హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: రెబల్ ఎంపీ.. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ప్లేస్ ఫిక్స్ అయ్యిందా?

RRR: రెబల్ ఎంపీ.. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ప్లేస్ ఫిక్స్ అయ్యిందా?

రెబల్ ఎంపీ రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?

రెబల్ ఎంపీ రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?

RRR: అధికార పార్టీకి తలనొప్పిగా మారిన రెబల్ ఎంపీ రఘురామ రూటు మార్చారా..? ఈ సారీ ఎంపీ పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారా..? మరి ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..?

  • News18 Telugu
  • Last Updated :
  • West Godavari, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు  ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. గెలుపు వ్యూహాలతో బిజీ అయ్యాయి. అలాగే ఎమ్మెల్యే, ఎంపీలు, ఆశావాహలు మరోసారి టికెట్ల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొందరు పార్టీ మారే ప్రయాత్నాలు చేస్తుంటే.. మరికొందరు మరోసారి అదే సీటు కోసం అధిష్టానాన్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. మరికొందరు.. ఎంపీలు అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ఎమ్మెల్యేలు అయితే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే  ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ (YCP Rebal MP) రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishnam Raju) విషయంలో ఓ చర్చ జోరుగా జరుగుతోంది.

వైసీపీ  రెబల్ ఎంపీ ఈ సరి ఎన్నికల్లో  తన సత్తా చూపి.. వైసీపీ పెద్దలు, పార్టీ నేతలపై తన పగ తీర్చుకుని తీరుతానని సన్నిహితులతో చెబుతున్నారంట.  అలాగే కొడుకును ఎంపీగా రాజకీయ అరంగ్రేటం చేయిస్తారనే ప్రచారం కూడా ఉంది.

ప్రస్తుతం రఘురామ కృష్ణం  నరసాపురం లోక్ సభ సభ్యుడిగా వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తరువాత పరిణామాలలో వైసీపీ లో రెబల్  గా మారి జగన్ &కో ని ముప్పతిప్పలు పెడుతున్నారు. దీంతో ఆగ్రహించిన అధికారపార్టీ ఆయన పై అనేక కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి : మంత్రి క్రేజ్ మామూలుగా లేదుగా.. సినిమా రిలీజ్ ఈవెంట్ లా బర్త్ డే వేడుకలు..?

అయితే కేంద్ర పెద్దల అండదండలతో ఎలాగోలా నెట్టుకొస్తున్న రఘురామ కృష్ణం రాజు పై కేసులు పేట్టి  కక్ష సాధింపు చర్యలకు దిగిందనేది.. రఘురామ వాదన..  పైగా సి.బి.ఐ విచారణ పేరుతో పోలీసులు తన పై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ ఆయన కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆయన కు బెయిల్ మంజూరు చేసి పోలీసులకు చీవాట్లు పెట్టింది.

ఇదీ చదవండి : పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. వారసత్వంగా ఎదగలేదు..? పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరా

అప్పటి నుండి కేసుల భయంతో తన సొంత నియోజకవర్గం నరసాపురం లో అడుగు పెట్టని రఘురామ కృష్ణం రాజు ఢిల్లీ నుండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదంటున్నాయి వైసీపీ వర్గాలు.  అయితే  సంక్రాంతి సందర్భంగా భారీ కటౌట్లతో నరసాపురంలో హంగామా సృష్టించారు రఘురామ ఆయన వర్గీయులు.

ఇదీ చదవండి: పొత్తులపై క్లారిటీ అప్పుడే.. పవన్ వారాహి యాత్రపై నాగబాబు కామెంట్స్

రానున్న ఎన్నికలలో నరసాపురం నుండి గాని ఆ పార్లమెంటులో ఏదో ఒక నియోజకవర్గం నుండి ఆయన శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారంటున్నారు అనుయాయులు . అలాగే నరసాపురం పార్లమెంట్  స్థానం నుండి తన కుమారుడు భరత్ ను రాజకీయ అరంగ్రేటం చేయించే ఆలోచన కూడా ఉందంటున్నారు రఘురామ కృష్ణంరాజు అభిమానులు.

ఇదీ చదవండి : మొన్నటి వరకు అసమ్మతితో ఉన్న ఆ నేతకు అధినేత బంపర్ ఆఫర్ ఇచ్చారా..? ఆ ఆఫర్ ఏంటంటే..?

తెలుగు దేశం లేదా జనసేన పార్టీలలో ఏదో ఒక పార్టీ నుండి  పోటీ చేయవచ్చు అంటున్నారు ఆయన అనుచరులు చెబుతున్నారు. అధికారం లోకి వస్తే రాష్ట్ర మంత్రి వర్గంలో బలమైన పోర్ట్ ఫోలియోతో మంత్రి పదవి దక్కించుకుని తనని ఇబ్బందులకు గురిచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. మరి ఆయనకు జనసేన, టీడీపీలు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తాయో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Raghuramakrishnam raju

ఉత్తమ కథలు