హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bikini Heroines: పంట పొలాలకు కాపలాగా బికినీ హీరోయిన్.. ఆగి మరి చూస్తున్న జనాలు

Bikini Heroines: పంట పొలాలకు కాపలాగా బికినీ హీరోయిన్.. ఆగి మరి చూస్తున్న జనాలు

పంట పొలానికి కాపలా ఉన్న బికినీ భామ

పంట పొలానికి కాపలా ఉన్న బికినీ భామ

Bikini Heroines: తమ పంటలను కాపాడుకోవడానికి రైతులు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఓ రైతు పొలానికి మాత్రం బికీనీ హీరోయిన్ కాపాలా కాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఆ హీరోయిన్ ను చూస్తూ అటు వెళ్తున్న జనం అక్కడే ఆగిపోతున్నారు.

ఇంకా చదవండి ...

  Bikini Heroines: సాధారణంగా రైతులు పొలంలో అనేక రకాల పంటలు వేస్తుంటారు. అందులో ఈ మధ్య ప్రభుత్వాల ప్రోత్సాహకాలు.. అవగాహన సదస్సులతో.. సంప్రదాయ పంటలకంటే.. వాణిజ్య పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాటికి భలే డిమాండ్ ఉంటోంది.. లాభాలు కూడా వస్తున్నాయి.  ఎప్పుడైనా రైతు చేతికి పంట బాగా వస్తోందో..? లాభాలు వస్తున్నాయని తెలుస్తుందో.. అప్పుడు ఆ రైతుకు అసైలన భయం మొదలవుతుంది. జనం దిష్టితో పాటు ఆ పంటలకు దొంగలు.. పశువులు, పక్షుల నుంచి దాడి తప్పకపోవచ్చు.. అందుకే ప్రతి రైతూ.. తన పొలంలో సాగుచేస్తున్న పైరుకు ఇరుగు పొరుగు దిష్టి తగలకూడదని ఆలోచన చేస్తారు. అందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు.. అలాగే ఓ రైతు (Farmer) ఐడియా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అతడి ఐడియాకు చుట్టుపక్కల రైతులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు అతడి ఐడియా కూడా పూర్తిగా వర్కవుట్ అయింది. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడో తెలుసా..?

  ఈ ఏడాది రైతుకు పంట దిగుబడి బాగా వచ్చింది. అందుకే తన పొలంలో పంటలు చూసి దిష్టి తగులుతుందని, బికినీ ధరించిన మోడల్స్ బ్యానర్లు పెట్టాడు. సాధారణంగా తోటలో దిష్టి కోసం మను షుల ఫొటోలు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకొందరైతే ఇటీవల హీరోయిన్ల ఫోటోలు కూడా పెడుతున్నారు. అయితే ఈ రైతు మరో అడుగు ముందుకు వేసి.. బికినీ హీరోయిన్ (Bikini Heroin) ను తన పొలానికి కాపలాగా పెట్టుకొని వినూత్నంగా ఆలోచించి సక్సెస్ అయ్యాడు.

  గతంలో అయితే దిష్టి కోసం గుమ్మడి కాయలు, కన్ను దిష్టి యంత్రాలు పెట్టేవారు. మరికొందరు గట్టితో దిష్టిబొమ్మలు తయారుచేసేవారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడంతా హైటెక్ కల్చర్. ఓరైతు బికినీ ధరించిన బ్యానర్ ఫోటోలు పెట్టాడు.. ఈ సంఘటన తిరుపతి జిల్లా (Tirupati District) వరదయ్యపాలెం మండలం పెద్దపాండూరులో జరిగింది. దీంతో ప్రస్తుతం అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ ఫోటోలను ఆసక్తిగా గమనిస్తున్నారు. తోటకు నరదిష్టి తగలకుండా ఉండేందుకు వీటిని పెట్టానని రైతు కిష్టయ్య తెలిపారు.

  ఇదీ చదవండి : ఏపీలో ఎన్నికలు ఎప్పుడు..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి వచ్చే సీట్లు ఎన్ని..? క్లారిటీ ఇచ్చిన విజయసాయి

  అయితే రోడ్లమీద వెళ్ళేటప్పుడు అందమయిన హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టడం మామూలే. కానీ ఈ పొలంలో వున్న ఫోటోలు చూసిన యువత ఈ బికినీలతో చంపేస్తున్నార్రా బాబూ.. పొలంలో వున్నాయి కాబట్టి సరిపోయింది.. అయితే ఈ ఫోటోలు రోడ్లమీద అయితే.. ప్రమాదాలు జరగకమానవు అంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వాటెన్ ఐడియా కిష్టయ్య అనక తప్పడంలేదు అంటున్నారు చుట్టూ ఉన్న యువత.. గతంలో కూడా కొందరు పక్షులు రాకుండా కాపాడుకోవడానికి పంట పొలంలో మనుషులు ఉన్నట్లుగా అందమైన హీరోయిన్ల ఫోటోలను పెట్టిన సందర్భాలు ఉన్నాయి. జనాల దృష్టి నుంచి పక్షుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలతో వారు సక్సెస్ అవుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chitoor

  ఉత్తమ కథలు