హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

డబ్బు కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారా... బీరువాలో రూ.1.20 కోట్లు ఏమయ్యాయి?

డబ్బు కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారా... బీరువాలో రూ.1.20 కోట్లు ఏమయ్యాయి?

వైఎస్ వివేకానంద రెడ్డి (File)

వైఎస్ వివేకానంద రెడ్డి (File)

YS Vivekananda Reddy Murder Case : ఆ ముగ్గురు వ్యక్యులూ ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్లే హత్య చేశారా?

    క్రైమ్ థ్రిల్లర్ స్టోరీల్లో సస్పెన్స్ వీడే వరకూ ఆసక్తి పోదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు క్రైమ్ థ్రిల్లర్ కాదు... అదో దుర్మార్గపు హత్య. దాని వెనక ఉన్నదెవరో, చేసిందెవరో అన్నీ మనకు తెలియాలి. సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నా... ఇంతవరకూ ఏం జరిగిందో చెప్పకపోవడంతో... రోజుకో కొత్త కథనం తెరపైకి వస్తోంది. ఇప్పటివరకూ రాజకీయ కోణాలు, ఆస్తి గొడవలు, రియలెస్టేట్ వంటి యాంగిల్స్ కథనాలన్నీ తెలుసుకున్నాం. వేటికవే... ఇలా కూడా జరిగివుండొచ్చు అనిపించేలా కనిపించాయి. ఇప్పుడు మరొకటి తెరపైకి వచ్చింది. ఇది ఎంతవరకూ నిజమో సిట్ అధికారులే తేల్చాలి. దీనిపై ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది. అందుకే అదేంటో మనమూ తెలుసుకుందాం.


    మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత ఆయన బెడ్‌రూంలోని బీరువాలో ఉన్న రూ.1.20 కోట్లు కనిపించట్లేదట. అవి అప్పుడే మాయమయ్యాయా, అంతకు ముందే పోయాయా అన్నదానిపై క్లారిటీ లేదు. ఓ అంచనా ప్రకారం... హత్య తర్వాత హంతకులు ఆ డబ్బును ఎత్తుకుపోయారని తెలుస్తోంది. ఎందుకంటే... వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు... ఆ బీరువాపై రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించారని తెలిసింది.


    స్థానికులతోపాటూ... ఈ హత్యలో పక్క రాష్ట్రాలకు చెందిన కిరాయి హంతకుల పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనికో కారణం ఉంది. మర్డర్‌కి మూడు రోజుల ముందు... ముగ్గురు కుర్రాళ్లు పులివెందులలో అడుగుపెట్టారు. పనిపై వచ్చినవాళ్లలా ఊరంతా తిరిగారు. స్థానిక హోటళ్లలో టిఫిన్లూ, భోజనాలూ తింటూ... గడిపారట. అంతేకాదు... పులివెందుల బస్టాప్ దగ్గర్లో వున్న వైన్‌ షాపులో వాళ్లు మద్యం కొన్నారని తెలిసింది. అంటే... వాళ్లు రోజంతా ఎండలో తిరుగుతూ... దాహం తీర్చుకోవడానికి మద్యం తాగేవాళ్లన్న మాట. మద్యం తాగి నిద్రపోయేవాళ్లని అనుకోవచ్చు. ఇలా రెక్కీ చేసి, వివేకానంద రెడ్డిని వాళ్లే చంపేశారని అనుకోవచ్చు. లేదా... స్థానిక శత్రువులతో కలిసి, ఈ హత్యలో వాళ్లూ చేతులు కలిపారని అనుకోవచ్చు.


    హత్య తర్వాత ఆ ముగ్గురూ కనిపించట్లేదు. ఇప్పటికే ఆ మద్యం షాపు దగ్గరున్న సీసీ కెమెరాల్ని పోలీసులు సీక్రెట్‌గా పరిశీలించారని సమాచారం. మీకు తెలుసుగా... మన సీసీ కెమెరాలు అంత పవర్‌ఫుల్‌గా ఉండవని. అందువల్ల వాళ్లెవరో సరిగా తెలియట్లేదని సమాచారం. స్థానికులైతే వెంటనే గుర్తుపట్టగలరు. పక్క రాష్ట్రాల వాళ్లు కాబట్టి ఎవరో అర్థం కావట్లేదని అనుకుంటున్నట్లు తెలిసింది.


    ఇక అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ శనివారం వివేకానంద రెడ్డి ఇంటిని పరిశీలించారు. ఈ హత్య కేసులో పులివెందులకు చెందిన బాబావలీతోపాటు మరో ముగ్గురు అనుమానితులను రహస్య ప్రదేశంలో సిట్ వేర్వేరుగా ప్రశ్నించింది. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. అనుమానితుల్లో ఒకరు మహిళ. ఏమైతేనేం... ఈ కేసులో చిక్కుముళ్లు వీడటం కంటే... మరిన్ని ముళ్లు పడుతున్నాయి. కొత్త కొత్త కథనాలొస్తున్నాయి. ఆ సిట్ అధికారులు త్వరగా మిస్టరీని ఛేదిస్తే మంచిది. లేదంటే... మనం ఇంకెన్ని యాంగిల్స్ చెప్పుకోవాల్సి వస్తుందో.


     


    ఇవి కూడా చదవండి :


    కొలిక్కి వచ్చిన టీడీపీ మేనిఫెస్టో... వైసీపీకి షాకిచ్చేలా ఉందా?

    Pics : ఏడుస్తూ విసిగిస్తున్నాడని పిల్లాడి పెదవులపై గమ్ రాసిన తల్లి... తర్వాతేమైందంటే...


    కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్యానా డాన్సర్ సప్నా చౌదరి


    కేంద్రమంత్రి ఉమాభారతికి బీజేపీలో అత్యున్నత పదవి 

    First published:

    Tags: Andhra Pradesh, YS Vivekananda reddy

    ఉత్తమ కథలు