WHO WILL BE WIN IN 2024 ELECTIONS IN ANDHRA PRADESH YCP AND TDP HOW MANY SEATS WILL WIN WHAT ABOUT JANASENA NGS
Shocking Survey: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్నీ సీట్లు వస్తాయంటే..? జాతీయ సర్వేలో సంచలన విషయాలు
ప్రతీకాత్మకచిత్రం
Shocking Survey: ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి ఎంత ఆదారణ ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? వైసీపీ తిరిగి అధికారం నిలుపుకుంటుందా..? టీడీపీ పుంజుకుని గెలుస్తుందా..? జనసేన పరిస్థితి ఏంటి..? జాతీయ పార్టీలు ఉనికి చాటుకుంటాయా..? జాతీయ సర్వే ఏం చెప్పిందటే..?
Shocking Survey: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వచ్చే ఎన్నికల్లో అధికార పీఠం ఎవరింది.. మరోసారి ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుందా.? లేదా సైకిల్ గేరు మార్చి జోరందుకుటుంటుందా..? జనసేన బలమెంత..? జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల పరిస్థితి ఏంటి.. ఓ జాతీయ సర్వేలో సంచలన విషయాలు వెల్లడించింది.. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సీఎం జగన్ (CM Jagan) ను ఓడించేందుకుప ప్రతిపక్షాలు ఏకం కావాలంటూటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవల తన కుప్పం పర్యటనలో పిలుపు ఇచ్చారు కూడా. అలాగే పొత్తులపై మాట్లాడుతూ వన్ సైడ్ లవ్ స్టోరీ కూడా చెప్పారు. జనసేన (Janasena)తో పొత్తుకు సిద్ధమని మనసులో మాట బయటపెట్టారు. ఇటు బీజేపీ సైతం జనసేన తమతోనే పొత్తు పెట్టుకుంటుందని.. వచ్చేఎన్నికల్లో బీజేపీ-జనసేనలదే విజయం అంటూ సోమువీర్రాజు పదే పదే చెబుతున్నారు. ఇటు ఏపీ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలతో ఎంత ఆదరణ పెరుగుతోందో.. అదే విధంగా కొన్ని నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ఉద్యోగులు కూడా తాజా పీఆర్సీతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత ఇప్పటికే పరిమితం అవుతుందా.. భవిష్యత్తులోనూ కొనసాగుతుందా అన్నది చూడాలి.. అయితే ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరి బలం ఎంత అన్నదానిపై జాతీయ సర్వే ఏం చెబుతోంది అంటే..?
తాజాగా సీ ఓటర్ - ఇండియా టూడే సర్వే చేసింది. భారత దేశంలో 2024 ముందు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అయిదు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో..అదే విధంగా ఏపీలో పార్టీల పైన ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు సీ ఓటర్- ఇండియా టుడే సంయుక్త సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారత దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ జరిగితే.. మోదీ హవా కొనసాగుతుందని స్పష్టం చేసింది. మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలో పేర్కొంది. దేశంలో ఎక్కువమంది ప్రజలు.. ప్రధానిగా మోదీకే పట్టం కట్టాలని నిర్ణయించినట్టు సీ ఓటర్- ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. అయితే గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గుందని సర్వే ప్రకటించింది. ఎన్డీయే మెజార్టీ 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది.
ప్రస్తుతం ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదని సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేదని నిర్ధారించింది. ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని సర్వే తేల్చింది. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లుగా పేర్కొంది.
ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితిపైనా సర్వే చేసింది. లోక్ సభ స్థానాల పైన తమ నివేదికను వెల్లడించింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్ కు ప్రజాదరణ అంతగా తగ్గలేదని తేల్చింది. అయితే జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లకు ఏపీలో ఛాన్స్ లేదంటూ తేల్చి చెప్పేసింది. మొత్తం రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్-బీజేపీ స్థానాలకు ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేసింది. అలాగే దేశ వ్యాప్తంగా ఉత్తమ సీఎంలలో జగన్ కు ఆరో స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఈ జాబితాలో యూపీ ప్రస్తుత సీఎం యోగీ.. డీల్లీ సీఎం కేజ్రీవాల్.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా.. తమిళనాడు సీఎం స్టాలిన్.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే తరువాత స్థానంలో జగన్ ఉన్నారు. అయితే ఈ ముఖ్యమంత్రులు అందిరికీ సొంత రాష్ట్రాల్లో 43 శాతం కంటే ఎక్కువగా మద్దతు లభించిన ముఖ్యమంత్రుల రేటింగ్స్ ను ఈ సర్వే వెల్లడించింది. అందులో సీఎం జగన్ ప్రస్తావన చేయకపోవడంతో.. ఆయనకు 43 శాతం కన్నా తక్కువ ఆధరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే జాతీయ స్థాయిలో జగన్ మద్దతు లభించినా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం సర్వేలో 43 శాతం కంటే తక్కువగా మద్దతు రావటం పైన వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో షాకింగ్ అంశం ఏంటంటే.. ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించలేదు. ఆ సర్వే చెప్పిన ప్రకారం జగన్ - చంద్రబాబు మధ్యనే పోటీ ఉంటుదని స్పష్టం చేసింది. జాతీయ పార్టీలకు స్థానం లేదని చెప్పింది అంటే.. పరోక్షంగా వైసీపీ - టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ అన్నది సర్వే అభిప్రాయంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఈ సర్వే ఎంత వరకు వాస్తవం అన్నది.. త్వరలో నర్సాపురంలో బైపోల్ జరిగితే.. క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.