హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Thunderstorm: పిడుగుపాటుతో నలుగురు కూలీల దుర్మరణం.. ఆ సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?

Thunderstorm: పిడుగుపాటుతో నలుగురు కూలీల దుర్మరణం.. ఆ సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?

పిడుగు పడి నలుగురు దుర్మరణం

పిడుగు పడి నలుగురు దుర్మరణం

Thunderstorm: వానలు పడుతున్నాయంటే.. పిడుగుల భయం తప్పదు.. తాజాగా జాయాయిల్ తోటలో పనికి వచ్చిన కూలీలను బలి తీసుకుంది.. పిడుగు పాటుతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.. అందుకే పిడుగులు పడినప్పడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ జాగ్రత్లు తీసుకోవాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Eluru, India

Thunderstorm: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు దంచికొట్టనున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ముంచెత్తె వానలు.. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా వరదలు వస్తే.. ముంపు ప్రాంతాల ప్రజలకు ఇక్కట్లు తప్పవు. ఈ వర్షాలతో పాటు పిడుగులు (Thunderstrom) ప్రజలను భయపడుతున్నాయి. ఉరుములు.. మెరుపులు.. ఈదురుగాలులతో భారీ వర్షం. మధ్యలో భారీ శబ్దాలు వస్తే భయపడక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలంలో పిడుగు పాటుకు గురై మనుషులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్న వార్తలు తరచూ వింటూ ఉంటాం.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా (Westgodavari District) లో పెను విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. కూలి పనులు వచ్చిన వారి జీవితాలు బలితీసుకుంది పిడుగుపాటు.. వారంతా జామాయిల్‌ తోటలో పనికి వచ్చారు.. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో సుమారు 30 మంది కూలీలు.. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. అందులో కొందరు జామాయిల్‌ కర్రలు తొలగిస్తుండగా పిడుగుపడడంతో.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : ఏపీ మాజీ మంత్రికి కేజీఎఫ్ డైరెక్టర్ ఏమవుతాడో తెలుసా? ప్రశాంత్ నీల్ అసలు పేరేంటంటే?

అసలు పిడుగలు ఎందుకు పడతాయి..?

పిడుగును అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉరుము.. మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి.. మేఘాలుగా మారతాయి. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాలతో మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతుంటాయి.

ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపే ఆ టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలి అంటే..?

ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తుంటాయి. మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణాల నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతుంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటి వరకు మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగు పాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. అంతలోనే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది.

ఇదీ చదవండి : వరి నాట్లు నాటి.. కౌలు రైతుగా మారిన జేడీ.. సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం.. రైతుగా మారడానికి కారణం ఏంటంటే?

అయితే మేఘాల నుంచి పడే పిడుగుల్లో కోట్ల వోల్టుల విద్యుత్‌ ఉంటుంది. ఇవి చెట్లను, జీవులను కాల్చిబూడిద చేసేటంత శక్తిని కలిగి ఉంటాయి. సముద్రం కంటే నేలపైనే అధికంగా పిడుగులు పడుతుంటాయి. పిడుగులు మూడు రకాలుగా ఉంటాయి. మెదటిది హీట్‌ లైట్నింగ్, రెండోది డ్రై లైట్నింగ్‌. వీటి కారణంగా అడవుల్లో మంటలు చెలరేగుతాయి. మూడోది బాల్‌ లైట్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఫొటోగ్రఫీతో పిడుగు ఏ రకానికి చెందినది అనేది గుర్తించడం సాధ్యపడుతుంది.

ఇదీ చదవండి: ఆ స్వీట్ స్టాల్ కు ఓ చరిత్ర ఉంది.. ఏంటో తెలిస్తే ఔరా అనాల్సిందే

మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి..

ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో భవనాలు, ఇంట్లో ఉండడంతో ఎంతో మంచిది. మూడు.. అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాల్లో ప్రయాణిస్తే వాటిలోనే ఉండిపోవాలి. పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. నేల పొడిగా ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పాందాలి. చెట్ల కిందకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. చెట్లు పిడుగును ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ వంటివి ఆపేయాలి. లేని పక్షంలో పిడుగు పడినప్పుడు అధిక విద్యుత్‌ ప్రసరించి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది.

నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. ఎందుకంటే నీరు మంచి విద్యుత్‌ వాహకం. ఉరుములతో కూడిన వర్షం పడుతుందనే సమాచారం ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది.

ఇదీ చదవండి : ఘనంగా వెంకటేశ్వర స్వామి వైభవోత్సవం.. పంచగవ్య ఉత్పత్తులకు భారీ డిమాండ్

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడరాదు. ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లొద్దు. గుంపులుగా ఉండటం కంటే..విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. పిడుగులు పడుతున్న సందర్భంలో నీటి కుళాయిల వినియోగం, స్నానం చేయడం, గిన్నెలు కడగడం వంటివి ఆపి వేయాలి. పైపులు, పాత్రల నుంచి అధిక విద్యుత్‌ ప్రవహించే అవకాశం ఉంది. పిడుగు బారిన పడిన వారిని ముట్టుకోవడం వలన ఎటువంటి నష్టం జరగదు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Eluru, West Godavari

ఉత్తమ కథలు