A=B B=C... A=C... లగడపాటి సర్వేపై ప్రొ.నాగేశ్వర్ ఆసక్తికర కామెంట్స్...

ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజగోపాల్ (Image : YouTube)

Prof. Nageswar : రాజధాని కావాలి. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రజలు తిరిగి టీడీపీని గెలిపించుకుంటున్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారని చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

  • Share this:
AP Election... Lagadapati Survey : రాజధాని, ప్రాజెక్టుల విషయంలో వైసీపీ కంటే టీడీపీ మెరుగని ప్రజలు భావించారా... అన్నది ఆలోచించాల్సి ఉంటుందన్నారు నాగేశ్వర్. పోలవరం, రాజధాని నిర్మాణం వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలుగా లేవన్న ఆయన... ఆ రెండింటినీ టీడీపీ ప్రాధాన్య అంశాలుగా చెప్పిందన్నారు. ప్రజలు ఆ రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చివుంటే, లగడపాటి చెప్పిన సర్వే నిజం అవుతుందన్న నాగేశ్వర్... 2014లో కూడా రాజధాని అంశమే టీడీపీ అధికారంలోకి రావడానికి కారణం అయ్యిందన్నారు. హైదరాబాద్‌, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తానని హామీ ఇవ్వడం వల్లే అప్పట్లో ప్రజలు టీడీపీని గెలిపించారని అన్నారాయన.

ఈ ఐదేళ్లలో రాజధాని పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు నాగేశ్వర్. ఈసారి ఎన్నికలు వ్యక్తిగత పోరుగా నడిచాయే తప్ప... ఏపీ రాజధాని, అభివృద్ధి కేంద్రంగా నడవలేదన్నారు ఆయన. అమరావతి నిర్మాణానికి జగన్ వ్యతిరేకి అన్న ప్రచారం విషయంలో టీడీపీ సక్సెస్ అయ్యిందన్న నాగేశ్వర్... జగన్ రాజధాని భూముల సేకరణను వ్యతిరేకించడం, రాజధాని శంకుస్థాపనకు అమరావతి వెళ్లకపోవడం వంటివి కూడా టీడీపీకి కలిసొస్తున్నాయన్నారు. ఐతే... వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు... వైసీపీ అధికారంలోకి వస్తే... రాజధాని అమరావతిలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చినా... వైసీపీ మేనిఫెస్టోలో అది ప్రముఖంగా లేదన్నారు నాగేశ్వర్.

పోలవరం, రాజధాని చుట్టే ప్రజలు ఈసారి కూడా తీర్పు చెప్పారా అన్నది తేలాల్సి ఉందన్న ప్రొఫెసర్ నాగేశ్వర్... లగడపాటి చెబుతున్నదాని ప్రకారం మాత్రం ఈ అంశాలే కీలకంగా ఉన్నాయన్నారు. A=B, B=C అయితే... A=C అవుతుందన్న చందంగా లగడపాటి సర్వే ఉందన్న ఆయన... సర్వే చేయించేవారు తమ సొంత అభిప్రాయాలు తమ సర్వేలో చొరబడకుండా చూసుకోవాలని అన్నారు. కానీ లగడపాటి ప్రెస్‌మీట్ చూస్తే... టీడీపీకి పూర్తి అనుకూలంగా మాట్లాడారనీ, ఆ సొంత ఆలోచనల ప్రభావం సర్వేపై పడిందా లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు నాగేశ్వర్.

తెలంగాణలో ప్రజా కూటమి గెలవాలన్న వ్యక్తిగత ఉద్దేశం లగడపాటికి ఉండటం వల్లే... తెలంగాణలో ఎన్నికల ఫలితాల్ని లగడపాటి సరిగా చెప్పలేకపోయారన్న నాగేశ్వర్... లగడపాటి తన ప్రెస్‌మీట్‌లో మొదట టీడీపీకి అనుకూలంగా మాట్లాడారనీ, ఆ తర్వాత సర్వేపై మాట్లాడారని అన్నారు. సొంత అభిప్రాయం సర్వేపై పడకుండా చూసుకున్నారా అన్నది తేలాల్సి ఉందన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

 

ఇవి కూడా చదవండి :

అమరావతిపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు... ఏమన్నారంటే...

లోక్ సభ స్థానాలపై చంద్రబాబు రిపోర్ట్... టీడీపీకి ఎన్ని? వైసీపీకి ఎన్ని?

నారా లోకేష్ హ్యాపీ... లగడపాటి సర్వేతో గెలుపుపై పెరిగిన ధీమా

లగడపాటి సర్వే... లాజిక్ మిస్సైందా... టీడీపీ, వైసీపీకి తగ్గితే... జనసేనకు పెరగలేదేం..?
First published: