Andhra Pradesh Disha Bill: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం దిశా బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మహిళలు, చిన్నారులపైనా దాడులు పెరిగాయి. పసి కందులు అని కూడా చూడకుండా కీచకలు దాడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం (ap government) ఆ నేరాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కఠినమైన శిక్షలు పడేలా కొత్తగా దిశా బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మహిళలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra pradesh Assembly)లో బిల్లు ఏక గ్రీవంగా ఆమోదం పొందింది. ఇక్కడ బిల్లుకు ఆమోదం పొందిన వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి (Central Government) పంపింది ఏపీ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. దీంతో తాజాగా ఏపీ దిశ బిల్లు పరిస్థితి ఏంటని.. అసలు ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రానికి అందిందా..? రాష్ట్రపతి ఆమోదం పొందే అవకాశం ఉందా..? అసలు బిల్లును ఆమోదించే ఉద్దేశం లేదా..? ప్రస్తుత పరిస్థితి ఏంటి అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాన్ని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్పందించారు. ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే బిల్లుకు ఇప్పట్లో ఆమోదం లభించేలా కనిపించడం లేదు..
ఏపీ దిశ బిల్లుల ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై రాజ్యసభలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నపై స్పందించిన కేంద్రం.. ప్రస్తుతం దిశ బిల్లులు ఎక్కడున్నాయో కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఆయన ఇచ్చిన సమాధానం వింటే ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఏపీ ప్రభుత్వం మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పని పరిస్ధితి ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం పంపిన దిశ బిల్లులు ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో ఉన్నాయని, న్యాయసలహా కోసం వీటిని పంపినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది.అలాగే న్యాయశాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం వివరణ కోరినట్లు వెల్లడించింది. ఈ వివరణ రాగానే రాష్ట్రపతికి పంపుతామని మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు..
ఇదీ చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..?
కేంద్రం అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరంగా సమాధానం ఇవ్వగలిగితేదిశ బిల్లులు రాష్ట్రపతికి చేరనున్నాయి. కాబట్టి కేంద్రం దిశ బిల్లుల వ్యవహారాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే పెట్టినట్లయింది. వాస్తవానికి దిశ బిల్లుల్ని గతంలో ఓసారి ఆమోదించి పంపిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి ఆమోదం కోసం ప్రయత్నించింది. అప్పుడు కూడా కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో పలు మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి బిల్లును కేంద్రానికి పంపింది.
ఇదీ చదవండి : పీఆర్సీపై మంత్రి క్లారిటీ.. ఉద్యోగ సంఘాలకు నాది భరోసా అంటున్న బొత్స
కేంద్రానికి బిల్లు పంపి చాలా నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మహిళల శ్రేయస్సు కోసం ఎంపీ పరిమళ్ నత్వాని స్పందించి కేంద్రాన్ని వివరణ కోరారు. త్వరాగా బిల్లు ఆమోదం పొందేలా చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అయితే ఎంపీలు ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం కేంద్రం ఇవి పరిశీలనలో ఉన్నాయని చెబతోంది తప్ప.. ఆమోదం పొందేలా చేయడానికి ఎలాంటి చర్యలు చేబడుతోందో అన్నదిపై వివరణ ఇవ్వడం లేదు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు పంపామని ఓ కొత్త విషయం వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రం నుంచి వివరణ వస్తే రాష్ట్రపతికి ఈ బిల్లులు పంపుతామని కూడా చెప్పింది. కేంద్రం తాజా వివరణతో.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో సమాధానాలు ఇవ్వగలిగితే.. ఈ పార్లెమంటు సమావేశాల్లోనే దిశ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP disha act, AP News, Parimal Nathwani, Rajyasabha