అన్నారఘు, న్యూస్ 18 అమరావతి
Vinayaka Chaturthi 2021: భారత దేశం వ్యాప్తంగా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ వినాయక చవితి (Vinayaka Chavithi).. నవరాత్రి ఉత్సవాల పేరుతో ప్రతి ఏడాది గణపతి నవరాత్రులను చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ తొమ్మిరోజులు ప్రజలను ఆధ్యాత్మికతవైపు నడిచేలా చేస్తుంది. మారుతున్న కాలంలో ఎవరికి వారు అన్నట్టు ఉన్న కుటుంబాలను.. అందరినీ ఒకే చోటికి చేరేలా చేసి.. అందరిలో భక్తి, స్నేహ భావాన్ని పొంపొందిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు అందరూ ఇష్టపడే పండుగలలో వినాయక చవితి ఒకటి.. అయితే గత రెండేళ్లుగా ఈ పండుగపై కరోనా ఎఫెక్ట్ (Corona Effect) పడింది. ప్రస్తుతం థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. ప్రజలంతా వేడుకలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వినాయక చవితితో సమాజిక ప్రయోజనాలే కాక.. ఔషద, ఆయుర్వేద ప్రయోజనాలు (Ayurved benefits) కూడా ఉన్నాయి.. ఇంతకీ ఏంటి ఆ ప్రత్యేకత అనుకుంటున్నారా..?
గణపతి అంటే పృద్వి తత్వము.. ఈ పృథ్విలో లభించిన ముఖ్యమైన ఔషధాలను సేకరించి మంత్రోచ్చారణతో గణపతి పూజించడంతో మానవులకు మంచి ఆరోగ్యం మానసిక ఉల్లాసం కలుగుతాయి గణపతి పూజా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం ఇది.. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన 21 ద్రవ్యములు ఉత్తమమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి వాటిని తాకడం లేదా సేకరించడం లేదా వాటిని యుక్తంగా వాడడం వల్ల మానవులకు కలిగే ఎన్నో రుగ్మతలు వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
ఏంటా ప్రయోజనాలు
1. మాచీ పత్రం (దవనం) వివిధ చర్మవ్యాధులు వాత సంబంధ రోగాలు తగ్గిస్తుంది ఉత్తేజం కలిగిస్తుంది
2. బృహతీ పత్రం( వాకుడు.) శ్వాస సంబంధ వ్యాధులు దగ్గు మలబద్ధకం లను నివారిస్తుంది. సూతికా వ్యాధులలో ఉపయుక్తం.
3. బిల్వపత్రం( మారేడు) ఉదర సంబంధ వ్యాధులు అతిసారము గ్రహాని గ్రహాన్ని నివారిస్తుంది మరియు నీరును శుద్ధిచేస్తుంది.
4. దూర్వా పత్రం( గరిక) రక్తసంబంధం వ్యాధులు రక్తం గడ్డ కట్టడానికి మరియు రక్తవృద్ధికి రక్తం శుద్ధి చేయడానికి ఉపకరిస్తుంది చర్మ వ్యాధులను పోగొడుతుంది కాలేయానికి హితము.
5. దత్తూర పత్రం.( ఉమ్మెత్త.) శ్వాస రోగాలు కీళ్ళ వ్యాధులను చర్మ సంబంధ వ్యాధులను వెంట్రుకలు రాలకుండా చేయడంలోనూ ఉదరసంబంధ వ్యాధులను బాగా పనిచేస్తుంది.
6. బదరీ పత్రం.( రేగు.) జీర్ణసంబంధ వ్యాధులు వ్రణాలు రక్ష రక్తశుద్ధికి వెంట్రుకలు వృద్ధి చెందడానికి సరిగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
7. అపామార్గ పత్రం.( ఉత్తరేణి.) విషాహారం జీర్ణకోశ వ్యాధులు జ్ఞానానికి అధిక ఆకలిని తగ్గిస్తుంది.
8. తులసీ పత్రం.( తులసి.) విచారము జీర్ణకోశ వ్యాధులు, ఊబకాయము తగ్గించడం. అధిక ఆకలిని తగ్గిస్తుంది జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది.
9 చూత పత్రం.( మామిడి.) మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది, విరిగిన కీళ్లకు ఉపయోగం పడుతుంది వాతావరణంలో ఉన్న విష ప్రభావాన్ని తగ్గిస్తుంది.
10. కరవీర పత్రం. (గన్నేరు). చర్మ వ్యాధులు కుష్టు వ్యాధి లక్షణాలు వ్రణాలు తగ్గిస్తుంది. వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది. పేనులం తగ్గిస్తుంది.
11. విష్ణుక్రాంత పత్రం వాత సంబంధ వ్యాధులు మూర్ఛ వ్యాధిని తగ్గిస్తుంది జ్ఞాపక శక్తికి ఉపయోగపడుతుంది. నరాలకు బలం చేకూరుతుంది.
12. దాడిమీ పత్రం. (దానిమ్మ.) ఉదర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది రక్త వృద్ధి, శుద్ధి చేస్తుంది అజీర్ణము మంట లాంటి వికారాలను తగ్గిస్తుంది.
13. దేవదారు పత్రం( దేవదారు.) శ్వాసకోస మేధో వ్యాధులను తగ్గిస్తుంది చర్మ వ్యాధులు మందు దీర్ఘకాలిక పుండ్లను తగ్గిస్తుంది.
14. మరువక పత్రం. మరువం. హృదయ సంబంధ వ్యాధులు చర్మ వ్యాధులు నందు కీళ్ళ వ్యాధులు ఉపయోగం.. ఉత్తేజాన్నిస్తుంది.
15. సింధూర పత్రం (వావిలి..) వాత సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది విషాహార ద్రవ్యము కీళ్ళ వ్యాధులు శ్వాస సంబంధ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
16. జాజి పత్రం. చర్మ వ్యాధులు నోటికి సంబంధించిన వ్యాధులు ఉదర వ్యాధులు మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.. ఉత్తేజాన్నిస్తుంది.
17. గండకీ పత్రం (దేవకాంచనం).. హృదయ సంబంధ వ్యాధులు హర్ష చర్మవ్యాధులు రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది.
18. షమీ పత్రము (జమ్మి.) వాతావరణ శుద్ధికి ఉపయోగం శ్వాస సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
19. అశ్వత్థ పత్రం.( రావి.) బెరడు రక్తం ప్రవహించే వ్యాధులలో ఉపయోగపడుతుంది సంతాన కరము వాతావరణాన్ని నీటిని శుద్ధి చేస్తుంది.
20. అర్జున పత్రం.( మద్ది) హృదయ సంబంధ వ్యాధులు దీర్ఘకాలిక గాయాలను తగ్గిస్తుంది. కీళ్ళ వ్యాధులను తగ్గిస్తుంది
21. అర్క పత్రం.( జిల్లేడు.) విష చర్మ వ్యాధులు కుష్టు వ్యాధి దీర్ఘకాలం గాయాలను కీళ్ళ వ్యాధులను తగ్గిస్తుంది..
ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అనేక రకములైన వ్యాధులను ఈ పండుగ సందర్భంగా చేసే ఉండ్రాళ్ళు పాయసం బెల్లం మరి తుమ్మికూర తీసుకోవడం కారణంగా మన శరీరంలో ఉన్న క్రిమి సంబంధమైన.. పొట్టలో ఉండే క్రిములను నివారిస్తుంది- డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ayurveda health, Health benefits, Telangana, Vinayaka Chavithi, Vinayaka Chaviti