locusts attack: చేతికి వచ్చిన పంట నష్ట పోతే ఏ రైతూ తట్టుకోలేదు. ఆరుగాలం పండించిన పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. భారీ వరధలు.. కుండ పోత వనలు పడకూడదని కోరుకుంటారు.. జంతువుల దాడి చేయకుండా నిత్యం కాపలా కాస్తుంటాడు.. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పుడు అక్కడి రైతన్నలకు పంటను కాపాడుకోవడం కష్టమవుతోంది. అందుకు కారణం ఏంటో తెలుసా.. మిడతలు.. మిడతలు పంటలు నాశనం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? భారీవర్షాలు, వరదలకో లేక ఇంకేదైనా కారణమో తెలియదు గాని అడవుల్లో ఉండాల్సిన ప్రాణులు జనావాసాలకు చేరుకుంటున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా (kakinada district) లో మిడతల దండు దాడులు చేస్తే.. ఏలూరు జిల్లా(eluru district)లో భారీ తాచుపాము హల్‌చల్ చేసింది. ఇక కృష్ణా నది తీరం నారాయణపేట జిల్లాలో కనిపించిన భారీ మొసలి స్థానికులను కలవరపెట్టింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో మిడతల దండు దాడి చేసింది. ఎలా అడవుల్లో ఉండాల్సినవన్నీ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. రైతన్నలకు, కూలీలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి..
పిఠాపురంలో ముందు ఒక్కొక్కటిగా మొదలైన మిడతలు.. తరువాత పదుల సంఖ్యలో.. ఇప్పుడు వందలాదిగా దాడి చేస్తున్నాయి. ఉప్పాడ రైల్వేగేట్ దగ్గర పూలమొక్కలు, కూరగాయల సాగుపై దాడులకు దిగుతున్నాయి. పచ్చని మొక్కలపై వాలి క్షణాల్లో పచ్చని చెట్టును మోడు చేసేస్తున్నాయి. మిడతలను వదిలించుకోవడానికి రైతులు నానాకష్టాలు పడుతున్నా.. వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.
locusts attack || బాబోయ్ మిడతలు || పంట పొలాలను నాశనం చేస్తున్న మిడతల దండ... https://t.co/H90hQbMM7V via @YouTube #LOCUS #Locuschain #Farmers #FarmersProtest #AndhraPradesh #andhranativesweet
— nagesh paina (@PainaNagesh) August 19, 2022
ఒకటి రెండు రోజులు కాదు.. గతవారం రోజులుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు పూలమొక్కలు, కూరగాయలకే పరిమితమైన మిడతలు.. పంటలపైనా పడుతుండడం ఆందోళన పెంచుతోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం కనిపించిన మిడతలు.. మళ్లీ రావడంతో ఆందోళన చెందుతున్నారు. మిడతల బెడద నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.
మరోవైపు ఏలూరు జిల్లాలో తాచుపాము కలకలంరేపింది. ఉంగుటూరు మండలం నారాయణపురం ఉన్నతపాఠశాలలో పామును గుర్తించిన సిబ్బంది, విద్యార్థులు భయంతో వణికిపోయారు. స్టోర్‌రూమ్‌లో ఆరడుగుల పామును చూసి బెంబేలెత్తిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ క్రాంతి.. ఆరడుగుల భారీ తాచుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ సమయంలో పామునోటి నుంచి ఏకంకా మూడు పిల్లిపిల్లలు బయటకు రావడంతో అవాక్కయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Farmers, Kakinada, West Godavari