హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీకి కొత్త తలనొప్పి.. రఘురామ కృష్ణంరాజు వ్యూహం ఇదేనా..?

వైసీపీకి కొత్త తలనొప్పి.. రఘురామ కృష్ణంరాజు వ్యూహం ఇదేనా..?

రఘురామకృష్ణంరాజు(Image: Facebook)

రఘురామకృష్ణంరాజు(Image: Facebook)

ఒక వేళ పార్టీయే త‌న‌ను స‌స్పెండ్ చేస్తే త‌న‌పై అన‌ర్హ‌త వేటు వ‌ర్తించ‌దు. అప్పుడు స్వ‌తంత్ర ఎంపీగానే కొనసాగ‌వ‌చ్చు. స్వ‌తంత్ర స‌భ్యుడుగా బ‌య‌ట ఉండి త‌న‌కు న‌చ్చిన పార్టీకి మద్దతు ఇవ్వొచ్చు.

  (బాలకృష్ణ, న్యూస్ 18 కరెస్పాండెంట్)

  ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ షోకాజ్ నోటీసులు జారీచేసినా.. పెద్దగా పట్టించుకోకపోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు రఘురామ కృష్ణంరాజు సమాధానం చెప్పకపోగా.. కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ఊహించని ఈ ప‌రిణామంతో సీఎం జగన్‌తో పాటు పార్టీ ముఖ్యనేతలు ఇరకాటంలో పడ్డారు. రఘురామ కృష్ణం రాజు లేవనెత్తిన ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం ఇవ్వాలో తెలియక వైసీపీ నేతలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

  షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారు అనే రేంజ్‌లో ఈ రెబెల్ ఎంపీ స్పందించిన తీరు ఉండ‌డంతో త‌క్ష‌ణ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు వైసీపీలోని ట్ర‌బుల్ షూట‌ర్స్. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చాలా తెలివిగా త‌న‌పై విసిన బంతిని వైసీపీ చేత్తోనో మ‌ళ్లీ వాళ్ల కోర్టులోకే వేశారు. అయితే రఘురామ కృష్ణంరాజు ప‌క్కా వ్యూహంతోనే ఇలా వ్య‌వ‌హారించార‌నే అభిప్రాయాలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఒక ర‌హస్య ఎజెండాతో ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగానే రియాక్ట్ అవుతున్నార‌ని, దాన్నిఅర్ధం చేసుకోవ‌డంలో వైసీపీ విఫ‌ల‌మవుతుంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

  అస‌లు ర‌ఘ‌రామ‌కృష్ణ‌రాజు ఎలాంటి రహస్య ఎజెండాతో సొంత పార్టీపైనే తిరుగుబాటు చేస్తున్నారు. ఒక వైపు త‌మ ముఖ్య‌మంత్రి త‌నుకు దేవుడు అంటూనే.. మరోవైపు పార్టీ, ప్ర‌భుత్వ విధానాల‌పై ఎందుకు ఇలా నోరుపారేసుకుంటున్నారు? ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు వెనుక ఉండి ఎవ‌రైనా నడిపిస్తున్నారా? లేదా వేరే పార్టీతో కలిసి న‌డ‌వ‌డానికి ఆయ‌న ఈ దారిని ఎంచుకున్నారా? ఇలా కొన్ని వంద‌ల ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఎవ‌రి వాదన‌లు ఎలా ఉన్న ర‌ఘ‌ురామ‌ కృష్ణంరాజు ఒక ప‌క్క వ్యూహాంతోనే ఇలా వ్య‌వ‌హరిస్తున్నార‌నేది ఆయన స‌న్నిహితులు చెబుతున్నారు.

  పార్టీ పంపించిన షోకాజ్ నోటీస్‌లో న్యాయ‌ప‌ర‌మైన అంశాలు లేవ‌నెత్తి ఇప్పుడు పార్టీ ఉనికిపైనే దెబ్బ కొట్టేంత ప‌ని చేయ‌డానికి గ‌ల ముఖ్య కార‌ణముంది. ర‌ఘురామ‌కృష్ణ రాజు ఇప్ప‌టికిప్పుడు పార్టీకి లేదా ప‌ద‌వి రాజీనామా చేయ‌ద‌లచుకోలేదు. ఒక సారి ప‌ద‌వికి రాజీనామా చేస్తే త‌న ప‌ద‌విని కోల్పోవాల్సి ఉంటుంది. ఏ రాజ‌కీయ నాయుకుడికైనా ప‌ద‌వి ఉంటేనే మ‌నుగ‌డ ఉటుంది. దాంతో పాటు పార్టీకి రాజీనామా చేస్తే, త‌న‌పై అనర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉంటుందని ఆయ‌న‌కు తెలుసు. అందుకే త‌న‌కు తానుగా పార్టీ నుంచి గాని, ప‌ద‌వి నుంచి గానీ వెళ్ల‌కుండా పార్టీ అధినేత ద్వారానే స‌స్పెండ్ చేయించుకుంటే త‌న‌కు క‌లిసి వస్తుందని రఘురామ కృష్ణంరాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  ఒక వేళ పార్టీయే త‌న‌ను స‌స్పెండ్ చేస్తే త‌న‌పై అన‌ర్హ‌త వేటు వ‌ర్తించ‌దు. అప్పుడు స్వ‌తంత్ర ఎంపీగానే కొనసాగ‌వ‌చ్చు. స్వ‌తంత్ర స‌భ్యుడుగా బ‌య‌ట ఉండి త‌న‌కు న‌చ్చిన పార్టీకి మద్దతు ఇవ్వొచ్చు. ఇదే వ్యూహాంతో ర‌ఘ‌రామ‌ కృష్ణంరాజు ఇలా న్యాయపరమైన అంశాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే త‌న‌పై పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునే విధంగా పార్టీ పెద్దలను రెచ్చగొడుతున్నారు. ఐతే రఘురామ కృష్ణంరాజు ఒకవేళ వైసీీప నుంచి బయటకు వస్తే... ఏ పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. బిజేపీలోకి చేర‌బోన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు.. బ‌య‌టి నుంచే ఆ పార్టీకి మద్దతు తెలిపే విధంగా ఇప్ప‌టికే ప్లాన్ చేసుకున్న‌ట్లు తెల‌ుస్తోంది.

  అస‌లు వైసీపీలో ఇంత ర‌చ్చఅవ‌డానికి కార‌ణం.. ర‌ఘ‌ురామ‌కృష్ణ రాజు కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకొని తిర‌గ‌డ‌మే..! దానికి ఆయ‌న సమాధానం కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం కేంద్రంలో బిజేపీ అధికారంలో ఉంది కాబ‌ట్టే బిజేపీతో తిరుగుతున్నాను. అందులో త‌ప్పేంటీ? సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, మోదీని కలిశారు. అంతమాత్రాన వైఎస్ జగన్ తమ పార్టీని బీజేపీలో కలిపేసినట్లా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు రఘురామ. మ‌రోవైపు ఇప్ప‌టికిప్ప‌డు బీజేపీ కూడా ఈయ‌న్ని త‌మ పార్టీలోకి ఆహ్వ‌ానించ‌క‌పోవ‌చ్చు. పార్టీ నుంచి స‌స్పెండ్ చేయించుకొని.. ఆ తర్వాత బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని, తద్వారా ఏపీలో ఆ పార్టీకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడమే రఘురామ కృష్ణంరాజు వ్యూహంగా తెలుస్తోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు