మధ్యాహ్నానికి ఫలితం తెలిసిపోతుంది... ఏపీ ఈసీ ఏం చెప్పారంటే...

AP Assembly Election Results 2019 : మనలాగే వీలైనంత త్వరగా ఫలితాలు చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఏపీ ఈసీ తెలిపారు. పార్టీలూ, నేతలూ సహకరిస్తే, అంతా హ్యాపీగా అయిపోతుందన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 6:33 AM IST
మధ్యాహ్నానికి ఫలితం తెలిసిపోతుంది... ఏపీ ఈసీ ఏం చెప్పారంటే...
ఏపీ ఈసీ ద్వివేదీ(File)
Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 6:33 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠభరితంగా ఉన్నాయి ఈసారి ఎన్నికలు. ఓట్ల లెక్కింపుపై పూర్తి ఏర్పాట్లు చేయించిన ఈసీ గోపాల కృష్ణ ద్వివేదీ కొన్ని ఆసక్తికర మాటలు చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకాగానే ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కపెట్టి... ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తామన్నారు. ఇది మనకు తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆధిక్యంలో ఏయే అభ్యర్థులు ఉన్నదీ తెలిసిపోతుంది కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అర్థమవుతుంది. అదే హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం... సాయంత్రం వరకూ క్లారిటీ రాకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఏపీలో 36 కౌంటింగ్‌ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి ఓ పరిశీలకుడు, పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల అధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని ద్వివేదీ తెలిపారు.

కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అన్ని ఏర్పాట్లపై ఆరా తీశారు ద్వివేదీ. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించేందుకు ఈసీఐ నుంచి ఇద్దరు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారు. వారికి సూచనలు, సలహాలు ఇస్తూ మానిటరింగ్ చేశారు ద్వివేదీ. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించారు. అందర్నీ తనిఖీ చేశాకే, లోపలికి పంపుతున్నారు.

కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి వాహనాలను అనుమతించట్లేదు. చివరి అంచెలో సీపీఎంఎఫ్‌ బలగాల్ని పెట్టారు. ఈ ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించి 25వేల మంది పోలీసు బలగాలను మోహరించారు. అలాగే 35 కంపెనీల సీపీఎంఎఫ్‌ బలగాలు, 10 కంపెనీల బలగాల్ని కేంద్రం పంపింది. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించట్లేదు. బయట ఏర్పాటుచేసే కౌంటర్లలోనే ఫోన్లు ఉంచుకోవాలని సూచించారు. ఆర్వోలు, కౌంటింగ్‌ ఏజెంట్లు, సూపర్‌వైజర్లందరికీ శిక్షణ ఇచ్చారు.

ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఇద్దరు బెల్‌ ఇంజినీర్లు ఉంటున్నారు. ఈవీఎంలలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే వాళ్లు వెంటనే వాటిని రెక్టిఫై చేస్తారు. 3 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు, 28వేల సర్వీస్‌ ఓట్లు జారీచేశామని ద్వివేదీ తెలిపారు. ఇ-సువిధ యాప్‌, ఈసీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడవచ్చన్నారు. ఓట్ల లెక్కింపులో 25వేల మంది సిబ్బందిని వినియోగించినట్లు ద్వివేది వివరించారు.



 

ఇవి కూడా చదవండి :

ఏపీపైనే అందరి చూపు... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు...

ఏపీలో తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి నుంచే... ఎందుకంటే...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల పూర్తి వివరాలు తెలుసా...

 

ఎన్నికల ఫలితాలపై కొన్ని ఆసక్తికర విషయాలు... మీకోసం...

EVMలపై కంప్లైంట్లకు కంట్రోల్ రూం... ఇలా ఫిర్యాదు చెయ్యండి...

లగడపాటి కొత్తగా చెబుతున్నదేంటి... సర్వేపై తాజాగా ఏమన్నారంటే...
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...