Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
CM Jagan: పార్టీ అధినేత ఎవరైనా ఎన్నికలకు సిద్ధమైనప్పుడు.. చాలా అస్త్రాలను సిద్ధం చేసుకుంటారు.. అందులో ప్రధానమైనవి.. ఎన్నికల నినాదామే.. ఎలాంటి నినాదాన్ని ఎత్తుకున్నారన్నదానిపైనా గెలుపు ఓటమలు ప్రభావం ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో గెలుపొందనానికి ప్రధాన కారణం జగన్ అందుకున్న నినాదాలే.. అప్పుడు ఏం చెప్పారంటే.. ఒక్క ఛాన్స్.. బై బై బాబు.. ఈ రెండు నినాదాలనే ప్రజల్లో ఎక్కువగా వినిపించారు. ఈ రెండింటికి ఓటర్లు బాగానే కనెక్ట్ అయ్యారు. దీంతో ఈసారి జగన్ ఎలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తారు.. వన్ మోర్ ఛాన్స్ అంటారా.. లేక మరేదైనా స్లోగన్ ఎత్తుకుంటారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఆ ఉత్కంఠకు జగన్ తెరదించారు.
అయితే ఆ స్లోగన్ కు హింటు ఇచ్చింది మాత్రం తెలుగు దేశం పార్టీనే కావడం విశేషం.. ఓ వైపు బాదుడే బాదుడు అంటూ వైసీపీ పాలనపై పోరాటం చేస్తున్న టీడీపీ .. తాజాగా ఇదేం ఖర్మ అంటూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అదే టైటిల్ తో భారీ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. దాన్నే వైఎస్ జగన్ లీడ్ గా తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే రాగం అందుకున్నారు.
సాధారణంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పంచ్ డైలాగులు తప్పనిసరిగా మారింది. పేజీల పేజీలు డైలాగులు చెప్పినా ప్రస్తుతం ప్రజలకు వినే ఓపిక తక్కువే.. కానీ ఒకే ఒక్క పంచ్ డైలాగ్ పడితే మాత్రం అదేమిటా అని ఆలోచిస్తారు. అందుకే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అభివృద్ధిపై గంటల పాటు స్పీచ్ ఇచ్చినా జనం పట్టించుకోలేదు. జగన్ చెప్పిన పంచ్ డైలాగుల వైపే ప్రజలు మొగ్గు చూపారు.
నరసాపురం సభలో ప్రసంగించిన వైఎస్ జగన్.. చంద్రబాబును ప్రజలు వద్దంటున్నారని.. అందుకే మరోసారి బై బై బాబు అంటున్నారన్నారు. అదే సమయంలో ఇదేం ఖర్మరా బాబు అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును చూసి పుత్రుడు, దత్తపుత్రుడు కూడా ఇదేం ఖర్మరా బాబు అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. దీంతో వైసీపీ నేతలు సైతం ఇప్పుడు.. ఇదేం ఖర్మారా బాబు అనే నినాదంతోనే ఎన్నికలకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.
ఇదీ చదవండి: వైభవంగా కార్తీక చివరి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
వైఎస్ జగన్ నోటి నుంచి ఇదేం ఖర్మరా బాబు అనే మాట వచ్చిన వెంటనే... వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ మాటను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ పెట్టి మరీ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇదే వైసీపీ స్లోగన్‌గా మారేలా కూడా ఉంది. మరి ఈ నినాదా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp