WEST GODAVARI FAKE MOVIE TICKETS RACKET BUSTED IN ELURU DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Fake Movie Tickets: ఏపీలో సరికొత్త దందా.. మీరు కొనే సినిమా టికెట్ నకిలీది కావొచ్చు.. బీ కేర్ ఫుల్..
ప్రతీకాత్మకచిత్రం
మనం నకిలీ కరెన్సీని చూసుంటాం.. నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులు చూసుంటాం.. నకిలీ బ్రాండ్స్ కూడా మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ నకిలీ సినిమా టికెట్ల (Fake Movie tickets) ను ఎప్పుడైనా చూశారా..? బ్లాక్ టికెట్ల దందా అందరికీ తెలిసిందే అయినా.. ఇది నకిలీ టికెట్ల దందా ఎవరికీ తెలియదు.
మనం నకిలీ కరెన్సీని చూసుంటాం.. నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులు చూసుంటాం.. నకిలీ బ్రాండ్స్ కూడా మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ నకిలీ సినిమా టికెట్ల (Fake Movie tickets) ను ఎప్పుడైనా చూశారా..? బ్లాక్ టికెట్ల దందా అందరికీ తెలిసిందే అయినా.. ఇది నకిలీ టికెట్ల దందా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సినిమా థియేటర్లలో నకిలీ టికెట్లు కలకలం రేపుతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహపడుతుంటారు. అందుకే ఎంత ఖర్చయినా చేసి టికెట్ కొంటారు. అలాంటి అభిమానాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. నకిలీ టికెట్లను ముద్రించి ఫ్యాన్స్ కు అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. టికెట్లు దొరికాయన్న ఆనందంలో సినిమా హాల్ కు వెళ్లిన వారికి అక్కడ షాక్ తగులుతోంది.
ఏపీలో కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. థియేటర్ల దగ్గర హిరోల అభిమానులు సందడి చేస్తుంటారు. ఇటీవల రిలీజ్ అయిన ఓ పెద్ద సినిమా టికెట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీంతో ఏలూరు జిల్లా (Eluru District) కేంద్రంలో ఓ వ్యక్తి రిలీజ్ కు ముందురోజే టికెట్ కు రూ.300 పెట్టి ఉదయాన్నే బెనిఫిట్ షోకి వెళ్లాడు. టికెట్లో ఉన్న సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. ఐతే అలా వెళ్లి కూర్చున్నాడో లేదో మరో వ్యక్తి వచ్చి ఈ సీట్ నాదంటూ టికెట్ చూపించాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. థియేటర్ సిబ్బంది వచ్చి సదరు వ్యక్తి టికెట్ నకిలీదంటూ బయటకు పంపేశారు. ఐతే థియేటర్లో అవమానం జరగడంతో అతను యాజమాన్యాన్ని నిలదీశాడు. ఈ టికెట్ ఎలా వచ్చిందో చెప్పాలని ప్రస్నించాడు. అంతేకాదు వెళ్లి ఏలూరు వన్ టౌన్ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాడు.
ఐతే బ్లాక్ టికెట్ల ఫిర్యాదులు పోలీసులకు కామన్.. ఐతే నకిలీ టికెట్ అంటూ కంప్లైంట్ రావడంతో పోలీసులు కూడా కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. బాధితుడు ఇచ్చిన టికెట్ ను పట్టుకొని విచారించగా.. థియేటర్ సిబ్బందిలోని కొందరు ఇలా నకిలీ టికెట్లు ముద్రించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతి షోకి 10-20 నకిలీ టికెట్లు ముద్రించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. సీట్లు సరిపోకపోతే హౌస్ ఫుల్ అయిందంటూ ఎక్స్ ట్రా కుర్చీలు వేసి మేనేజ్ చేస్తున్నారు. అభిమాన హీరో, అందునా ఫస్ట్ డే ఫస్ట్ షో కావడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ బలహీనతే థియేటర్ సిబ్బందికి కాసులు కురిపిస్తోంది.
షోకి కనీసం 10 నకిలీ టికెట్లు విక్రయించినా వేలల్లో రాబడి ఉంటుంది. అలా రోజుకి దాదాపు 10వేల వరకు అక్రమంగా సంపాదించవచ్చు. ఈ దందా థియేటర్ యాజమాన్యాలకు తెలియకుండానే జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. సో సినిమా టికెట్ దొరికిందికదా అని చూసుకోకుండా వెళ్తే మాత్రం అది నకిలీది కావొచ్చు. సో ఆన్ లైన్లో అన్నీ పరిశీలించిన తర్వాత కొంటే బెటర్ అని పలువురు సలహా ఇస్తున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.