ఐపీ అడ్రెస్‌లా, డాక్యుమెంట్లా... డేటా చోరీపై చంద్రబాబు చూపించే ఆధారాలేంటి?

Data Breach : డేటా చౌర్యం వ్యవహారం మరో మలుపు తిరుగుతుందా? చంద్రబాబు ఏం చూపించబోతున్నారు?

Krishna Kumar N | news18-telugu
Updated: March 9, 2019, 11:42 AM IST
ఐపీ అడ్రెస్‌లా, డాక్యుమెంట్లా... డేటా చోరీపై చంద్రబాబు చూపించే ఆధారాలేంటి?
చంద్రబాబు, జగన్ (File)
  • Share this:
డేటా చౌర్యం కేసు రెండు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్న తరుణంలో... చంద్రబాబు వ్యాఖ్యలు మరింత చర్చకు తెరతీస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు డేటా చౌర్యంపై ఆధారాల్ని బయటపెడతాననీ, వైసీపీ అక్రమాల్ని వెలుగులోకి తెస్తానని టీడీపీ అధినేత ప్రకటించారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం తమ దగ్గర ఉందన్న ఆయన... ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ సాక్ష్యాన్ని అందరికీ చూపిస్తానన్నారు. టీడీపీ డేటా దొంగల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తానన్నారు. జగన్‌కు ఓటు వేస్తే... టీఆర్ఎస్, బీజేపీకి వేసినట్లే అన్న చంద్రబాబు... ఎంత పెద్ద నేరం చేసేవాళ్లైనా... ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారన్న యూనివర్శల్ ట్రూత్ ను పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పారు.

చంద్రబాబు ఏం చూపించబోతున్నారన్నదానిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఆయన సరైన సాక్ష్యం చూపించి వైసీపీని ఇరకాటంలో పెట్టాలనీ, ఈ దెబ్బకు వైసీపీ ఇక ఈ వ్యవహారంలో సైలెంట్ అవ్వాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. ఐతే... ఇక్కడే మరో వాదనా వినిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు సరైన సాక్ష్యం చూపించలేకపోతే, అది తమ పార్టీకే దెబ్బకొట్టే అవకాశం ఉందనీ, సాక్ష్యం పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని వైసీపీ రివర్స్ కౌంటర్లు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

టెక్నాలజీని వాడుకోవడంలో చంద్రబాబుకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. అందువల్ల ఆయన ఐపీ అడ్రెస్‌లో లేక, డాక్యుమెంట్లో, వాయిస్ ఎవిడెన్స్ లాంటిదో ప్రజల ముందుకు తెస్తారని భావిస్తున్నారు. బలమైన సాక్ష్యం ఉండటం వల్లే చంద్రబాబు అంత ధైర్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ బయటపెట్టాలనుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు 2 నెలలున్న టైంలో ఈ డేటా వ్యవహారం రాజకీయాల్ని తన చుట్టూ తిప్పుకుంటోంది.

 ఇవి కూడా చదవండి :

లండన్‌లో కనిపించిన నీరవ్ మోదీ... బ్రిటన్‌లో మళ్లీ వజ్రాల వ్యాపారం

సోనియా గాంధీకి విశ్రాంతి ఎప్పుడు... మళ్లీ ఎన్నికల్లో పోటీ ఎందుకు?
Loading...
RRB Recruitment 2019 : 1000కి పైగా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

NHB జాబ్స్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... శాలరీ రూ.42,000
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...