హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

టీడీపీ వైసీపీ జనసేన... ఏ పార్టీ హామీలు ఎలా ఉన్నాయి... ఎవరి హామీలు బాగున్నాయి...

టీడీపీ వైసీపీ జనసేన... ఏ పార్టీ హామీలు ఎలా ఉన్నాయి... ఎవరి హామీలు బాగున్నాయి...

చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్,

చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్,

AP Assembly Elections : ఎన్నికలకు ఇంకా రెండు వారాల టైమే ఉండటంతో... ఏపీలో ప్రధాన పార్టీలు హామీల జల్లు కురిపిస్తున్నాయి.

    ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం ఎక్కువగా ఉండటం వల్ల అడ్డగోలు హామీలు ఇవ్వకుండా... అమలు చేసేందుకు వీలయ్యే హామీలతోనే మేనిఫెస్టోలని రూపొందిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన మేనిఫెస్టోకి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. దాన్ని మించిన విధంగా తమ మేనిఫెస్టో ఉండాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలతో సంబంధం లేకుండా యువతే టార్గెట్‌గా జనసేన తన మేనిఫెస్టోని రూపొందించింది. జనసేన ఇప్పటికే తన మేనిఫెస్టోలో కీలక అంశాల్ని ప్రకటించింది. టీడీపీ, వైసీపీ మాత్రం ఇంకా తమ మేనిఫెస్టోలను ప్రకటించకుండా... ఎవరు ముందు ప్రకటిస్తే, దాని కంటే బెస్ట్ మేనిఫెస్టోను తాము ప్రకటించాలని రెండు పార్టీలూ ఎదురుచూస్తున్నాయి. మనం మాత్రం సూటిగా, సుత్తిలేకుండా మూడు పార్టీల హామీలను ఫటాఫట్ తెలుసుకుందాం.


    టీడీపీ హామీలు :

    * 2019 నాటికి పోలవరం పూర్తి

    * కరవు లేని ఆంధ్రప్రదేశ్

    * 40 లక్షల ఎకరాలకు సాగునీరు

    * ఐదు నదులను కలిపేసి, కరవుకు చెక్

    * రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 9 గంటల ఫ్రీ కరెంట్‌ని 12 గంటలకు పెంపు

    * సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

    * చివరి ఆయకట్టు రైతులకూ నీరు

    * రైతుల్ని ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ మరో ఐదేళ్లు పొడిగింపు

    * ధరల పతనం, దళారులకు చెక్ పెట్టేందుకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

    * స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు

    * యువనేస్తంలో ఇచ్చే నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచీ రూ.2000కు పెంపు

    * నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్

    * పింఛన్లు రూ.2000 నుంచీ రూ.3000కు పెంపు

    * 300 చదరపు గజాల స్థలం ఉంటే, ఫ్రీగా ఇంటి నిర్మాణం.

    * పసుపు కుంకుమ పథకం కింద ఇస్తున్న రూ.10000 కొనసాగింపు


    వైసీపీ హామీలు :

    * నవరత్నాల హామీలు అమలు

    * రైతులకు 12 గంటలు పగటిపూట ఫ్రీ కరెంట్

    * రైతులకు వడ్డీ లేని రుణాలు

    * ఏడాదికి రూ.12500 చొప్పున రైతుకు పెట్టుబడి సాయం

    * రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

    * సహకార డెయిరీలకు లీటర్ పాలకు రూ.4 పెంపు

    * వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు పన్ను రద్దు

    * రైతులకు వైఎస్సార్ భీమా కింద రూ.5 లక్షల భీమా

    * ప్రతి పార్లమెంట్ స్థానాన్నీ ఒక జిల్లాగా 25 జిల్లాల ఏర్పాటు

    * గ్రామస్థాయిలో సచివాలయం ఏర్పాటు, పది మంది స్థానికులకు ప్రతి గ్రామంలో ఉద్యోగాలు

    * జలయజ్ఞం కింద ప్రాజెక్టలన్నీ పూర్తి

    * రూ.4000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు

    * ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం సక్రమంగా అమలు

    * బడికి పంపే పిల్లల కోసం ఏడాదికి రూ.15000

    * మూడు దశల్లో మద్యపాన నిషేధం

    * ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే

    * హాస్టల్ ఫీజు కోసం ఏడాదికి రూ.20000

    * పెన్షన్ దారుల వయస్సు 45 ఏళ్లకు తగ్గింపు

    * పెన్షన్లు రూ.2000 నుంచీ రూ.3000కు పెంపు

    * పేదలందరికీ ఇల్లు

    * సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ


    జనసేన హామీలు :

    * మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు

    * గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

    * రేషన్‌కి బదులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.2500-రూ.3500 మధ్య నగదు జమ

    * బీసీలకు 5% రిజర్వేషన్ల పెంపు

    * కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు

    * ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు కార్పొరేషన్

    * ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు

    * ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు

    * వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

    * అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు

    * ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పన

    * ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు

    * డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం

    * నదుల అనుసంధానం, కొత్త జలాశయాల నిర్మాణం

    * మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంక్

    * వేటకు వెళ్లని రోజు రూ.500 ఆర్థిక సాయం

    * అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అందరికీ తాగునీరు

    * భూములిచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు

    * ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు

    * ప్రతి మండపానికీ కల్యాణ మండపం నిర్మాణం

    * మహిళలకు పావలా వడ్డీ రుణాలు


    పైన చెప్పినవి కీలకమైన కొన్ని మాత్రమే. ఇంకా చాలా హామీలున్నాయి. మేనిఫెస్టో రిలీజ్ అయితేగానీ మనకు పూర్తిస్థాయి అవగాహన రాదు.


     


    ఇవి కూడా చదవండి -


    టీఆర్ఎస్‌లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే...కారెక్కిన సురేందర్


    ఎన్నికల వేళ కాక రేపుతున్న బదిలీల అంశం... గెలుపెవరిది ఏపీ ప్రభుత్వానిదా, కేంద్ర ఎన్నికల సంఘానిదా


    ఆ సెంటిమెంట్ చంద్రబాబుకి కలిసొస్తుందా... టీడీపీ అధినేత అసలు ప్లాన్ ఇదేనా


    ఏప్రిల్ 2న కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్... ఇవీ కీలక అంశాలు

    First published:

    Tags: Pawan kalyan, Subhash Chandra Bose, Ys jagan

    ఉత్తమ కథలు