హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Tour: నేడు బాధితులతో నేరుగా సమావేశం.. రెండో రోజూ ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

CM Jagan Tour: నేడు బాధితులతో నేరుగా సమావేశం.. రెండో రోజూ ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

నేడు కొనసాగనున్న సీఎం జగన్ టూర్

నేడు కొనసాగనున్న సీఎం జగన్ టూర్

CM Jagan Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటన నేడు కూడా కొనసాగనుంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించి.. ముంపు బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.

  CM Jagan Tour: ఆంధ్ర్రప్రదేశ్ సీఎం జగన్ (AP CM YS Jagan) అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో (Flood effected ares) పర్యటన కొనసాగుతోంది. తన తొలిరోజు పర్యటనలోనే ఆయన బాధితులకు అండగా ఉంటాననే భరోసా కల్పించారు. మంగళవారం ముమ్మిడివరం, పి.గన్నవరం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన.. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద నష్టం అంచనాలు పూర్తి కాకుండానే సాయం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక ఇవాళ రెండో రోజు వరద ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గత కొంతకాలంగా గోదావరి నది (Godavari River) పరివాహక ప్రాంతాల్లో వరదలు బీభత్సం కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు జగన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ముంపు బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.

  కాసేపట్లో రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి ముఖ్యమంత్రి బయలుదేరి ఏఎస్‌ఆర్‌ జిల్లా చింతూరు చేరుకోనున్నారు. చింతూరు మండలంలోని కుయుగూరు, చట్టి గ్రామాల్లోని వరద బాధితులతో సమావేశం కానున్నారు. బాధితులను అక్కడ తాజా పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు.

  మధ్యాహ్నమే తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశం కానున్నారు సీఎం. బాధితులకు అందిన సహాయ సహకారాలపై ఆరా తీయనున్నారు. ఒంటిగంట తరువాత అక్కడి నుంచి బయలుదేరి సీఎం జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన ఏర్పాట్లు చేశారు.


  తొలి రోజు పర్యటనలో ఆయన బాధితులకు పూర్తి భరోసా కల్పించారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బాధితులకు అండగా నిలుబడుతున్నామన్న ఆయన.. ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామన్నారు. పుచ్చకాయలవారి పేట, ఊడుమూడి లంకలో నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

  ఇదీ చదవండి : వలతో పని లేదు.. చేపలు ఎలా పడుతున్నారో చూడండి.. ఎన్ని దొరికాయంటే?

  అలాగే వరద సాయంపై బాధితులతో మాట్లాడిన ఆయన.. పునరావాస కేంద్రాల్లో అందిన సాయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులు కూడా తమకు సరైన సాయం అందినట్లు జగన్ కు తెలిపారు. ఈ సందర్భంగా వరద సహాయక చర్యల్లో వాలంటీర్ల సేవలను సీఎం మెచ్చుకున్నారు. వరద సాయంలో వాలంటీర్లు బాగా పనిచేశారని స్థానికులు కూడా చెప్పడంతో జగన్ హర్షం వ్యక్తం చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, East Godavari Dist

  ఉత్తమ కథలు