Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
తల్లిదండ్రులే పిల్లలకి మొదటి గురువులు. తల్లిదండ్రులే వారిని మంచి మార్గంలో నడిపిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తనపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్లే వారికి అన్ని విషయాల్లోనూ ఆదర్శం. కానీ అలాంటి స్థానంలో ఉన్నవారు దారితప్పితే.. ఆ తప్పులు పిల్లలకు అర్ధమైతే.. అస్సలు తట్టుకోలేరు. ముఖ్యంగా తల్లి విషయంలో పిల్లలు పక్కాగా ఉంటారు. తప్పుచేసిందని తెలిసినా నమ్మరుగాక నమ్మరు. కానీ ఓ కొడుకు.. తన తల్లిని చూడకూడని పరిస్థితుల్లో చూశాడు. తట్టుకోలేకపోయాడు. చివరకు కఠిన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లా (Eluru District) భీమడోలుకు చెందిన దాసరి వెంకట్ తాపీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు.
తాపీ పనులకు వెళ్తూనే తల్లిని పోషించుకుంటున్నాడు. ఐతే తన తల్లి కొన్నేళ్ల నుంచి మరో వ్యక్తితే వివాహేతర సంబంధం పెట్టుకుంది. తల్లి చేస్తున్న ఘనకార్యం వెంకట్ కు తెలిసింది. ఐతే పద్ధతి మార్చుకోవాలని.. ఇలాంటి పనులు చేయవద్దని చాలాసార్లు తల్లికి నచ్చజెప్పాడు వెంకట్. కానీ తల్లి అస్సలు పద్దతి మార్చుకోలేదు. ఐతే ఇటీవల ఓ రోజు వెంకట్ తాపీ పనికి వెళ్లగా.. తల్లి ఆమె ప్రియుడ్ని పిలిపించుకుంది. ఇంతలో వెంకట్ భోజనానికి ఇంటికొచ్చాడు. తల్లిని చూడకూడని స్థితిలో చూశాడు. కోపంతో ఊగిపోయి తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
పదేపదే తల్లి చేసిన పని గుర్తుకొచ్చి బాగా మద్యం తాగి రాత్రికి ఇంటికొచ్చి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేదనతో తల్లి చీరతోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం పని నుంచి వచ్చేసిన వెంకట్ ఇంకా తిరిగిరాకపోవడంతో అతడి స్నేహితుడు ఆనంద్.. వచ్చి చూడగా.. గదికి తలుపువేసి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు.
గతంలో గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. తండ్రి లేకపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడో యువకుడు. ఐతే తల్లి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తల్లికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఓ రోజు పని నుంచి ఇంటికొస్తుండగా.. తల్లి.. మరో వ్యక్తితో ఏకాంతంగా గడుపుతూ కనిపించింది. దీంతో ఇద్దరిపైనా దాడి చేశాడు. మరో వ్యక్తి పారిపోగా.. తల్లిని హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొగిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Eluru, Extramarital affairs