AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andrha Pradesh) లో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.. అభ్యర్థులు తమ నియోజక వర్గాలపై ఫోకస్ చేస్తున్నారు. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు అందరి చూపూ వైసీపీ రెబల్ ఎంపీ (YSR Rebal MP) రఘురామకృష్ణంరాజు (Raghu Ramkrishna Raju) పై పడింది.. ఎందుకంటే.. ఇటీవల సీఎం జగన్ నరసాపురంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అక్కడితోనే ఆగలేదు.. రాజకీయ విమర్శల్లోనూ దాడి పెంచారు. ముఖ్యంగా టీడీపీ - జనసేనలపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. దీంతో జగన్ పర్యటన సందర్భంగా నరసాపురం పార్లమెంట్ విషయం హైలైట్ అయింది. అయితే ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఉన్న రఘురామ.. ప్రభుత్వానికి కంట్లో నలక మారారు. దీంతో ఆయన మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లోవైసీపీ నుంచి గెలిచి.. కొన్ని నెలలకే వైసీపీ పై తీవ్ర విమర్శలతో దాడి పెంచారు. ప్రతిపక్షాల కంటే రఘు రామ చేసే విమర్శలే అధికార పార్టీని తీవ్ర ఇబ్బందులు పెట్టాయి.
అందుకు ధీటుగా వైసీపీ నేతలు రఘురామపై అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించారు. దీంతో ఆయన నియోజకవర్గానికి రావడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన స్ట్రాటజీ ఏంటీ..? మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా..? చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారు.. ఆయన ప్రత్యర్థిగా ఎవరు ఉంటారు.. లాంటి అంశాలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ అధినేత జగన్ నుంచి పార్టీ నేతలంతా పోకస్ చేస్తూనే ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్లో వైసీపీ తరుపున బలమైన అభ్యర్ధి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుని నరసాపురం పార్లమెంట్ బరిలో నిలపాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దాదాపు రంగరాజే అభ్యర్ధిగా ఉంటారని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి : కాంతారాను దింపేసిన తహసీల్దార్.. అద్భుత నృత్యానికి అధికారులు ఫిదా.. వీడియో చూడండి
ఇటు రఘురామ కూడా.. వైసీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని.. తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని, ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దిగి వైసీపీకి చెక్ పెడతానని ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా కలిసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బీజేపీ నిర్ణయం ఏదైనా..? టీడీపీ-జనసేన పొత్తు తప్పనిసరిగా ఉంటుందని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలు కలిస్తే నరసాపురంలో వైసీపీని ఈజీగా ఓడించవచ్చు అనేది రఘురామ ప్లాన్ అని తెలుస్తోంది.
అయితే రఘు రామరాజు ప్లాన్ ఎంత వరకు కరెక్ట్ అవుతుందో చూడాలి.. ఎందుకంటే జనసేన-టీడీపీ పొత్తుపై రోజు రోజుకూ నీలి నీడలు కమ్ముకున్నాయి. మొన్నటి వరకు పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ప్రధాని మోదీ విశాఖ పర్యటన తరువాత ఆ ప్రచారానికి బ్రేక్ పడింది.. పవన్ కళ్యాణ్ స్వరంలోనూ మార్పు కనిపిస్తోంది. అప్పటి వరకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి అంటూ మాట్లాడిన జనసేనాని.. ఇప్పుడు మాత్రం ఒక్క ఛాన్స్ ఇవ్వడండి అంటూ చెప్పడంతో పొత్తులపై గందరగోళం ఏర్పడింది. ఇటు చంద్రబాబు సైతం కర్నూలు పర్యటనలో అలాంటి వ్యాఖ్యలే చేశారు. వస్తే రానీయండి.. పోతే పోనీయండి.. మనం అన్ని స్థానాలో సిద్ధంగా ఉన్నమని తమ్ముళ్లకు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Raghu Rama Krishnam Raju