హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Police Fighting: అమ్మాయి కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందంటే..!

AP Police Fighting: అమ్మాయి కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందంటే..!

సీఐ కృష్ణ భగవాన్, కానిస్టేబుల్ రాజేష్ (ఫైల్)

సీఐ కృష్ణ భగవాన్, కానిస్టేబుల్ రాజేష్ (ఫైల్)

West Godavari: ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరిగింది. ఏకంగా కొట్టుకునేవరకు వెళ్లింది. అమ్మాయి కోసం సీఐ, కానిస్టేబుల్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. యూనిఫార్మ్ లో ఉండి కూడా క్రమశిక్షణ తప్పారు. గీతదాటి ప్రవర్తించిన వారిపై వేటు తప్పలేదు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  సాధారణ ప్రజల మధ్య జరిగే గొడవలను పోలీసులు పరిష్కరిస్తుంటారు. కేసులు నమోదు చేయడానికంటే ముందు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటారు. సరిహద్దు గొడవలు, కటుంబ కలహాలు, ఇతర వ్యవహారాల్లో స్టేషన్ మెట్లెక్కితే పరిష్కార మార్గం చూపిస్తారు. కానీ ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరిగింది. ఏకంగా కొట్టుకునేవరకు వెళ్లింది. అమ్మాయి కోసం సీఐ, కానిస్టేబుల్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. యూనిఫార్మ్ లో ఉండి కూడా క్రమశిక్షణ తప్పారు. గీతదాటి ప్రవర్తించిన వారిపై వేటు తప్పలేదు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లో జరిగింది. జిల్లా కేంద్రం భీమవరంలో మహిళా కానిస్టేబుల్ విషయంలో సీఐకి, కానిస్టేబుల్ కి మధ్య ఘర్షణ జరిగింది.

  భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజేష్ కు అదే స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కు మధ్య స్నేహముంది. అది కాస్తా ప్రేమగా మారినట్ను తెలుస్తోంది. ఐతే వీళ్లిద్దరి మధ్య బంధాన్ని సీఐ కృష్ణ భగవాన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఆ కారణం చేత రాజేష్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయినా రాజేష్, మహిళా కానిస్టేబుల్ క్లోజ్ గా ఉండటం, తరచూ ఫోన్లు, మెసేజ్ లు చేస్తుండటంతో సీఐ కృష్ణ భగవాన్ జీర్ణించుకోలేకపోయాడు.

  ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 26వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వివరాలివే..


  ఈ నేపథ్యంలో రాజేష్ తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఏ జరిగిందో ఏమో తెలియదుగానీ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. విషయం కొట్టుకునేంత వరకు వెళ్లడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సీఐ కృష్ణ భగవాన్, కానిస్టేబుల్ రాజేష్ తో సహా మహిళా కానిస్టేబుల్ ను పిలిపించిన అధికారులు ముగ్గుర్నీ మందలించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కృష్ణ భగవాన్ ను వీఆర్ కు పంపారు. కానిస్టేబుల్ రాజేష్ ను మొగల్తూరు పీఎస్ కు, మహిళా కానిస్టేబుల్ ను తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ముగ్గురి మధ్య గొడవ సర్దుమణగడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

  ఇది చదవండి: అంత్యక్రియలు చేసిన 41 రోజుల తర్వాత ప్రత్యక్షం.. ఫ్యామిలీ ఫ్యూజులు ఔట్..


  ఐతే రాజేష్-మహిళా కానిస్టేబుల్ మధ్య ప్రేమను సీఐ ఎందుకు వ్యతిరేకించారన్నది పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మేటర్ ఏకంగా కొట్టుకునేంతవరకు వెళ్లడంతో అంతగా దారి తీసిన పరిస్థితులేంటనేదానిపైనా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఘటన చల్లారుతుంతా.. మళ్లీ రేగుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఐతే కానిస్టేబుళ్లిద్దరిపైనా బదిలీ వేటు వేసిన అధికారులు.. సీఐని మాత్రం వీఆర్ కి పంపి షాకిచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Police, West Godavari

  ఉత్తమ కథలు