MLA Turned Paper Boy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. మాస్ ఇమేజ్ ఉన్నవారు కొందరే ఉంటారు. ప్రత్యర్థి పార్టీ హవాలోనూ గెలుపొందే సత్తా ఉంటుంది. కొంతమంది ఎమ్మెల్యేగా మారిన తరువాత.. సొంత వ్యవహారాలు చూసుకుంటూ.. ఓట్లు వేసే ప్రజలకు దూరంగా ఉంటారు.. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నం.. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) పాలకొల్లు (Palakollu) శాసనసభసభ్యుడు నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu). గత ఎన్నికల్లో వైసీపీ (YCP) సునామిని తట్టుకుని నిలబడగలిగారు. అయితే టీడీపీ (TDP) అధికారంలోకి రాలేకపోయినా.. ఆయన మాత్రం.. మరికొందరు ఎమ్మెల్యేల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండలేదు. అధిష్టానం పిలుపు ఇచ్చే ప్రతి కార్యక్రమానికి హాజరవుతూనే ఉన్నారు. అంతేకాదు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ.. వినూత్న నిరసనలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. అందుకే ఆయన మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు. వచ్చే ఎన్నికల కోసం అధికార వైసీపీ ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ చేసింది. అందులో పాలకొల్లు కూడా ఒకటి.. అందుకే కారణం అక్కడ రామనాయుడు ఉన్న క్రేజే.. అధికార పార్టీ బెదిరింపులు.. ఒత్తిళ్లకు లొంగకుండా జనంలోనే ఉంటున్న రామానాయుడు.. తాజాగా పేపర్ బాయ్ అవతారం ఎత్తారు ఎందుకో తెలుసా..?
ఏదో సరదగా పేపర్ బాయ్ గెటప్ వేసుకోవడం కాదు.. తెల్లవారు జామునే లేచి.. ఇతర పేపర్ బాయ్స్ లా.. సైకిల్ తొక్కుకొంటూ ఇంటింటికీ వెళ్తున్నారు. పేపర్లు అందిస్తున్నారు. ఎమ్మెల్యే అయ్యి ఉండి.. ఇలా పేపర్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని డౌట్ పడుతున్నారు. ఆయన ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది అంటున్నారు రామానాయుడు..
MLA Turned A Paper Boy || Nimmala Ramanaidu distribute paper door to doo... https://t.co/URA4QYUkYZ via @YouTube #TDPTwitter #TDP #tdpaaravos #TDPYCPBrothers #TDPspoilers #YCPDestroyedAP #YSRCP #JaganannaAmmaVodi @TDPoliticalWING @JaiTDP
— nagesh paina (@PainaNagesh) August 1, 2022
పేపర్ బాయ్ గా వినూత్న అవతారం ఎత్తి.. ఇంటింటికీ పేపర్లు వేసుకుంటూ నిరసనకు దిగారు ఆయన. నిరసన ఎందుకంటే..? టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నిస్తూ ఇలా నిరసన తెలుపుతున్నారు. అర్హులకు వెంటనే లబ్ధి కలిగించాలని డిమాండ్ చేస్తూ పేపర్ బాయ్ లా మారారు. ఆదివారం తెల్లవారుజామున పట్టణంలోని మావూళ్లమ్మపేటకు చేరుకున్న ఎమ్మెల్యే స్థానిక పేపర్ బాయ్స్‌తో కలిసి సైకిల్ పై ఇంటింటికీ వెళ్లి చందాదారులకు పేపర్లు పంపిణీ చేశారు.
31వ వార్డులోని నాగరాజుపేట సహా పలు ప్రాంతాల్లో పేపర్ వేశారు. దినపత్రిక తీసుకునేందుకు వచ్చిన వారికి.. టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో టిడ్కో ఇళ్లు కేటాయించడాన్ని ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా పేపర్లు వేసుకుంటూ చందాదారులను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి తెలియజేయాలని ఆయన భావిస్తున్నారు. దీంతో పాటు.. నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసన తెలుపుతాను అంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండి.. ప్రభుత్వ వ్యతిరేక విధానలపై పోరాడాలని నిర్ణయించారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, News papers, TDP