Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganta: గంటాను టీడీపీ పెద్దలు పక్కన పెట్టారా..? భీమిలి, నార్త్ నియోజవర్గాలపై ఆ ఇద్దరూ ఫోకస్

Ganta: గంటాను టీడీపీ పెద్దలు పక్కన పెట్టారా..? భీమిలి, నార్త్ నియోజవర్గాలపై ఆ ఇద్దరూ ఫోకస్

టీడీపీకి గంటా గుడ్ బై

టీడీపీకి గంటా గుడ్ బై

Ganta Srinivasa rao: టీడీపీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర కీలక నేత గంటా రాజకీయ భవిష్యత్తు ఏంటి..? ఆయన వేసిన ప్లాన్స్ అన్నీ రివర్స్ అవుతున్నాయా..? అందుకే సైలెంట్ అయ్యారా..? ఇఫ్పుడు టీడీపీ అధిష్టానం కూడా ఆయన్ను పక్కన పెట్టిందా..? ఆయన నియోజకవర్గాలపై ఆ కీలక నేతలు ఇద్దరూ ఫోకస్ చేశారా..?

ఇంకా చదవండి ...

Ganta Srinivasa rao:  ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. పార్టీ ఏదైనా.. నియోజకవర్గం ఎక్కడైనా ఆయన గెలుస్తారనేది వాస్తవం. ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు గంటాను పిలిచి మరీ పార్టీలు తమ కండువాలు కప్పేవి. ఇప్పుడు గంటా పరిస్థితి దారుణంగా మారింది. ఆయన ఊహించింది ఏదీ జరగడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన చాలా సైలెంట్ అయ్యారు. ఇటీవ‌ల విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం నేప‌థ్యంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రిజైన్ చేసిన గంటా కొంత హ‌డావుడి సృష్టించారు.  రాజీనామా ఆమోదించుకుంటాను అన్నారు. స్పీకర్ తమ్మినేని కూడా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని.. రాజకీయాలకు అతీతంగా అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తాను అన్నారు గంటా.. కానీ ఇప్పుడు కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కోసం బిడ్లను ఆహ్వానించింది కూడా. మరోసారి ఉక్కు ఉద్యమం తారాస్థాయికి చేరింది. అయినా గంటా ఎక్కడా కనిపించడం లేదు. అయితే అందుకు కారణం వేరే ఉంది అంటున్నారు ఆయన సన్నిహితులు. ఆయన ఒకటి తలిస్తే.. మరొకటి జరుగుతోందని నిట్టూరుస్తున్నారు.

తన రాజీనామాస్త్రంతో అన్ని పార్టీలు తనవైపే చూస్తాయని.. కచ్చితంగా అధికార పార్టీ నుంచి పిలుపు అందుతుందని ఆశించారు. అయితే గంటాను వైసీపీలోకి తీసుకునేందుకు సీఎం జగన్ సుముఖంగానే ఉన్నా.. స్థానికంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుపడుతున్నారు. గంటా పార్టీలో చేరకుండా విజయసాయి రెడ్డి తెలివిగా.. ముందే అడ్డుకాలు వేశారు. సీఎం జగన్ ముందు గంటా ప్రతిపాదనలు పెట్టారని.. ఆయన అవసరం తమకు లేదంటూ ఆరోపించారు. విషయం బహిర్గతం చేయడంతొ.. వైసీపీలోకి గంటా ఎంట్రీకి బ్రేకులు పడ్డట్టు అయ్యింది.. అప్పటి నుంచి గంటా సైలెంట్ అయ్యారు.

ఇదీ చదవండి: పార్టీ ప్రకటన తొలి రోజే జగన్ కు షర్మిల రివర్స్ పంచ్.. అన్నపై విమర్శలు..!

వైసీపీలోకి వెళ్లి పరువు పోగొట్టుకోవడం కంటే వచ్చే ఎన్నికల వరకు టీడీపీలోనే ఉండడడం బెటరనుకుంటున్నారు. ఎలాగూ రెండున్నరేళ్లు గడిచాయి. మరో ఏడాది ఓపికి పడితే మళ్లీ ఎన్నికల హడావుడి వస్తుంది. అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకోవచ్చని.. భీమిలి లేదా నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ఆ తరువాత రాజకీయ నిర్ణయం తీసుకుందమనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు టీడీపీ పెద్దలు ఇప్పుడు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో ఉంటారో.. ఉండరో తెలియని నేతను వెంటను బెట్టుకుని వెళ్లడం కంటే.. అలాంటి నేతను పక్కన పెట్టడమే సరైందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.

ఇదీ చదవండి: తెలంగాణలో షర్మిల పార్టీపై జగన్ పరోక్ష స్పందన.. ఆయన ఏమన్నారంటే..?

భీమిలి, నార్త్ నియోజకవర్గాలపై కీలక నేతలు ఫోకస్ చేయడం కూడా అందుకు ఒక కారణం. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి లోకేష్, ఆయన తోటళ్లుడు శ్రీ భరత్ కూడా పోటీ చేయాలి అనుకుంటున్నారు. అయితే లోకేష్ మాత్రం భీమిలి నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వస్తే.. అతడి కోసం శ్రీ భరత్ నార్త్ సీటును కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ లోకేష్ మంగళగిరి లేదా పెనమలూరికే పరిమితం అవ్వాల్సి వస్తే.. శ్రీ భరత్ భీమిలిలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో మళ్లీ భీమిలికి వెళ్లాలి అనుకున్న గంటా ఆశలపై నీళు జల్లినట్టే అవుతుంది. పోనీ వైసీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేద్దామనుకున్నా.. ఆ సీటును అవంతి వదులుకోరు.. నార్త్ అభ్యర్థిగా వైసీపీ తరుపున కేకే రాజు ఇప్పటికే పూర్తిగా బలపడ్డారు. మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ ఫలితం కనిపించింది కూడా. దీంతో గంటాకు అన్ని దారులు మూసుకుపోయి టీడీపీలోని ఉండి సీటు దక్కించుకోవాలి అనుకుంటున్నారు. కానీ గత రెండేళ్లుగా గంటా తీరుతో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం అలాంటి నేతను పార్టీలో ఉంచుకుంటే ఎప్పటికైనా నష్టం తప్పదని.. ముందే పక్కన పెట్టి ప్రత్యామ్నాయం చూసుకోవడం మేలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Ganta srinivasa rao, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు