AP Floods: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఓ వైపు ఎడతెరిపి లేని వానలు.. మరోవైపు ఎగువనున్న మహారాష్ట్ర (Maharastra), తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గఢ్ (chhattisgarh), ఒడిశా (Odisha)ల్లో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా.. ఏపీకి వరద (Andhra Pradesh Floods) పోటెత్తుతోంది. ఉభయ గోదావరి జిల్లా లను అతలాకుతలం చేస్తోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) నుంచి ధవళేశ్వరం (Davleswaram) వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. ఈ వరద ధాటికి లంక గ్రామాలు అన్నీ పూర్తిగా నీట మునిగాయి. చాలా గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. గోదావరిలో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.. ఎగువన భద్రాచలం దగ్గర గంట గంటకు గోదావరి ప్రవాహం పెరుగుతూ.. మూడో ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటుతుండగా.. పోలవరం ముంపు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ముంపు గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ప్రభావం ఓ పెళ్లి కూతురపైనా పడింది..
కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే ఆమె పెళ్లి మండపానికి.. అట్టహాసంగా ఊరేగింపుగా ఆమె వెళ్లాలి అనుకుంది. కానీ పెదపట్నంలంకను గోదావరి వరద చుట్టు ముట్టింది. రోడ్లు ముంపు బారిన పడటంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఆమె పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చింది.
Bride on boat Travelling for marriage in floods konaseema District|| వరద... https://t.co/mtuIu936Z0 via @YouTube #floods2022 #floodsituation #HeavyRains #rains #Konaseema #flooding #AndhraPradesh #AndhraPradeshnews
— nagesh paina (@PainaNagesh) July 15, 2022
సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు, వరదలు ఎక్కువగా ఉంటాయని భావించిన రెండు కుటుంబాలు.. ముందుగానే అంటే జులై నెలలో ముహూర్తం పెట్టుకున్నారు.. అయినా, వారికి వరద కష్టాలు తప్పలేదు.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఎంతో అట్టహాసంగా ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాలని చేసుకున్న ప్లాన్ వర్షాల దెబ్బకు విఫలమైంది. ఊహించని రీతిలో ఎదురైన వరద బెడద ఆడ పెళ్లివారిని నానా తంటాలు పెట్టింది. వరద నీరు వారి గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టేయటంతో చేసేది లేక పెళ్లికుమార్తె పడవలో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
మొత్తానికి అష్టకష్టాలు పడి పెళ్లి కుమార్తెను అతి ముఖ్యులతో కలిసి పడవపై అప్పనపల్లి కాజ్వే వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో కేశనపల్లికి చేరుకున్నారు. ముహూర్త సమయానికి కాస్త ఆలస్యమైనా పెళ్లి వేదిక వద్దకు చేరుకోగలిగారు. అనంతరం పెద్దలు పెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తంగా.. కల్యాణం వచ్చినా, కక్కొచ్చొనా ఆగదని చెబుతుంటారు పెద్దలు.. పెద్ద వరద వచ్చినా.. వీరి పెళ్లి ఆపలేకపోయిందంటూ.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, AP News, Godavari river, Heavy Rains