Frustration: ఫ్రస్టేషన్ అనేది చాలా కామన్.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో వస్తుంది.. అనుకున్న పని అవ్వకపోయినా.. ఎవరైనా విసిగించినా..? దక్కింది అనుకున్నది చేజారిపోయినా..? ఇలా సందర్భం ఏదైనా ఫ్రస్టేషన్ రావడం చాలా కామన్. అయితే ఆ కోపాన్ని కొందరు ఏదో రూపంలో బయటకు చూపిస్తుంటారు. కొందరు వస్తువులపై చూపిస్తే.. మరికొందరు మనుషులపై చూపిస్తారు. కొందరైతే వారిపై వారే ఆవేశాన్ని ప్రదర్శించి.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఫ్రస్టేషన్ కారణంగా ఓ యువకుడు చేసిన పని.. చూసి అంతా షాక్ అయ్యారు.. ఇదేం ఫ్రస్టేషన్ రా బాబు అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) ఆచంట మండలం (Achanta Mandal) .. ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు (Undala Rambabu) అనే యువకుడు ఫ్రస్టేషన్ తో చేసిన పని.. ఇప్పుడు కలకలం రేపింది.. ఆర్టీసీ బస్సు (RTC Bus) లో ప్రయాణిస్తున్న రాంబాబు.. ఓ ఉన్మాదిలా ప్రవర్తించాడు.
తోటి ప్రయాణికులపై కారం చల్లి తీవ్ర గందరగోళం సృష్టించాడు. ఒక్కసారిగా అతడు ప్రవర్తించిన తీరు చూసి.. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కారం ఘాటుకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. బస్సులో అసలు ఏం జరుగుతుందో తెలియక తికమకపడ్డారు. ప్రయాణికుల ఫిర్యాదుతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి : దేనికీ గర్జనలు.. ప్రశ్నలతో హోరెత్తెంచిన పవన్.. మియాం మియాం అంటూ కౌంటర్
పోలీసులు, ప్రయాణికులు కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాడు. కానీ అక్కడ విచారణ సమయంలో.. పాస్పోర్టు, వీసా వివరాలు సరిగా లేకపోవడంతో ఎయిర్పోర్టు అధికారులు అతన్ని వెనక్కి పంపారు. ఇక చేసేది లేక.. తిరుగు ప్రయాణంలో అతను హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు.
ఇదీ చదవండి : ఏపీలో విద్యార్థులకు మరో శుభవార్త.. ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయం
చాలాసేపు సైలెంట్ గా ఉన్న ఆ వ్యక్తి.. పాలకొల్లు పట్టణం సమీపంలోకి బస్సు రాగానే ఉన్మాదిలా మారిపోయాడు. గల్ఫ్ వెళ్ళడానికి తనతో పాటు తెచ్చుకున్న 2కేజీలు కారం బ్యాగ్లో ఉండటంతో.. ఆ ఫ్రస్టేషన్ లో.. 18మంది ప్రయాణికులపై చల్లాడు. చిన్న పిల్లలని కూడా వదలలేదు.. అందరిపై కారం చల్లాడు. దీంతో వారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.తారువాత అతడ్ని బంధించి పోలీసులకు అప్పచెప్పే ప్రయత్నం చేశారు.. కానీ ఇదే సమయంలో రాంబాబు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రయాణికులు పట్టుకొని పాలకొల్లు బస్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: బంజరు భూముల్లో ఎర్ర బంగారం సాగు.. ఒక్కో మొక్క విలువ కోటి రూపాయలు.. ఎందుకంటే?
విచారణలో అతడి ఫ్రస్టేషన్ వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పాస్పోర్టు సరిగాలేదని వెనక్కి పంపారని తీవ్ర నిరాశకు గురైన రాంబాబు ప్రయాణికులపై కారం చల్లాడని నిర్ధారించారు. అతడ్ని అరెస్ట్ చేసి.. కోర్టుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Apsrtc, West Godavari