TDP అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్ (Cm Jagan) విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్ మండిపడ్డారు. గతంలో పాలనను చూసిన ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబు (Chandrababu Naidu) కు, దత్తపుత్రుడికి ప్రజలు బై బై చెప్పారని ఎద్దేవా చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగన్ (Cm Jagan) అక్కడి బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో గెలవలేనన్న భయం, నిరాశ చంద్రబాబుకు ఉందని, ప్రతి మాటలోనూ, చేష్టలోను భయం కనిపిస్తుందన్నారు.
సెటైర్ల వర్షం..
ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి దూకుతామని బెదిరించేవాళ్ళు, పురుగుల మందు తాగుతామనే వాళ్ళు, రైలు కింద తల పెడతామనే వాళ్లు గుర్తుకొస్తున్నారు. అధికార భగ్న ప్రేమికుడు ఇదే రీతిలో రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఏ మంచి పని చేయని వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పరు. ఇలాంటి వారికి ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. కేవలం వాళ్లకే సంబంధించిన నాలుగు పేపర్లు, నాలుగు చానెళ్లతో కలిసి దాచుకో. పంచుకో..తినుకో అని ఒప్పందం చేసుకుంటారని జగన్ (Cm Jagan) సెటైర్లు వేశారు.
ఏపీలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైసీపీకి బ్రహ్మరథం పట్టారని జగన్ (Cm Jagan) గుర్తు చేశారు. కుప్పంలో మున్సిపల్, జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల్లోను టీడీపీని చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. దీనితో మరోసారి బాయ్ బాయ్ బాబు అని చెప్పారన్నారు. చంద్రబాబు, ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారని విమర్శించారు.
1995లో కూడా ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురైన సమయంలో ఇదేం ఖర్మరా బాబూ అనుకోని ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు మన రాజకీయాల్లో ఉండడం ఇదేం ఖర్మరా బాబూ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. నేడు నరసాపురంలో 3,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసారు సీఎం జగన్ .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Cm jagan, Pawankalyan, TDP, Ycp