New Front: చంద్రబాబు ప్రస్తావన లేకుండానే కొత్త ఫ్రంట్.. కారణం ఎంటో తెలుసా..?

చంద్రబాబు ప్రస్థావన లేని థర్డ్ ఫ్రంట్

దేశంలో కొత్త ఫ్రంట్ ఏర్పాటకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఫ్రంట్ లో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావనే కనిపించడం లేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలరనే పేరు ఉన్న చంద్రబాబును ఇప్పుడు ఎందుకు జాతీయ నేతలు పట్టించుకోవడం లేదు..? లేదా చంద్రబాబే రాజకీయంగా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా..?

 • Share this:
  దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయి.  కొత్తగా ఏర్పడుతున్న  ఫ్రంట్ లో మొదట వినిపించాల్సిన పేరు చంద్రబాబుదే.. ఎందుకంటే గతంలో ఫ్రంట్ లో ఆయన కీలక పాత్ర పోషించారు. అన్ని ప్రాంతీయ పార్టీలతో సత్ససంబంధాలు ఉన్నాయి. అందులోనూ గత ఎన్నికలకు ముందు బీజేపీని గట్టిగా ఎదిరించి పోరాడింది ఆయన ఒక్కరే.. ఇలా ఏ లెక్కన చూసుకున్నా ఏదైనా కొత్త ఫ్రంట్ అంటూ వస్తే అది చంద్రబాబుతో మొదలవ్వాలి.. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే కొత్త ఫ్రంట్ చర్చల్లో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావనే రావడం లేదు. కొత్త ఫ్రంట్ కు ఏర్పాట్లు చేస్తున్న నేతలు కావాలనే చంద్రబాబును పక్కన పెట్టారా.? పెడితే అందుకు కారణం ఏంటి..? లేక చంద్రబాబే వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారా..? ఇంతకీ టీడీపీ అధినేత మదిలో ఏ ముంది..? వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏ స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు.

  దేశంలో ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి, కాంగ్రెస్ లేకుండా అంటూ రకరాకల చర్చలు నడుస్తున్నాయి. కారణం ఏదైనా మోదీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ కొత్త ఫ్రంట్ కు రూపకల్పన చేస్తున్నట్టు ప్రచారం ఉంది. శరద్ పవార్ ను స్క్రీన్ ముందు పెట్టి.. తెర వెనుక కథ పీకే నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. పీకే శరద్ పవర్ చర్చల్లో అన్ని ప్రాంతీయ పార్టీల పేర్లు తెరపైకి వస్తున్నాయి.. ఇప్పటి వరకు చంద్రబాబు పేరు ఎక్కడా వినిపించలేదు. అందుకు కారణం ఏంటి..? ఈ ఫ్రంట్ లో బాబును కలపడం పీకెకె ఇష్టం లేదా..? లేక ఏపీలో టీడీపీ ఇక పుంజుకునే అవకాశం లేదని.. టీడీపీతో ఎలాంటి లాభం లేదనుకున్నారా..? లేక చంద్రబాబే వ్యూహాత్మకంగా ఈ కొత్త ఫ్రంట్ కు దూరంగా ఉంటున్నారా..?

  ఇదీ చదవండి: ఏపీలో పరిస్థితిపై నవనీత్ కౌర్ ఆవేదన.. తెలుగువారి కోసం పోరాటం చేస్తానన్న ఎంపీ

  2019 ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా టీడీపీ చీఫ్‌ పెద్ద ఉద్యమమే చేశారు. దేశవ్యాప్తంగా నేతలను కూడగట్టారు. మోదీ ఓడితేనే దేశం బతుకుతుంది అని గళం ఎత్తారు. ఇతర ప్రాంతీయ పార్టీలను కలిపి మీటింగ్‌లు పెట్టారు. దీనిలో భాగంగా కాంగ్రెస్‌తోను జత కట్టారు చంద్రబాబు. 2019 ఎన్నికల తరువాత అంతా తారుమారైంది. ప్రధానిగా మోడీ మరింత బలమైన నేతగా ఆవిర్భవించారు. దీంతో జాతీయ రాజకీయలపై సైలెంట్‌ అయింది టీడీపీ.

  బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో కొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. 2019లో పెద్దఎత్తున బీజేపీ వ్యతిరేక పోరాటం చేసిన చంద్రబాబు.. ఆ చర్చల్లోకి వెళ్లడానికే ఇష్టపడటం లేదు. 2019 ఎన్నికల తరువాత మోడీకి దగ్గరగా ఉండేందుకు టీడీపీ చీఫ్‌ ప్రయత్నించారు. ఈ విషయంలో బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చినా.. పెద్దగా లెక్క పెట్టలేదు. రాష్ట్రంలో అధికారంలేని సమయంలో ఇటు సీఎం జగన్‌తో పోరాడుతూ.. అటు ప్రధానితోనూ వైరం మంచిది కాదని భావిస్తూ వచ్చారు. దేశంలో మోడీ వ్యతిరేకంగా కొందరు జట్టు కడుతున్నా.. చంద్రబాబు మాత్రం అటుగా చూసేందుకు కూడా సిద్ధంగా లేరు. ఇప్పట్లో మోదీ క్రేజ్ తగ్గే అవకాశం లేదని.. ఇలాంటి సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వెళ్లి కోరి కష్టాలు తెచ్చుకోవడం కాన్నా.. కూల్ గా కాంప్రమైజ్ అవ్వడం బెటటరని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విధేయుల ద్వారా కేంద్ర పెద్దలకు తన మనసులో మాట చేర్చినట్టు సమాచారం. కానీ ప్రస్తుతానికైడా జగన్ తో సఖ్యత మెయింటెన్ చేస్తున్న బీజేపీ.. చంద్రబాబుతో పెద్దగా లాభం లేదనుకుంటున్నట్టు టాక్..

  ఇదీ చదవండి: సీఎం అలా మాట మారుస్తారనుకోలేదు.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  చంద్రబాబు వ్యవహారం తెలియడంతోనే కొత్త ఫ్రంట్ నేతలు చంద్రబాబును పక్కన పెట్టారనే ప్రచారం కూడా ఉంది. 2019 ఎన్నికల తరవాత చంద్రబాబు కేంద్రంపట్ల అనుసరించిన వైఖరి వల్ల ఇతర జాతీయ నేతల్లో పలుచన అయ్యారని టాక్‌. తరుచూ ఆలోచనలు మార్చుకునే చంద్రబాబుతో కష్టమని ఇతర ప్రాంతీయ పార్టీ నేతలు కూడా నిర్ణయానికి వచ్చేశారట. అందుకే దేశంలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు పేరు ఎక్కడా వినిపించడం లేదని కొందరి వాదన. టీడీపీ చీఫ్ కూడా ఏ ఫ్రంట్ చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరట. రాష్ట్రంలోని వ్యవహారాలతోనే ఆయన తీవ్రంగా సతమతం అవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

  ఇదీ చదవండి: ఆ కీలక నేతను లోకేష్ పక్కన పెట్టారా? పార్టీ పదవుల్లో త్వరలోనే మార్పులు తప్పవా?

  ప్రస్తుతం ఏపీలోని పరిస్థితులు కూడా చంద్రబాబుకు ఏ మాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. టీడీపీకి పార్లమెంట్‌లోనూ పెద్దగా బలం లేదు. ముగ్గురు లోక్‌సభ సభ్యులు, ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులపట్ల పూర్తి అవగాహనతో ఉన్న చంద్రబాబు.. ఈ ఎపిసోడ్‌కు దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. ఏపీలో పార్టీనికి కాపాడుకోవడమే పెద్దసవాల్‌. ఫ్రంట్.. ఉద్యమం వంటి అంశాలకు తాము దూరమంటున్నారు తెలుగుదేశం నాయకులు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీలు వారి వైఖరి ఏంటో చెప్పిన తరువాత నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు..? ఆయన బీజేపీతో వెళ్లాలి అనుకుంటే కొత్త ఫ్రంట్ లో చేరాలని.. లేదా జగన్ మోదీకి వ్యతిరేక కూటమిలో చేరితే దాన్ని సాకుగా చూపి బీజేపీతో మళ్లీ జత కట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
  Published by:Nagesh Paina
  First published: