తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నా... ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండు పార్టీలూ... ఈవీఎంలు, వీవీప్యాట్లను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాయి. వాటి ఏజెంట్లు వేసవిలో సేద తీరకుండా... ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల దగ్గరే ఉంటున్నారు. అటూ ఇటూ తిరుగుతూ... పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఎప్పుడెప్పుడు మే 23 వస్తుందా అని డైలీ మొబైల్‌లో కేలండర్‌ను చూసుకుంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. వాళ్లను చూసి జాలి పడ్డారో ఏమోగానీ... ఎన్నికల సంఘం అధికారులు... వాళ్లకు కొన్ని సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ఏం చెయ్యాలి... అనేదానిపై కొన్ని విషయాలు చెప్పారు.
కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఏం చెయ్యాలంటే :
* ఓటర్ల సంఖ్య, పోలైన ఓట్ల సంఖ్యను వివరించే ఫారం-17సి ని దగ్గర ఉంచుకోవాలి.
* ప్రతి పోలింగ్ కేంద్రం ఫారం 17Cలో ఉన్న కంట్రోల్ యూనిట్ నెంబర్, ఈవీఎం మిషన్‌పై ఉన్న నెంబర్ ఒకేలా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
* ఫారం 17Cలో నమోదైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలో చూపిస్తున్న ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి.
* కంట్రోల్ యూనిట్‌కు ఉండే అన్నీ సీళ్లను ఫారం 17Cలో ఉన్న నెంబర్లతో సరిగా ఉన్నాయా, లేదా సరిచూసుకోవాలి.
* మిషన్‌పై సీళ్లు ఏమైనా చిరిగి ఉంటే ఏదో తేడా జరిగినట్లు భావించాల్సి ఉంటుంది.
* కంట్రోల్ యూనిట్ పై అన్ని సీళ్లపైనా ఏజెంట్లు, అధికారుల సంతకాలు ఉంటాయి. అవి సరిగ్గా ఉన్నాయో, లేదో చూసుకోవాలి.
* పోలింగ్ టైంలో పోలింగ్ కేంద్రంలో ఒక దాని బదులు మరో ఈవీఎం వాడివుంటే, దాని వివరాలు కూడా ఫారం-17Cపై ఉండి తీరాలి. ఇది కూడా ముఖ్యమైన అంశం.
* పైవన్నీ అయ్యాక, అంతా కరెక్టుగా ఉంటే, అధికారులు రిజల్ట్ బటన్ నొక్కుతారు. అప్పుడు ఆ మిషన్... నియోజకవర్గంలో నోటాతో కలిపి పోటీ చేస్తున్న అభ్యర్థుల మొత్తం సంఖ్యను చూపించాలి.
* పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల సంఖ్య, ఫారం-17Cలో పోలైన ఓట్లతో సమానంగా ఉండాలి.
* కంట్రోల్ యూనిట్‌లో పోలింగ్ తేదీ (ఏప్రిల్ 11), పోలింగ్ ప్రారంభించిన సమయం, పోలింగ్ ముగించిన టైం, సెకండ్లతో సహా చూపిస్తుంది. అవన్నీ సరిగ్గా ఉన్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి.
* ఇవన్నీ సరిగా ఉంటేనే... కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. ఏవైనా తేడా ఉంటే, కౌంటింగ్ జరపడానికి వీల్లేదు. ఏజెంట్లు ఒప్పుకోకూడదు. అధికారులు కూడా ఏజెంట్లు ఒప్పుకోనప్పుడు బలవంతంగా కౌంటింగ్ చెయ్యకూడదు.
అంతా బాగానే ఉంటే... ప్రతీ రౌండ్‌లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏజెంట్లు అంగీకరించాలి. ఆ తర్వాతేముంది... ఫలితాలు చూసుకోవడమే.
ఇవి కూడా చదవండి :
విశాఖలో వైఎస్ జగన్... ఎయిర్‌పోర్టులో అదిరిపోయే స్వాగతం
నన్ను లైవ్‌లో ప్రశ్నించండి అంటున్న కేటీఆర్... కాచుకోండి అంటున్న నెటిజన్లు...
ఓటు వేయలేకపోతున్న విరాట్ కోహ్లీ... ఎక్కడ తేడా వచ్చిందంటే...
తీవ్ర తుపానుగా ఫణి... 30న దక్షిణ కోసావైపు రాక... అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం...
అహింసా మీట్.. ఇక ల్యాబ్‌లో మాంసం తయారీ... కోళ్లు, మేకలతో పనిలేదు... టేస్ట్ ఎలా ఉంటుందంటే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, EVM, Evm tampering, Lok Sabha Election 2019, Vvpat