హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Eluru News: 'నా అన్నకి జరిగింది ఎవరికీ జరక్కూడదు..' స్ఫూర్తినిస్తున్న తమ్ముడి పోరాటం..

Eluru News: 'నా అన్నకి జరిగింది ఎవరికీ జరక్కూడదు..' స్ఫూర్తినిస్తున్న తమ్ముడి పోరాటం..

మురళీకృష్ణ (ఫైల్)

మురళీకృష్ణ (ఫైల్)

Eluru District: జనం సమస్య అంటే పెద్దగా ఎవరికీ పట్టదు. ఊళ్లో వాళ్లకు లేని గొడవ మనకెందుకులే అని భావించే రోజులు ఇవి. మన పనైతేచాలు మిగిలినవి మనకి అనవసరం అనుకే మనుషులే ఎక్కువ. కానీ ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నం. తన కుటుంబానికి జరిగిన నష్టం మరో కుటుంబానికి జరగకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  జనం సమస్య అంటే పెద్దగా ఎవరికీ పట్టదు. ఊళ్లో వాళ్లకు లేని గొడవ మనకెందుకులే అని భావించే రోజులు ఇవి. మన పనైతేచాలు మిగిలినవి మనకి అనవసరం అనుకే మనుషులే ఎక్కువ. కానీ ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నం. తన కుటుంబానికి జరిగిన నష్టం మరో కుటుంబానికి జరగకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఎంతమంది నిరుత్సాహపరిచినా.. తన ఊరి సమస్య కోసం పట్టువదలని విక్రమార్కుడిలో పోరాడుతున్నాడు. అది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లా (Eluru District) టీ.నర్సాపురం మండలం బొర్రంపాలెం పొలం లోపనులు చేసుంటున్నాడు ఎల్లారావు. ఇంతలో కాలుపై ఎదో కుట్టినట్లుగా ఉంది. చూసుకుంటే పాము కాటు వేసింది. ఇంకేముంది ఎల్లారావు తమ్ముడు మురళీకృష్ణ తన అన్నకు ప్రధమ చికిత్స చేసి మెగురైన చికిత్స కోసం ఆటోలో జంగారెడ్డి గూడెంలోని పెద్దాస్పత్రికి బయలుదేరాడు.

  కానీ మార్గమధ్యలోనే ఎల్లారావు..., తమ్ముడు మురళీకృష్ణ చేతిలో ప్రాణం విడిచాడు. తన చేతిలో ప్రాణం వదిలిన అన్న పార్థివ దేహం తో గ్రామం చేరుకున్న మురళి కృష్ణ అప్పటి నుంచి ఒక నిర్ణయానికి వచ్చాడు. తమ గ్రామంలో ఆస్పత్రి లేకపోవడంతో అన్న మరణించాడని బావించి అప్పటినుంచి ఊళ్లో వైద్యశాళ కోసం అధికారుల, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆస్పత్రి కోసం ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఐతే ఓ రోజు అతడి కల ఫలించినట్లే ఫలించి మళ్లీ మొదటికొచ్చింది.

  Young man fighting to bring Hospital to his Village for many years in Eluru District of Andhra Pradesh full details here
  స్పందనలో మురళీకృష్ణ ఇచ్చిన దరఖాస్తు

  ఇది చదవండి: ఏపీలో మంకీపాక్స్ పై కీలక అప్ డేట్.., గుంటూరు బాలుడి రిపోర్ట్స్ లో ఎముందంటే..!


  ఏడాదిన్నర క్రితం ఆస్పత్రిని కేటాయించిన ప్రభుత్వం.. భూమిపూజ కోసం ఓ స్థలాన్ని ఎంపిక చేసి గుంతలు కూడా తీసింది. కానీ అది పట్టాలెక్కలేదు. దీంతో తమ గ్రామ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ గా పనిచేసే మురళీ కృష్ణ.. తన ద్విచక్రవాహనానికి వెనుక భాగంలో తమ ఊళ్లో ఆస్పత్రికి నిర్మాణానికి నిధులు మజూరు కాలేదని.. స్థానిక ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జెడ్పీటిసి సూరిబాబు చొరవ తీసుకొని ఆస్పత్రిని పూర్తి చేయాలనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని తిరుగుతున్నాడు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వ్చచిన ఎమ్మెల్యే బాలరాజుకు కూడా ఇదే విషయమై వినతి పత్రం అందజేశాడు.

  ఇది చదవండి: మొన్నటివరకు వానలు.. ఇప్పుడేమో ఎండలు.. ఏపీలో వింత వాతావరణం.. కారణం ఇదే..!


  అయినా తమ ఊరి ఆస్పత్రికి నిధులు మంజూరు కాకపోవడంతో సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ కు వెళ్లి స్పందన కార్యక్రమంలో తన సమస్యను వివరించాడు మురళి. మురళీ ఇచ్చిన దఖాస్తును తీసుకున్న కలెక్టర్ సమస్య పరిష్కారంపై హామీ ఇచ్చారు. మరి మురళీ ఆశయం గెలుస్తుందో..! లేక నాయకులు, అధికారుల నిర్లక్ష్యం ముందు ఓడిపోతుందో..! వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Eluru

  ఉత్తమ కథలు