Home /News /andhra-pradesh /

WHAT CBI SAYS OVER AYESHA MURDER CASE NOW NK

ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?

ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?

ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?

Justice for Ayesha : ఆయేషా హత్య జరిగిన 12 ఏళ్ల తర్వాత రీపోస్ట్‌మార్టం చేయించారు సీబీఐ అధికారులు. ఇప్పటికైనా నిజాలు వెలుగులోకి వస్తాయా? ఆయేషాను చంపిందెవరు?

  Justice for Ayesha : శనివారం ఏపీ న్యూస్‌‌లో గుంటూరు జిల్లా... తెనాలి టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యింది. కారణం ఆయేషా మీరా హత్యోదంతం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు... శనివారం ఉదయమే తెనాలిలోని ఆయేషా మీరాను ఖననం చేసిన శ్మశానానికి వెళ్లి... ఆమె మృతదేహాన్ని బయటకు తీసి... 12 ఏళ్ల తర్వాత మళ్లీ పోస్ట్‌మార్టం చేయించారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక డాక్టర్లు, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్, తమిళనాడు, కేరళ నుంచి DNA ఎక్స్‌పర్ట్స్ వచ్చారు. చెన్నై, విశాఖ, హైదరాబాద్‌ నుంచి సీబీఐ టీమ్ తెనాలికి వచ్చింది. దాదాపు 10 గంటలపాటూ రీపోస్ట్‌మార్టం ప్రక్రియ కొనసాగింది. సీబీఐ అధికారులు.... ఆయేషా తండ్రి, మతపెద్దలు అందరూ ఉన్నప్పుడే... ఇదంతా చేయించి... వీడియో కూడా తీయించారు. ప్రధానంగా ఆయేషా తలపై తగిలిన గాయం ఎలాంటిది? అది ఎలా తగిలింది? అనే అంశాన్ని తెలుసుకునేందుకు రీపోస్ట్‌మార్టం జరిపించినట్లు తెలిసింది. సమాధి నుంచి ఆయేషా ఎముకలు, కొన్ని వెంట్రుకలు, మూడు భాగాలుగా విడిపోయిన పుర్రె... ఇతర భాగాలను ప్యాక్‌ చేసి పట్టుకెళ్లారు. తద్వారా ఆమె తల, ఎముకలకు తగిలిన గాయాలవల్లే ఆమె చనిపోయిందని చెప్పే అవకాశాలున్నాయి.

  ఆయేషా హత్య జరిగినప్పుడు పోలీసులు కోర్టుకు ఇచ్చిన ఆయేషా DNA రిపోర్టును తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఆయేషా... నుదురు భాగంలో బలంగా కొట్టడం వల్లే చనిపోయిందని, రెండు ఆయుధాల్ని వాడారని పోలీసులు చెప్పినా.... ఆయేషా తల్లి షంషద్‌ బేగం నమ్మలేదు. హాస్టల్‌కు వెళ్లి చూసినప్పుడు గోడపై రక్తపు మరకలున్నాయని, తలను గోడకు కొట్టడం వల్లే చనిపోయిందని ఆమె అంచనా వేశారు. ఆయుధాలు కూడా వాడారనీ, పోలీసులు ఆధారాల్ని మాయం చేస్తున్నారని ఆరోపించారు. రక్తపు మరకలన్నీ క్లీన్ చేసేశారని మండిపడ్డారు. తలపైనే కాకుండా మెడ భాగంలోనూ దెబ్బలు ఉన్నట్లు ఫొటోల్లో కనిపించినా, FIRలో చూపలేదని ఆయేషా తరపు లాయర్ అన్నారు. ఇప్పుడు సీబీఐ అధికారులకు దొరికే ఆధారం ఆమె ఎముకలే. అందుకే వాళ్లు పుర్రెపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. మరి వాళ్లు ఏ రిపోర్ట్ ఇస్తారో తేలాల్సి ఉంది.

  2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి మంత్రి కోనేరు రంగారావు కొడుకు, హాస్టల్ వార్డెన్, కొందరు విద్యార్థులపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సరిగా దర్యాప్తు చెయ్యలేదని ఆయేషా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపించాయి. దీంతో దోషులెవరో తేల్చాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఆయేషా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దోషులు ఎవరన్నది తేలుతుందా అని ఆసక్తి నెలకొంది.


  Pics : చైనాలో దూసుకుపోతున్న కిమ్ చియు
  ఇవి కూడా చదవండి :  Health : ఒరెగానో వాడుతున్నారా... కిచెన్‌లో ఇది ఉంటే ఆరోగ్యమే

  Health : అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

  Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...

  Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి

  Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Ayesha Murder Case, Telugu news

  తదుపరి వార్తలు