హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Eluru: తోటలో బయటపడ్డ మట్టికుండ.. తెరిచి చూస్తే అద్భుతం

Eluru: తోటలో బయటపడ్డ మట్టికుండ.. తెరిచి చూస్తే అద్భుతం

తోటలో లభ్యమైన పురాతన బంగారు నాణేలు

తోటలో లభ్యమైన పురాతన బంగారు నాణేలు

Eluru: ఈ కాలంలో గుప్తనిధులంటూ తిరిగే బ్యాచ్ లు చాలానే ఉన్నాయి. అడవుల్లో, పురాతన ఆలయాల్లో తవ్వకాలు జరుపడం, పూజలు చేయడం చేస్తుంటారు. అలా కాకుండా ఓ రైతుకు తన సొంత తోటలోనే అద్భుతమైన నిధి లభ్యమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Eluru | West Godavari | Andhra Pradesh

ఈ కాలంలో గుప్తనిధులంటూ తిరిగే బ్యాచ్ లు చాలానే ఉన్నాయి. అడవుల్లో, పురాతన ఆలయాల్లో తవ్వకాలు జరుపడం, పూజలు చేయడం చేస్తుంటారు. అలా కాకుండా ఓ రైతుకు తన సొంత తోటలోనే అద్భుతమైన నిధి లభ్యమైంది. తవ్వకాల్లో బయటపడ్డ మట్టికుండను తెరిచి చూస్తే అద్భుతమే జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లా (Eluru District) కొయ్యలగూడెం మండలం ఏడువాడల పాలెంలో ఓ రైతన్న దశ తిరిగిపోయింది. ఎన్నో ఏళ్లు వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నకు నేలతల్లి వరాలు కురిపించింది. తను పడిన కష్టానికి పుడమి తల్లి చలించిపోయి. ఇలా చేసిందేమోనని ఆ గ్రామాస్తుల అంతా కోడై కూస్తున్నారు.

ప్రతి నోట ఆ రైతన్న మాటే అబ్బ.. అబ్బ ఎంత అదృష్టం చేసుకున్నాడో అనిఅందరు అంటుంటే ఆయనకు నోట నుంచి మాట రాలేదంటే ఒట్టు. ఇంటిల్లా పాది బంధువులు ఒక్కటే హడావుడి చేసేస్తున్నారు అనుకోండి అయ్యా బాబు అసలు ఏమి జరిగింది.. అనే కదా మీ అనుమానం అయితే ఈ స్టోరీ చదవేయండి.

ఇది చదవండి: బెజవాడలో బెస్ట్ స్వీట్స్ దొరికేది ఇక్కడే..! ధర కూడా తక్కువే..!

నవంబర్ 29న మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్ పాం ఆ తోటలో పైప్లైన్ పనులు జరుగుతున్నాయి. అలా పనులు జరుగుతుండగా తవ్వే పనుల్లో నిమగ్నమైన అక్కడి వారికి పలుగుకి ఓ మట్టిపిడత లాంటింది తగిలింది..దీంతో ఏమిటదని పరిశీలిస్తే వామ్మో చూడగానే ఆశ్చర్యపోయారు. దాని నిండ బంగారు నాణేలున్నాయి.

ఇది చదవండి: విజయవాడలో ఈ ప్లేస్ చాలా ఫేమస్.. ఆసియాలోనే అతిపెద్దది.. మీరూ ఓ లుక్కేయండి..!

అది చూసిన వారికి నోట మాటరాలేదు.వెంటేనే తేజస్వీ ఓ వైపు సంతోషంతో.., మరో వైపు టెన్షన్తో విషయాన్ని భర్త సత్యనారాయణకి చెప్పింది. ఆయన కూడా చాలా సంతోషించాడు. వామ్మో బంగారు నాణేలున్న మట్టిపిడతనే అని గంతులు వేయసాగాడు. ఎందుకైనా మంచిదని ఆయన అధికారులకు తెలియచేశారు. లేకుంటే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని..!

వెంటేనే విషయాన్ని తెలుసుకున్న స్థానిక తహాసీల్దార్ పి. నాగమణి వచ్చి నాణేలతో ఉన్న మట్టి పిడతను పరిశీలించారు. ఇందులోని ఒక్కో నాణం సూమరు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నట్టు నిర్ధారించారు. పైగా ఇది రెండు శతాబ్దాల క్రితం వాటివిగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందరు తేజస్వి కుటుంబం మారిపోయింది అనుకుంటున్నారు..మరి బంగారు నాణెలున్న మట్టి పిడితను వీరికే ఇస్తారో ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. మీ తోటల్లో కూడా బంగారు మట్టి పిడతలున్నాయో ఓ సారి చెక్ చేసుకోండి. ఏమో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా..!

First published:

Tags: Andhra Pradesh, Eluru, Local News, West Godavari