన బీజేపీ పేరు ఎక్కడా పెద్దగా వినిపంచలేదు. సాధారణంగా ప్రధాని స్వయంగా వస్తున్నారు అంటే.. ఎక్కడ చూసినా ఆ పార్టీ జెండాలు కనిపించాలి.. ఆ పార్టీ పేరే ప్రధానంగా వినిపించాలి.. కానీ విశాఖలో మోదీ పర్యటనను మొత్తం వైసీపీ హైజాగ్ చేసిందనే చెప్పాలి.. ప్రధాని సమావేశంలో కనిపించిన వారిలో 90 శాతం వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. అంతేకాదు.. జనసమీకరణలోనూ వైసీపీ పూర్తిగా సక్సెస్ అయ్యింది. కానీ బీజేపీలో ఎక్కడా  ఆ దూకుడు కనిపించలేదు.

మరోవైపు సాధారణంగా పెద్దగా  ఓటింగ్ శాతం లేని పార్టీ బలపడాలి అంటే.. కీలకమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలి.. తెలంగాణలో జరుగుతోంది అదే.. కాంగ్రెస్ , టీఆర్ఎస్  లకు చెందిన కీలక నేతలు ఎందరో.. కమలం గూటికి క్యూ కడుతున్నారు. కానీ ఏపీలో మాత్రం ఎవరూ..? ఎవరూ బీజేపీ వైపే చూస్తున్నట్టు కనిపించడం లేదు.. ఒక కీలక నేత బీజేపీలో చేరారు అనే వార్త విని చాలా  ఏళ్లే అవుతోంది..  ఇలానే పరిస్థితి ఉంటే.. ఏపీలో బీజేపీ బలపడేది  ఎలా అని ఆ పార్టీ నేతలే ఆవేదన చెందుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Somu veerraju

ఉత్తమ కథలు