హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Government: ఏపీతో ఆస్ట్రేలియా దోస్తీ.. కీలక రంగాల్లో కుదిరిన ఒప్పందాలు.. వివరాలివే..!

AP Government: ఏపీతో ఆస్ట్రేలియా దోస్తీ.. కీలక రంగాల్లో కుదిరిన ఒప్పందాలు.. వివరాలివే..!

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా (Australia) ముందుకు వచ్చింది.

ఇంకా చదవండి ...

    పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా (Australia) ముందుకు వచ్చింది. ఇప్పటికే ఏపీ, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య సోదర రాష్ట్ర ఒప్పందం ఉంది. దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వివిధ అంశాలలో సహకారానికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. వాటిలో మొత్తం 8 అంశాలలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం విశాఖపట్నం రాడిసన్ హోటల్ లో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్ నాథ్ లతో సమావేశమైంది.

    పరిశ్రమలు, నైపుణ్యం, విద్య, శిక్షణ, గనులు, ఖనిజాలు, తయారీ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఏపీ ప్రభుత్వానికి చెందిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వీ.జీ వెంకటరెడ్డి, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, విద్యుత్ శాఖ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వితేజ్ ఇమ్మాడి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఆస్ట్రేలియా ప్రతినిధులకు ప్రజంటేషన్ ఇచ్చారు.

    ఇది చదవండి: ఏపీలో ప్రైవేట్ వ్యక్తులకు వైన్ షాపులు.. ప్రభుత్వం స్పందన ఇదే..!


    సీఎం జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతివైపు పరుగులు పెడుతున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. అపార సహజవనరులు, మౌలిక సదుపాయాలు,పారదర్శక పాలన, పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక వాతావరణం వల్ల ఏపీకి పెట్టుబడులు రానున్నాయన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందం వల్ల కొన్ని కీలక రంగాలలో కలిసి పని చేస్తూ ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు.

    ఇది చదవండి: చంద్రబాబు మా అన్నయ్య.. బంధుత్వంపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు


    ఏపీ ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన 8 ఒప్పందాలు :

    1. ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఏఐసీఎస్) డైరెక్టర్ పర్సెస్ ష్రాఫ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం. అంతర్జాతీయ విద్య, నైపుణ్య సహకారం కోసం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్న పశ్చిమ ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్.

    2. 'ఫ్యూచర్ బ్యాటరీ'తో ఏపీఈడీబీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం. విద్యుత్ కు సంబంధించిన సవాళ్ళను అధిగమించే విధానాలలో పరిశోధనాత్మక తోడ్పాటు.

    3. 'స్పేస్ ఏంజిల్' సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. ఏరో స్పేస్ రంగానికి చెందిన అంతరిక్ష సాంకేతిక అంశంలో పరస్పర సహకారం.

    4. 'విలేజ్ ఎనర్జీ' సంస్థ సీఈవో వేన్ లూబిస్ కాస్ తో ఏపీఈడీబీ ఎంవోయూ. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అవగాహన ఒప్పందం.

    5. 'ఫినిక్స్ అకాడమీ'తో నైపుణ్య, శిక్షణ రంగానికి సంబంధించిన పరస్పర అవగాహన ఒ్పందం. నైపుణ్యం, ఒకేషనల్ ట్రైనింగ్ కి సంబంధించిన సహకారం దిశగా అంగీకారం.

    6. పశ్చిమ ఆస్ట్రేలియాలోని విద్యుత్ రంగానికి సంబంధించిన 'ఆస్ట్రేలియన్ ఎనర్జీ స్టోరేజ్' కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీ ఎండీ పీయూష్ మాధుర్, ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్ సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

    7. 'హెల్త్ ఇంటిగ్రా ప్రైవేట్ లిమిటెడ్' అనే వైద్య పరికరాల తయారీ సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. అత్యాధునిక పరికరాలకు సంబంధించిన సాంకేతికత పలు కీలక అంశాలలో పరస్పర అవగాహనతో కలిసి పనిచేయడానికి అంగీకారం.

    8. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన 'ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ' (సీసీఐడబ్ల్యూఏ) వాణిజ్య పెట్టుబడుల హెడ్ మైకేల్ కార్టర్ తో ఏపీఈడీబీ ఒప్పందం. మత్స్య రంగానికి సంబంధించిన అంశాలలో కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Australia, Investments

    ఉత్తమ కథలు