CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) 2024 ఎన్నికల్లో 175కి 175 గెలవడమే లక్ష్యమంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించి అక్కడ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఆయన.. అభివృద్ధిని గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆ వివమర్శలకు చెక్ పెడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి (Andhra Pradesh Aqua University), బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ (Fishing Houber)కు, 1,400 కోట్ల రూపాయలతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. తరువా బహిరంగ సభలో మాట్లాడుతారు.
డు సీఎం శంకుస్థాపన చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం దేశంలోనే మూడవది. ఇప్పటి వరకు తమిళనాడు , కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి. ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు.
ఇక రెండవ దశ పనుల్లో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో 222 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం, పరిశోధన కేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో మత్స్యకారులు, ఆక్వా రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వా రంగంలో నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చు.
వీటి ద్వారా దాదాపు సంవత్సరానికి 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే అవసరమైన సంఖ్యలో ఫిషరీస్ డిప్లొమా, బీఎఫ్ఎస్సీ, ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులను తయారు చేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు, మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటితో పాటు.. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రారంభాని సిద్ధంగా ఉంది. బియ్యపుతిప్ప దగ్గుర 150 ఎకరాల విస్తీర్ణంలో 429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ హార్బర్ నిర్మాణం ద్వారా మత్స్యకారులు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వేటకు వెళ్లేందుకు వీలుంటుంది.
ఇదీ చదవండి: మారుతున్న ఏపీ రాజకీయాలు.. పవన్ ను వైసీపీ వదిలేస్తోందా..?
అలాగే సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి, కొల్లేరులో 5వ కాంటూర్ వరకు మంచి నీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నదిపై కిలోమీటరు 57.950 దగ్గర మొల్లపర్రు విలేజ్ లిమిట్స్‌లో 188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జ్ కమ్ లాక్ నిర్మాణం కొరకు రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది.క దీనికి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఇలా విరామం లేని షెడ్యూల్ తో సీఎం నరసాపురం పర్యటన కార్ దీంతో ముఖ్యమంత్రి జగన్ నేడు దీనికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చదవండి : అమెరికాలో అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం.. ఖరీదు ఎంతో తెలుసా?
సీఎం జగన్ పూర్తి షెడ్యల్ ఇదే..
సీఎం జగన్ నేటి ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 – 12.50 మధ్య వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. తరువాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి రిటన్ అవుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, West Godavari, Ycp