జగన్ విషయంలో కేంద్రం తప్పు చేస్తోందా... ఢిల్లీ ప్లాన్ ఏంటి?

Andhra Pradesh : ఓవైపు తెలంగాణ దిశ హత్యాచారం కేసు ఎన్‌కౌంటర్‌పై దేశమంతా చర్చించుకుంటుంటే... ఏపీకి సంబంధించి ఢిల్లీలో ఓ కీలక పరిణామం జరిగింది. ఏపీ సీఎం జగన్‌కు తనను కలిసే ఛాన్స్ అమిత్ షా ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి.

news18-telugu
Updated: December 7, 2019, 6:13 AM IST
జగన్ విషయంలో కేంద్రం తప్పు చేస్తోందా... ఢిల్లీ ప్లాన్ ఏంటి?
జగన్ విషయంలో కేంద్రం తప్పు చేస్తోందా... ఢిల్లీ ప్లాన్ ఏంటి?
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్... ప్రత్యేక హోదా లాంటి కీలక డిమాండ్ల విషయంలో ఒకింత రాజీ మార్గంలో వెళ్తుంటే... కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం... జగన్‌తో రాజకీయ పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు హడావుడిగా వెళ్లిన సీఎం జగన్... తిరిగి ఏపీకి వచ్చేశారు. జగన్‌కి ప్రధాని మోదీనిగానీ, అమిత్ షాని గానీ కలిసే ఛాన్స్ రాలేదు. అసలు జగన్‌ను ఢిల్లీకి రప్పించిందే అమిత్ షా. గురువారం రాత్రి 10 తర్వాత తనను కలవమని టైమ్ ఫిక్స్ చేసిన ఆయన... శుక్రవారం ఉదయం కూడా కలిసే ఛాన్స్ ఇవ్వలేదు. ఇదివరకు అక్టోబర్ 21న కూడా అమిత్ షా ఇలాగే చేశారు. 15 గంటలపాటూ ఢిల్లీలోనే ఉన్న జగన్... పని అవ్వకపోవడంతో తిరిగి ఏపీ వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇంతకీ బీజేపీ అగ్రనేతలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారన్నదానికి రాజకీయ కోణం కనిపిస్తోంది.

నిజానికి జగన్‌కు ప్రధానమంత్రి, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇప్పించేందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నేత మిథున్‌ రెడ్డి గురువారం తీవ్రంగా కృషి చేశారు. జగన్‌ను కలిసేందుకు మోదీకి తీరిక లేదని ప్రధాని కార్యాలయం ముందే చెప్పింది. అమిత్ షా విషయంలో మాత్రం రాత్రి 10 తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చి... తీరా కలిసే ఛాన్స్ లేకుండా చేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం అందడంతో జగన్‌ ఢిల్లీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని వచ్చేశారు.

కయ్యానికి కాలుదువ్వడం అన్న ఫార్ములాను బీజేపీ అనుసరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు జగన్ కేంద్ర పెద్దలతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే... వాళ్లు మాత్రం... వైసీపీని వీలైనంత దూరంగా పెట్టాలనే వ్యూహంతో... ఆ విషయం జగన్‌కి తెలియాలనే ఉద్దేశంతోనే ఇలా ఢిల్లీకి పిలిపించుకొని... భేటీకి ఛాన్స్ ఇవ్వకుండా చేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచీ వస్తోంది.

అమిత్ షా... జగన్‌ను అవమానించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇలా అనడానికి బలమైన కారణాలున్నాయి. గురువారం అమిత్ షా... మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు కొంతమంది నేతల్ని కలిశారు. జగన్‌ను మాత్రం పక్కన పెట్టారు. ఇలా చేయడం ద్వారా వైసీపీతో వైరాన్ని పెంచుకొని... ఏపీలో బలమైన ప్రతిపక్షంగా మారి... వైసీపీని టార్గెట్ చెయ్యాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక... ఏం చెయ్యాలో తెలియక... ఇలాంటి కొత్త పంథా అనుసరిస్తున్నారన్న విమర్శలు వైసీపీ నుంచీ వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజల అండదండలు ఎప్పటికీ జగన్‌తోనే ఉంటాయంటున్న ఆ పార్టీ ఎంపీలు... బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అంటున్నారు. 

Pics : పరువాల పూదోట సోనీ చరిష్టా క్యూట్ ఫొటోస్...ఇవి కూడా చదవండి :

ఏ క్షణమైనా వాళ్లకు ఉరి... రెడీ అవుతున్న కేంద్రం

చలికాలంలో కిస్‌మిస్ తింటున్నారా... ఇవీ కలిగే ప్రయోజనాలు

Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.

Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>