TTD: పేద దంపతులకు టీటీడీ బంఫర్ ఆఫర్: 2 గ్రాముల తాళిబొట్టు కావాలా? ఇలా చేయండి

టీటీడీ భక్తులకు మరో శుభవార్త, ఇకపై రెండు గ్రామాల బంగారం ఇవ్వాలని నిర్ణయం

కళ్యాణమస్తులో పాల్గొనాలి అనుకున్న పేద జంటలు ఏం చేయాలి అన్నదానిపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.. ఈ వివాహంలో పాల్గొనాలి అనుకున్నవారి ధరఖాస్తులు ఏప్రిల్ 25 లోపు టీటీడీకీ చేరాలి.

 • Share this:
  కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో పేద భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పేద దంపతులు వివాహాలు చేసుకుంటే వారికి ఒక గ్రాముకు బదులు.. రెండు గ్రాముల బంగారం తాళిబొట్టు ఇస్తున్నట్టు తీపి కబురు చెప్పింది. అయితే  ఎప్పుడిస్తారు? ఎవరికి ఇస్తారు? దీన్ని దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి అన్నింటీకి క్లారిటీ ఇచ్చింది టీటీడీ.. సనాతన హైందవ ధర్మ ప్రచారాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీన కళ్యాణమస్తు సామూహిక వివాహాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కళ్యాణమస్తులో వివాహం చేసుకోవడానికి ఆసక్తి గల పేద అవివాహితులైన యువ‌తీ యువ‌కుల నుంచి టీటీడీ ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  టీటీడీ గతంలో పెద్ద ఎత్తున కల్యాణమస్తు సామూహిక వివాహాల కార్యక్రమం నిర్వహించింది. పదేళ్ల క్రితం ఆపేసిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ పున:ప్రారంభించింది. ఇందులో భాగంగా లబ్దిదారులకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు వెల్లడించింది. పేద హిందువులు శ్రీవారి సమక్షంలో వివాహం చేసుకునే ఈ కార్యక్రమం ద్వారా కల్పించింది టీటీడీ. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయనే భావనతో వేలాది జంటలు ఈ కార్యక్రమంలో దాంపత్య జీవింతంలోకి అడుగుపెట్టేవి.

  ఈ కళ్యాణమస్తులో పెళ్లి చేసుకున్న జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వధూవరులకు నూతన వస్త్రాలు, బంగారు తాళి బొట్టు ఇవ్వడంతోపాటు..వారి బంధువులు 50 మందికి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. 2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతల్లో కల్యాణమస్తు కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది. ఆ తర్వాతి కాలంలో ఆర్థిక భారం పెరగడం, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు 2013లో కళ్యాణమస్తును తిరిగి ప్రారంభించాలని ప్రయత్నించినప్పటికి.. అడుగులు ముందుకు పడలేదు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి ఆలయ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక టీటీడీ ట్రస్టు బోర్డు ఈ కార్యక్రమాన్ని తిరిగి పున:ప్రారంభించాలని తీర్మానించింది.

  దానికి సంబంధించిన విధివిధానాలను టీటీడీపీ ప్రకటించింది. కళ్యాణమస్తులో పాల్గొనాలి అనుకున్న పేద జంటలు ఏం చేయాలి అన్నదానిపై వివరణ ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ద‌ర‌ఖాస్తు ప‌త్ర‌ములు www.tirumala.org నుండి కానీ లేదా ఆయా జిల్లాల హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ప్రోగ్రాం అసిస్టెంట్స్ నుంచి గానీ పొంద‌వ‌చ్చని చెప్పింది. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఏప్రిల్ 25వ తేదీ లోపు ఆయా జిల్లా కేంద్రా‌ల్లోని కళ్యాణ మండ‌పాల కార్యా‌ల‌యాల‌కు చేర్చాల్సి ఉంటుందన్నారు. మే 28న నిర్ణయించిన సమయంలో వివాహాలు జరగనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దంపతులకు మంగళసూత్రంతో పాటు వస్త్రాలు, 40 మందికి బోజనాలు ఉచితంగా అందించనున్నారు.

  దీంతో పాటు హిందూ ధర్మ ప్రచారంలోభాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని దేవాలయాలకు తగిన వసతి ఉండి గోవును స్వీకరించాలనే ఆసక్తి కలిగిన దేవాలయాలు వినతి పత్రాలు పంపాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్తు బుధవారం ఒక ప్రకటనలో కోరింది. వినతిపత్రం పంపిన ఆలయానికి గోవును అందిస్తామని తెలిపింది. దరఖాస్తులు గుడికో గోమాత హిందూ ధర్మ ప్రచార పరిషత్తు. తిరుమలి తిరుపతి దేవస్థానం శ్వేత భవనం, తిరుపతి చిరునామాకు పంపాలని కోరింది.
  Published by:Nagesh Paina
  First published: