హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

What an Idea: వరద నీటినీ వదలరా..? మరీ ఇలా ఉన్నారేంట్రా.. వారు చేసిన పని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..? వీడియో

What an Idea: వరద నీటినీ వదలరా..? మరీ ఇలా ఉన్నారేంట్రా.. వారు చేసిన పని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..? వీడియో

వరద నీటినీ వదలరా?

వరద నీటినీ వదలరా?

What an Idea: కొందరికి ఐడియాలో ఇట్టే వస్తాయి.. కొన్ని ఐడియాలు అదుర్స్ అనిపిస్తే.. కొన్ని నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని వైరల్ అవుతాయి.. తాజాగా కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.. ఓరేయ్యా ఏందిరిదీ అనిపించేలా చేస్తోంది.

ఇంకా చదవండి ...

  What an Idea:ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. మరికొన్ని రోజులు వర్షాలు దంచికొట్టేలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర మధ్య ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో (kosta Districts) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశముంది. ముఖ్యంగా విజయనగరం (Vizianagaram), శ్రీకాకుకుళం (Srikakulam), పార్వతీపురం మన్యం (Parvatipuram Manyam), విశాఖ (Visakha), అల్లూరి  జిల్లా (Alluri District) ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అయితే వందేళ్ల తరువాత ఈ స్థాయిలో గోదావరి పోటెత్తుతోంది. అది కూడా జులైలోనే.. వర్షాకాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ముందు ముందు మరింత భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం వరుణుడు ధాటికి రెండు రాష్ట్రాలు గజ గజ వణుకతున్నాయి. కుండపోత వానలతో రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంత ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా

  ఓ వైపు ఇలా వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇవేవీ తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు కొందరు యువకులు. వరదలొస్తే తమ పని తమదే అంటూన్నారు. ఆ వరద నీటిని వదలడం లేదు. కొందరేమో చేపలు పట్టుకుని ఆ ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే కాజ్‌వేలపై నిలిచిన వరదనీటితో బైక్‌లను వాష్‌ చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు..పదుల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఈ విజువల్స్‌ చూడండి..


  అక్కడ ఉన్న బైక్ లను చూస్తే.. వాహనాలను పార్కింగ్‌ చేసినట్టు కనిపిస్తోంది. ఇలా బైక్ లను వాష్ చేయడానికి.. లంక ప్రాంతాల నుంచి పడవలపై వాటిని ఒడ్డుకు చేర్చి మరీ వరదనీటిలో బైకులను కడుగుతున్నారు. ఓ వైపు భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే.. వరదనీటిలో ఇలా బైకులను కడగడమేంటని.. స్థానికులు..అటు వైపు వెళ్తున్నవారు నోరెళ్లబెడుతున్నారు.. కొందరైతే ఈ ఐడియా ఏదో బాగుందే అని అక్కడ ఆగి తమ బైక్ లను కూడా వాష్ చేసుకుంటున్నారు.

  మరోవైపు ఏపీలోని కొన్ని లంక గ్రామాల ప్రజల దీన పరిస్థితి మరీ వర్ణనాతీతం. కాగా భారీ వర్షాలు, వరదలతో ఓవైపు లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుంచి గోదావరికి వరదనీరు పోటెత్తింది. ఇప్పటికే తూర్పు గోదావరి ఏజెన్సీలోని పోలవరం ముంపు ప్రాంతంలోని దేవీపట్నం, కుక్కునూరు, రంపచోడవరం మండలాలు నీటమునిగాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Floods, AP News, Heavy Rains

  ఉత్తమ కథలు