హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Second Marriage: రెండో పెళ్లి చేసుకున్న భర్తకు రెండేళ్ల జైలు.. రెండో భార్యకు కూడా శిక్ష.. కోర్టు సంచలన తీర్పు..

Second Marriage: రెండో పెళ్లి చేసుకున్న భర్తకు రెండేళ్ల జైలు.. రెండో భార్యకు కూడా శిక్ష.. కోర్టు సంచలన తీర్పు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Eluru: పెళ్లిచేసుకొని ఏకారణంతో అయినా.. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకునే ప్రబుద్ధులకు హెచ్చరిక ఈ తీర్పు. పెళ్లై భార్య ఉన్నా మరో పెళ్లి చేసుకుంటుటారు కొందరు తెలివైన భర్తలు. మొదటి భార్యకు తెలియకుండా కొందరు, కుటుంబ కలహాల నేపథ్యంలో విడాకులు ఇవ్వకుండా కొందరు, ఇతర కారణాలతో కొందరు ఇలాంటి వారికీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖబర్ధార్.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Eluru, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati


  పెళ్లిచేసుకొని ఏకారణంతో అయినా.. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకునే ప్రబుద్ధులకు హెచ్చరిక ఈ తీర్పు. పెళ్లై భార్య ఉన్నా మరో పెళ్లి చేసుకుంటుటారు కొందరు తెలివైన భర్తలు. మొదటి భార్యకు తెలియకుండా కొందరు, కుటుంబ కలహాల నేపథ్యంలో విడాకులు ఇవ్వకుండా కొందరు, ఇతర కారణాలతో కొందరు ఇలాంటి వారికీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖబర్ధార్. రెండో పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న భర్తతో భార్యకు కూడా శిక్షవిధించి తప్పుచేసిన వారికి హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) అత్తిలికి చెందిన కొండేటి ఫణి వెంకట సూర్య నారాయణ కొన్నేళ్ల క్రితం నాగదుర్గను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం వీరి సంసారం సజావుగానే సాగింది.


  ఐతే ఇద్దరి మధ్య కలహాలు రావడంతో ఫణి వెంకట సూర్య నారాయణ భార్య నాగదుర్గను విడిచిపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన రామలక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సంసారంలో కలహాలు మర్చిపోయి భర్త తనకు దగ్గరవుతాడని భావించిన నాగదుర్గ.. సూర్యనారాయణ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. తనకు విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.


  ఇది చదవండి: అతడికి 23, ఆమెకు 50.. ఇద్దరి మధ్య ప్రేమ.. చివరికి ఊహించని ట్విస్ట్


  నాగదుర్గ నుంచి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు.. విచారణ జరిపి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును ఏలూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దివాకర్ తుది విచారణ చేసారు. వాదోపవాదనలు విన్న జడ్జి కొండేటి ఫణి వెంకట సూర్య నారాయణతో పాటు అతడి రెండో భార్య రామలక్ష్మికు రెండేళ్లు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా కొండేటి ఫణి వెంకట సూర్య నారాయణ మొదటి భార్య నాగదుర్గకు ఐదు లక్షల పదివేల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.


  ఇది చదవండి: కొడుకు చనిపోయిన 50 రోజులకు కోడలి ఫోన్ చూసిన మామ.. వాట్సాప్ లో విస్తుపోయే మెసేజ్‌లు..


  ఈ తీర్పుతో భార్య ఉండగానే ఆమె నుంచి విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకునేవారికి గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయింది. ఐతే ఈ కేసులో రెండో భార్యకు కూడా శిక్ష పడటం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి భార్యను మోసం చేసిన వాడికి తగిన శిక్షే పడిందని బాధితురాలి తరపు బంధువులంటున్నారు.  ఇదిలా ఉంటే కోర్టులు ఇలాంటి తీర్పులిస్తుంటే కొందరు నిత్యపెళ్లికొడుకులు మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇటీవల పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఎన్నారైని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా క్రోసూరుకు చెందిన ఓ ఎన్నారై వైజాగ్, విజయవాడ, గుంటూరుకు చెందిన ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. చివరికి ఐదో భార్య కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులకు చిక్కాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Eluru, Wife and husband

  ఉత్తమ కథలు