Home /News /andhra-pradesh /

WHAT ARE THE BENEFITS FROM KURNOOL AIRPORT WHICH OPENS TODAY

కర్నూలు ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలేంటి? దానివల్ల ఎవరికి ఉపయోగం?

ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వం... తాజాగా కర్నూలు ఎయిర్‌పోర్టుతో మరో అడుగు ముందుకేసింది. రికార్డు స్థాయిలో ఏడాదిన్నర కాలంలో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. మరి దాని ప్రత్యేకతలేంటి? ఇవాళ ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతవరకూ మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామంటున్న ఏపీ సీఎం చంద్రబాబు... అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో... అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 నాటికి విమానయాన రంగంలో భారీగా పెట్టుబడులు తేవాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా... కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో రూ.110 కోట్లతో 1,010 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించారు. దీనికి భారీ కార్గో విమానాల్ని నిర్వహించే సామర్థ్యం కూడా ఉంది. 2 కిలోమీటర్ల రన్‌వేతోపాటూ... విమానాల పార్కింగ్‌కు 4 యాఫ్రాన్‌లు ఉన్నాయి. రాయలసీమ అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ కొంతవరకూ ఉపయోగపడుతుందని భావిస్తోంది ప్రభుత్వం. ఇవాళ ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్ ఏప్రిల్ నుంచీ ప్రయాణికులకు సేవలు అందించనుంది.

రాయలసీమ వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం. విమానాశ్రాయాలను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధికి గమ్యస్థానంగా మారడం ఖాయం. విమానయాన రంగంలో పెట్టుబడులకు 2022 నాటికల్లా ఆంధ్రప్రదేశ్‌ తొలి గమ్యస్థానంగా మారనుంది. ఇందుకోసం పెద్దఎత్తున ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. తద్వారా రాష్ట్రంలో గణనీయమైన ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన, ప్రజలకు ఆదాయం సమకూరనుంది
- ఏపీ సీఎం చంద్రబాబు


ఓర్వక‌ల్లును పారిశ్రామిక హ‌బ్‌గా చేస్తామని చంద్రబాబాబు ఇదివరకే ప్రక‌టించారు. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి 2017 జూన్‌లో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 999.50 ఎకరాల్ని ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అధారిటీకి ఇచ్చింది. రూ.90.5 కోట్లతో 2017 జూన్‌లో పనులు చేపట్టారు. రన్‌వే, యాఫ్రాన్‌, టెర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యేసరికి వ్యయం రూ.110 కోట్లకు చేరింది. ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ వల్ల భవిష్యత్‌లో విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వెళ్లడానికి కర్నూలు వాసులకు ప్రయాణ సమయం తగ్గనుంది. విజయనగరం జిల్లా భోగాపురం, చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ జిల్లా కేంద్రాల్లో హెలీప్యాడ్లను కూడా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:


ఢిల్లీలో చంద్రబాబు చేసేదేంటి? ఈ టూర్ అవసరమా?


ట్రేడ్ యూనియన్ల 48 గం.ల దేశ వ్యాప్త సమ్మె...స్తంభించనున్న జనజీవనం


స్నేహితుడి చెల్లిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ : ప్రాణపాయ స్థితిలో బాధితురాలు

First published:

Tags: Andhra Pradesh, Chandrababu naidu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు